View

'పటాస్' కథను డీల్ చేసిన విధానం నచ్చుతుంది - డైరెక్టర్ అనిల్ రావిపూడి

Wednesday,January21st,2015, 11:00 AM

శౌర్యం, శంఖం, కందిరీగ, మసాలా... ఇలా పలు చిత్రాలకు రచయితగా పని చేసిన అనిల్ రావిపూడి మెగాఫోన్ పట్టుకుని దర్శకత్వం వహించిన చిత్రం 'పటాస్'. యన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం ఇది. ఇందులో శృతి సోది కథానాయికగా నటించింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి మీడియాతో సమావేశమయ్యారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆ విశేషాలు ఈ విధంగా...

'పటాస్' కథ గురించి చెప్పండి?
ఒక్క లైన్ లో చెప్పాలంటే అవినీతిపరుడైన పోలీసాఫీసర్ నిజాయితీపరుడిగా ఎలా మారాడు అనేదే 'పటాస్' కథ. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఈ కథలో మిళితమై ఉంటుంది.

కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది?
పోలీసాఫీసర్ గా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. తన క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. ఎంటర్ టైనింగ్ వేలో హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. హీరో, విలన్ మధ్య సన్నివేశాలు చాలా బాగుంటాయి. కళ్యాణ్ రామ్ లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది.

'పటాస్' సినిమా ఎలా సెట్ అయ్యింది?
కళ్యాణ్ రామ్ 'ఓం' చిత్రం చేస్తున్నప్పుడు ఈ కథ చెప్పాను. కథ నచ్చింది. నేనే నా బ్యానర్ లో ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తానని కళ్యాణ్ రామ్ అన్నారు. మీ కోసం ఈ కథ తయారు చేసానని చెప్పాను. సరే 'ఓం' విడుదలైన తర్వాత ఆలోచిద్దాం అన్నారు. ఆ తర్వాత నేను 'మసాలా' చిత్రానికి రచయితగా చేసాను. కళ్యాణ్ రామ్ ఓ రోజు నన్ను పిలిపించి నువ్వు చెప్పిన కథతో సినిమా చేద్దామని అన్నారు. అలా స్ర్కిఫ్ట్ డెవలప్ చేయడం జరిగింది. కథకు 'పటాస్' టైటిల్ బాగుంటుందని భావించి ఈ టైటిల్ ని పెట్టాము.

హీరోగా, నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఇన్ వాల్వ్ మెంట్ ఈ సినిమాలో ఎంతవరకూ ఉంది?
నిర్మాతగా ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. కథను నమ్మారు. దాంతో సినిమా ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కళ్యాణ్ రామ్. ఇక హీరోగా వంద శాతం తన పాత్రకు న్యాయం చేసారు. పోలీసాఫీసర్ గా కళ్యాణ్ రామ్ ఒదిగిపోయిన వైనం అందరికీ నచ్చుతుంది. నందమూరి అభిమానులను కూడా 'పటాస్' నిరాశపరచదు.

గతంలో పోలీసాఫీసర్ పాత్రలతో చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు, ఈ సినిమాకి తేడా ఏంటీ?
అన్ని సినిమాల్లానే ఇది కూడా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్. అందులో ఎలాంటి తేడా ఉండదు. కాకపోతే స్ర్కీన్ ప్లే, సెకండాఫ్ సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయనే ఫీలింగ్ ని ప్రేక్షకులకు ఈ చిత్రం కలుగజేస్తుంది. కథను బాగా డీల్ చేసాడనే పేరు ఈ సినిమా నాకు తెచ్చి పెడుతుంది. కళ్యాణ్ రామ్ గారి ఖాతాలో ఇది ఓ హిట్ చిత్రంగా నమోదవుతుంది.

ఈ సినిమా కోసం 'రౌడీ ఇన్స్ ఫెక్టర్' సాంగ్ ని రీమిక్స్ చేసారు కదా? దాని గురించి చెప్పండి?
రౌడీ ఇన్స్ ఫెక్టర్ కూడా పోలీసాఫీసర్ స్టోరీతో రూపొందిన చిత్రమే. 'పటాస్' కూడా పోలీసాఫీసర్ స్టోరీతో రూపొందింది కాబట్టి 'రౌడీ ఇన్స్ ఫెక్టర్' లోని పాటను రీమిక్స్ చేద్దామని చెప్పాను. ఇప్పటిదాకా ఎన్టీఆర్ పాటలను రీమిక్స్ చేసారు. బాలకృష్ణగారి పాటలు పెద్దగా చేయలేదు. బాబాయ్ పాటకు అబ్బాయ్ కాలు కదిపితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఎగ్జయిట్ మెంట్ కోసమే ఈ పాటను రీమిక్స్ చేసాము. నందమూరి అభిమానులతో పాటు, ఇతర ప్రేక్షకులు కూడా ఈ పాట బాగా నచ్చుతుంది. ఈ పాటలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా డ్యాన్స్ చేసారు.

'పటాస్' హైలెట్స్ గురించి చెప్పండి?
హీరో, విలన్ క్యారెక్టరైజేషన్స్,యం.యస్.నారాయణ, శ్రీనివాస్ రెడ్డిల కామెడీ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. సాయికుమార్ పాత్ర కూడా చాలా బాగుంటుంది.

ఓ రైటర్ గా మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం? డైరెక్టర్ గా ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటారు?
నేను జంధ్యాలగారి అభిమానిని. కాలేజ్ రోజుల్లో యాక్షన్ సినిమాలను బాగా ఇష్టపడేవాడిని. ఓ రైటర్ గా కామెడీ జోనర్ సినిమాలను ఇష్టపడతాను. డైరెక్టర్ గా కామెడీతో పాటు యాక్షన్ మిక్స్ డ్ సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఎన్టీఆర్ 'ఆది' సినిమాని ఇన్సిఫిరేషన్ గా తీసుకుని 'పటాస్' కథ తయారు చేసాను. యాక్షన్ సినిమాల్లో కూడా రిలీఫ్ కోసం కామెడీ ఉండాల్సిందే. అది మనసులో పెట్టుకుని 'పటాస్' లో కామెడీ మిస్ అవ్వలేదు. కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !