View

సాయిగారు కథను నమ్మారు - అజయ్

Tuesday,October07th,2014, 01:55 PM

ఓ హీరోకి ఉండాల్సిన హైటు, వెయిటూ అజయ్ కి ఉన్నప్పటికీ.. కేరక్టర్ నటుడిగా, విలన్ గా మాత్రమే చేస్తున్నాడు. ఆ మధ్య 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు' ఇలా మూడు, నాలుగు చిత్రాల్లో కథానాయకునిగా నటించాడు. ఆ తర్వాత విలన్, కేరక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న అజయ్ కొంత విరామం తర్వాత హీరోగా నటించిన చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. వారాహి చలన చిత్రంపై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. త్రికోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల సందర్భంగా అజయ్ తో జరిపిన ఇంటర్వ్యూ...

ముందుగా 'దిక్కులు చూడకు రామయ్య'కు అవకాశం ఎలా వచ్చిందో చెబుతారా?

త్రికోటితో నాది ఇప్పటి పరిచయం కాదు. ఆయన రాజమౌళి శిష్యుడనే సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు'లో నేను విలన్ గా చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడే నాకు త్రికోటితో అనుబంధం పెరిగింది. ఆయన చాలా మంచి టెక్నీషియన్. 'దిక్కులు చూడకు రామయ్య' కథతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే ఓకే అన్నాను.

వెంటనే ఓకే చెప్పడానికి కారణం?

తండ్రి, కొడుకు ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ కథ చాలా వినూత్నంగా ఉంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తాడనే నమ్మకం కుదిరింది. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ కథే. నా పాత్ర పేరు మీదే టైటిల్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది.

ఇందులో 20ఏళ్ల కొడుక్కి తండ్రిగా నటించారుగా..?

అది కొంచెం సవాల్ అనిపించింది. నేనిప్పటివరకు చేయని కారెక్టర్ ఇది. చాలా ఇష్టపడి చేశాను. సినిమా టైటిల్ నుంచి చివరి వరకు కథ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. నేనీ చిత్రంలో నటిస్తున్నప్పుడు మంచి అనుభూతికి గురయ్యాను. ఇక ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది.

విలన్ గా విజృంభిస్తుంటారు కదా.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలో హీరోగా నటించాలని లేదా?

నిజం చెప్పాలంటే నాకలాంటివి నప్పవు. 'దిక్కులు చూడకు రామయ్య' వంటి కొత్త జోనర్ చిత్రంలో నటిస్తే.. భవిష్యత్తులో అలాంటివి చేసే అవకాశం వస్తుంది కదా.

ఎక్కువ శాతం నెగటివ్ రోల్స్ చేసిన మీరు ఈ పాజిటివ్ రోల్ లో ఒదిగిపోయిన వైనం గురించి?

ముందుగా నా బాడీ లాంగ్వేజ్ ని మార్చుకున్నాను. అలాగే లుక్ వైజ్ గా చాలా కేర్ తీసుకున్నాను. నన్ను నెగటివ్ రోల్స్ లో ఎక్కువగా చూసిన ప్రేక్షకులు నాలో మరో కోణాన్ని చూస్తారు. కేవలం లుక్ పరంగానే కాదు.. నటన పరంగా కూడా కొత్త అజయ్ ని చూస్తారు.

వారాహి చలన చిత్రం సంస్థలో సినిమా చేయడంపై మీ ఫీలింగ్?

సాయి కొర్రపాటి మంచి పేషన్ ఉన్న నిర్మాత. నాకు తెలిసి వేరే ఏ నిర్మాత అయినా 'దిక్కులు చూడకు రామయ్య'ను తీయడానికి ఆలోచిస్తారు. కానీ, ఓ వినూత్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలనే ఉద్దేశంతో, కథ మీద నమ్మకంతో సాయిగారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. ఎక్కడా అసభ్యం ఉండదు.

భవిష్యత్తులో కూడా తండ్రి పాత్రలు చేస్తారా?

కథ ఆసక్తిరంగా ఉంటే తప్పకుండా చేస్తాను.

మరి.. హీరోగా కూడా చేయాలనుకుంటున్నారా?

నాకు నప్పే కథలొస్తే చేస్తా.

Ajay Interview About Dikkulu Choodaku Ramaiah



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !