View

'సన్నాఫ్ స్యతమూర్తి' కోసం 7, 8 సెట్స్ వేసాం - ఆర్ట్ డైరెక్టర్ యస్.రవీందర్

Saturday,April04th,2015, 04:03 PM

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన 'ఐతే' చిత్రం ద్వారా ఆర్ట్ డైరెక్టర్ గా పరిచయమై, 'మగధీర', 'రాజన్న' చిత్రాలకుగానూ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా నంది అవార్డులు అందుకున్నారు ఆర్ట్ డైరెక్టర్ యస్.రవీందర్. తాజాగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఎస్.రవీందర్ తో ఫిల్మీబజ్ జరిపిన ఇంటర్య్వూ...

ఆర్ట్ డైరెక్టర్ గా మీ కెరియర్ ఏ చిత్రం ద్వారా ఆరంభమయ్యింది?
'ఐతే' చిత్రం ద్వారా ఆరంభమయ్యింది. ఈ సినిమాకి నాకు చాలా మంచి పేరు వచ్చింది.

ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయడానికి కావాల్సిన లక్షణాలు?
ఆర్ట్ డైరెక్టర్ కి చాలా అబ్జర్వేషన్ అవసరం. వర్క్ మీద ఇష్టం ఉండాలి. అప్పుడే ఆర్ట్ డైరెక్టర్ గా ఎదగగలుగుతాం.

ఆబ్జర్వేషన్ ఏ రకంగా ఉండాలంటారు?
ఫర్ ఎగ్జామ్ ఫుల్ మనం ఓ మీడియా ఆఫీసులో ఉన్నామనుకోండి. అక్కడ ఏమేం వస్తువులు ఉన్నాయి. ఎలాంటి బ్యాక్ డ్రాప్ ఉంటే అట్రాక్టివ్ గా ఉంటుంది... ఇలా ప్రతి దాన్ని క్షుణ్ణంగా గమనించాలి.

మీరు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ ఆరంభించిన తర్వాత బేసిక్ గా మీ ఆలోచన ఎలా ఉంటుంది?
ఓ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్లామనుకోండి, ఆ ఇల్లు పోలీస్ ఆఫీసర్ ది అనే చెప్పకుండానే తెలియాలి. అలాగే ఓ మధ్య తరగతి ఇల్లు ప్లాన్ చేస్తే, ఆ ఇంటిని చూడగానే వారి ఆర్ధిక పరిస్థితి ప్రతిబింబించేలా ఉండాలి. ఓ హై క్లాస్ ఇంటిని డెకరేట్ చేస్తే, ఆ ఇంట్లోని వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది ఊహించగలగాలి. అలా చేసినప్పుడే ఆర్ట్ డైరెక్టర్ గా పాస్ అయినట్టు. ఇవన్ని అబ్జర్వేషన్, క్రియేటివిటీ ద్వారానే వస్తాయి.

ఓ సినిమా కథ గురించి విన్న తర్వాత ఎలాంటి సెట్స్ ఉండాలనే విషయం గురించి డైరెక్టర్ కి మీరు సజెషన్స్ ఇస్తారా? లేక డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారా?
స్టోరీ విన్న తర్వాత ఎలాంటి సెట్స్ కావాలి, హీరో ఇల్లు ఎలా ఉండాలి, హీరోయిన్ ఇల్లు ఎలా ఉండాలి ఇలా ప్రతి విషయం గురించి డైరెక్టర్ తో మాట్లాడతాము. ఆ తర్వాత మా పని మేము చేసుకుంటూ పోతాం. ఏవైనా ఇంకా కావాలి అనిపిస్తే అప్పుడు డైరెక్టర్స్ చెబుతారు.

మగధీరలాంటి భారీ సినిమాకి వర్క్ చేసారు కదా.. దాని గురించి చెప్పండి?
ఆర్ట్ డిపార్ట్ మెంట్ లో మూడు అంశాలు ఉంటాయి. కన్విన్స్, కన్ ఫ్యూజ్, కరెక్ట్. 'మగధీర' రాజస్థాన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా. రాజులు గుర్రాల మీద వెళ్ళి యుద్ధాలు చేసేవాళ్ళు. వారికి ఆర్మర్స్‌ వున్నాయి, వాళ్ళకి క్రౌన్స్‌ వున్నాయి. మీరు సినిమాలో చూసినవి రియల్‌à°—à°¾ అయితే అక్కడ లేవు. మేం ఏదైతే చేశామో అది అక్కడ లేదు. మేమిచ్చిన హెల్మెట్‌ కానివ్వండి, ఆర్మర్‌ కానివ్వండి, కాస్ట్యూమ్స్‌ కానివ్వండి అక్కడ అలా లేదు. కాబట్టి కన్విన్స్ చేసి చెయ్యాలి.మేం అందరం కన్వీన్స్ అయ్యి ఆడియన్స్ ని కన్వీన్స్ చేయగలిగితేనే సక్సెస్ అయినట్టు. à°ˆ సినిమాకి సంబంధించి చాలా విషయాలు అలా కన్వీన్స్ చేయగలిగాం.

రాజమౌళిగారి సినిమాలు చేసిన మీరు 'బాహుబలి'లాంటి భారీ బడ్జెట్ సినిమాని ఎందుకు మిస్ అయ్యారు?
ఆ సినిమా కోసం నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ చేయమని అడిగారు. ఇప్పటివరకూ నేను చేసింది ఏడు సినిమాలు. ఒక సినిమా కోసం నాలుగేళ్లు కేటాయిస్తే, కెరియర్ పరంగా చాలా నష్టపోతాను. ఫైనాన్షియల్ గా కూడా సెటిల్ అవ్వాల్సి ఉంది. కాబట్టి ఆ సినిమా అంగీకరించలేదు.

త్రివిక్రమ్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంటుంది?
ఆయన చాలా కూల్ పర్సన్. ఆయన గైడెన్స్ వల్ల చాలా అప్ డేట్ అవ్వగలుగుతాం. కేవలం మా దగ్గర్నుంచి వర్క్ మాత్రమే కావాలనుకోరు. మేం అప్ డేట్ అయితే, బెటర్ అవుట్ ఫుట్ ఇవ్వగలుగుతాం అనేది త్రివిక్రమ్ గారి ఆలోచన. అందుకే ఆయన గైడెన్స్ చాలా ఉపయోగపడుతుంది.

సన్నాఫ్ సత్యమూర్తి గురించి చెప్పండి?
ఈ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇది ఎమోషనల్ స్టోరీ. ఫస్టాప్ అంతా మోర్ వైబ్రెంట్ కలర్స్ తో ఫ్యాషనేటెడ్ గా ఉంటుంది. సెకండాఫ్ రా లుక్ తో ఉంటుంది. అబ్రాడ్ లో ఉండే తండ్రి. హైదరాబాద్ లో ఉండే కొడుకు. తమిళనాడులో ఉండే రిచ్ విలన్. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్, కల్చర్ ఉన్న క్యారెక్టర్స్... వారి లైఫ్ స్టైల్ ని బట్టి బ్యాక్ డ్రాప్ అంతా వర్కవుట్ చేసాం.

ఈ సినిమాలో హీరె వెడ్డింగ్ ప్లానర్ కదా? కాబట్టి చాలా సెట్స్ వేయాల్సి వచ్చిందా?
అవునండి. ఏడెనిమిది సెట్స్ వేసాం. సెట్స్ అన్నీ చాలా గ్రాండియర్ గా ఉంటాయి. ఈ చిత్రం సెకండాఫ్ లో 50నిముషాలు ఓ హౌస్ లో ఉంటుంది. కాబట్టి హౌస్ సెట్ వేసాం.

ఈ సెట్ కి చాలా కష్టపడ్డాం అని ఏ సెట్ వేసినప్పుడైనా ఫీలయ్యారా?
ఇప్పటివరకూ అలా అసలు ఏ సెట్ గురించి అనుకోలేదు. ఏ సెట్ వేయాలన్నా చాలెజింగ్ గా తీసుకునే చేసాను. పూర్తిగా శాటిస్ ఫై అయ్యే వరకూ మార్పులు చేస్తూనే ఉంటాను. అసలు కాంప్రమైజ్ అవ్వను.

ఆర్ట్ డైరెక్టర్ గా మీది 13యేళ్ల కెరియర్... వంద శాతం శాటిస్ ఫై అయిన సెట్ గురించి చెప్పండి?
హండ్రెడ్ పర్సంట్ శాటిస్ ఫై అయ్యానని చెప్పలేను. మగధీర లో నేను చేసిన చాపర్ బెస్ట్ వర్క్ గా ఫీల్ అవుతాను. సెట్ బాగుందని అందుకునే ప్రశంసలు నాకు చాలా శాటిస్ ఫ్యాక్షన్ కలిగిస్తాయి.

ఏ ఆర్ట్ డైరెక్టర్ ని ఇన్సిఫిరేషన్ గా తీసుకుంటారు?
నేను చదవుకునే రోజుల్లో మణిరత్నంగారి సినిమాలు ఇష్టంగా చూసేవాడిని. అందులోని తరణిగారి వర్క్ నాకు చాలా ఇష్టం. ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత చాలా మాట్లాడుకుంటాం. ఆయనంటే చాలా ఇష్టం. ఆయన వర్క్ ని నేను ఇన్సిఫిరేషన్ గా తీసుకుంటాను.

ఇంకా మీరు చేస్తున్న సినిమాలు?
నాగార్జునగారి 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి వర్క్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాను అంటూ ఇంటర్య్వూకి ముగింపు పలికారు రవీందర్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !