View

'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' నిరూత్సాహపరచదు - హీరో నరేష్

Tuesday,November04th,2014, 02:46 PM

కామెడీ కింగ్ గా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుని, కామెడీ హీరోగా అల్లరి నరేష్ సక్సెస్ ఫుల్ గా కెరియర్ కొనసాగిస్తున్నారు. 50సినిమాలకు దగ్గర్లో ఉన్న అల్లరి నరేష్ ప్రస్తుతం చేసిన సినిమా 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'. సిరి మీడియా పతాకంపై 'వీడు తేడా' ఫేం చిన్నికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అమ్మిరాజు కానుమిల్లి నిర్మించారు. ఇందులో అల్లరి నరేష్ సరసన మోనాల్ గజ్జర్ కథానాయికగా నటిస్తే, ప్రముఖ నటి రాధ తనయ కార్తీక సిస్టర్ గా నటించింది. ఈ చిత్రం నవంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మీడియాతో ఈ సినిమా గురించి, తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి ఇచ్చిన ఇంటర్య్వూ ఈ విధంగా...

'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' టైటిల్ చాలా ఫన్నీగా ఉంది?

అవునండి. ఈ టైటిల్ కి మంచి స్పందన లభించింది. ఫన్నీగా ఉందని అందరూ అంటున్నారు.

సాధారణంగా హీరోని ఎలివేట్ చేసే విధంగా టైటిల్స్ ఉంటాయి కదా? మరి ఈ టైటిల్ మీతో పాటు మరో క్యారెక్టర్ ని కూడా సజ్జెస్ట్ చేస్తోంది కదా?

కథకు సరిపడా టైటిల్. బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెఫ్ట్ తో రూపొందిన చిత్రం ఇది. కాబట్టి ఈ టైటిల్ ని పెటట్డం జరిగింది.

అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది?

'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం' చిత్రానికి వర్క్ చేసిన విక్రమ్ రాజు గారు ఈ స్టోరీ లైన్ చెప్పారు. బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి కాబట్టి, ఈ ప్రాజెక్ట్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. ''అయితే సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకూ బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెఫ్ట్ తో సినిమాలు చేసారు. ఆ సినిమాల్లో సిస్టర్ అంటే ఎలా ఉండాలో చూపించారు. కానీ ఈ కథలో సిస్టర్ ఎలా ఉండకూడదో చెబుతాము అని చెప్పి'' ఓ సీన్ చెప్పారు. ఆ సీన్ నాకు చాలా నచ్చింది. దాంతో స్టోరీ డెవలప్ చేయమని చెప్పాను. స్ర్కిఫ్ట్ పూర్తయిన తర్వాత మా అందరికీ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడం జరిగింది.

హీరోయిన్ గా చేస్తున్న కార్తీకగారు మీ సిస్టర్ గా నటించడానికి ఎలా అంగీకరించారు?

తను కూడా నాలానే బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెఫ్ట్ అనగానే ముందుగా నో చెప్పింది. అయితే కథ విన్న తర్వాత ఈ సినిమా చేయడానికి అంగీకరించింది. అందుకు ఆమెకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

కార్తీక క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

ఎలాంటి సిట్యువేషన్ అయినా బ్రెయిన్ తో ఆలోచించి హ్యాండిల్ చేయకుండా, చేతికి పని చెప్పే ఆవేశపరురాలు. గయ్యాళి. చిన్నప్పట్నుంచి నాకు చుక్కలు చూపిస్తుంది. అయితే ఈ పాత్రలో నెగటివ్ షేడ్ కనిపించదు. ఈ పాత్రను కార్తీక అద్భుతంగా చేసింది. డ్యాన్స్ బాగా చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ సైతం చాలా ధైర్యంగా చేసింది.

అంటే మీ సిస్టర్ పాత్ర మిమ్ముల్ని డామినేట్ చేసే విధంగా ఉంటుందా?

డామినేట్ చేసే విధంగా అనేకంటే ఇద్దరు హీరోలు అంటే బాగుంటుంది. à°ˆ సినిమాలో మేము ట్విన్స్ à°—à°¾ నటించాము. తను ఆవేశపరురాలైతే, నేను ఆలోచనపరుడిని. తను ఆవేశంలో చేసే పనులకు, నేను రియాక్ట్ అయ్యే విధానం ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. సో.. à°•à°¥ ప్రకారం తను ఫైట్స్ గట్రా చేసినా, à°•à°¥ నడిపించేది మాత్రం నేనే. తను చేసే పనులు వల్ల మా ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంటే,  à°† ఇబ్బందుల నుంచి నేను, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ బయటపడే విధానం ఎంటర్ టైనింగ్ à°—à°¾ ఉంటుంది.

బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెఫ్ట్ కదా? సెంటిమెంట్ సీన్స్ కంట తడి పెట్టిస్తాయా?

అంత హెవీ సెంటిమెంట్ ఈ సినిమాలో ఉండదు. రెండు నిముషాలు పాటు సాగే ఓ సెంటిమెంట్ సీన్ ఉంది. అది ప్రేక్షకులను కదిలిస్తుంది.

ఈ సినిమా హైలెట్స్ గురించి చెప్పండి?

కార్తీక ఫైట్స్,  à°¤à°¨à± చేసే పనులకు నేను వేసే పంచ్ డైలాగ్స్, బ్రహ్మానందంగారు , మా మధ్య సాగే కామెడీ సీన్స్ à°ˆ సినిమాకి హైలెట్స్ à°—à°¾ నిలుస్తాయి.

కోన వెంకట్ పేరు బ్రహ్మానందం పాత్రకు పెట్టారు కదా? దాని గురించి చెప్పండి?

యాక్చువల్ గా బ్రహ్మానందంగారు కోలా క్యాటరింగ్ సర్వీసెస్ నిర్వహిస్తుంటారు. అందుకని కోలా అని పేరు పెట్టాం. అయితే బ్రహ్మానందంగారు కోలా పేరు పాపులర్ కాదని, కోన వెంకట్ పేరు సజెస్ట్ చేసారు. నేను కుక్ చేస్తుంటాను... తను కథలు కుక్ చేస్తాడు అంత కదా అని కూడా అన్నారు. దాంతో కోన వెంకట్ పేరును ఫిక్స్ చేసాం. ఈ విషయాన్ని కోన వెంకట్ గారికి చెప్పాము. ఫైనల్ కాపీ చూసి ఆయన కూడా ఎంజాయ్ చేసారు.

డైరెక్టర్ చిన్నికృష్ణ గురించి చెప్పండి?

చిన్నికృష్ణ గారు ఈ కాన్సెఫ్ట్ ని పర్ ఫెక్ట్ గా తెరకెక్కించారు. వంద శాతం న్యాయం చేసారు. ఈ కాన్సెఫ్ట్ చెప్పి కార్తీకను ఒప్పించిన క్రెడిట్ కూడా తనకే దక్కుతుంది.

మీ తదుపరి ప్రాజెక్ట్ గురించి?

బందిపోటు చిత్రం చేస్తున్నాను. ఎ టివి వారి సినిమా కూడా జరుగుతోంది. దీని తర్వాత 50వ చిత్రం. ఈ ఫిగర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. దాంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. నిజం చెప్పాలంటే నాకే భయమేస్తోంది. అందుకే ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వకుండా, సినిమా ఆరంభించి, పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము.

50వ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యారా?

భీమినేని శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, క్రిష్ ఇంకా మరికొంతమంది అప్రోచ్ అయ్యారు. అయితే కథ, డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు.

మీరెప్పుడు మెగా ఫోన్ పట్టబోతున్నారు?

2017లో నేను మెగా ఫోన్ పట్టుకుంటాను. ఇందుకోసం à°“ స్ర్కిఫ్ట్ ని తయారు చేస్తున్నాను. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.  à°Žà°µà°°à°¿à°¨à±€ నిరుత్సాహపరచదు అని చెబుతూ ఇంటర్య్వూ ముగించారు అల్లరి నరేష్.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !