View

నిర్మాత సేఫ్టీయే నాకు ముఖ్యం: అవసరాల శ్రీనివాస్

Friday,June20th,2014, 03:46 AM

నటుడిగా అవసరల శ్రీనివాస్ కి మంచి గుర్తింపు ఉంది. తనలో మంచి దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంగా శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రం ఈరోజు విడుదలైంది. వారాహి చలన చిత్రమ్ సంస్థపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ప్రమోషన్ పరంగా ఇటీవల సంచలనం సృష్టించింది. సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇక.. అవసరాల శ్రీనివాస్ మనోభావాలు తెలుసుకుందాం...

'ఊహలు గుసగుసలాడే' చిత్రం ఎలా ఆరంభమైంది?

ఏడాది క్రితం సాయిగారికి ఈ కథ వినిపించాను. ఆయనకు బాగా నచ్చింది. అక్టోబర్ లో షూటింగ్ ఆరంభించాం. ఇదొక అందమైన రొమాంటిక్ కామెడీ మూవీ. వారాహి చలన చిత్రమ్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ సంస్థ ద్వారా నేను దర్శకుడు కావడం చాలా ఆనందంగా ఉంది.

సాయి కొర్రపాటికి చెప్పే ముందు ఈ కథను వేరే ఎవరి దగ్గరైనా చెప్పారా?

కొంతమంది నిర్మాతల దగ్గర చెప్పాను. వారికి నచ్చింది. కానీ, ఎందుకో కుదర్లేదు. చివరికి సాయిగారు ముందుకొచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సంస్థలో ఈ సినిమా చేయడం మంచిదే అయ్యింది. ఎందుకంటే, కొత్త దర్శకులందరికీ ఇలాంటి సంస్థలు దొరకవు. సినిమా చేయడమే పెద్ద ఎత్తు అయితే.. ప్రమోషన్.. విడుదల అన్నీ కష్టమవుతాయి. కానీ, నాకా ప్రాబ్లమ్ రాలేదు. సాయిగారు బాగా ప్రమోట్ చేశారు. అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేశారు.

ఈ సినిమా కథ ఏంటి?

à°“ టీవీ చానల్ స్టూడియో నేపథ్యంలో జరిగే à°•à°¥ ఇది. న్యూస్ రీడర్ కావాలనే ఆశయంతో ఉంటాడు హీరో.అతనికో అమ్మాయి పరిచయం అవుతుంది. à°† తర్వాత అతని జీవితం ఎలాంటి  à°®à°²à±à°ªà± తీసుకుంటుంది? అనే కథాంశంతో సినిమా ఉంటుంది.

దీనికి 'ఊహలు గుసగుసలాడే' టైటిల్ అనుకోవడానికి కారణం?

వాస్తవానికి 40, 50 టైటిల్స్ అనుకున్నాం. సినిమా షూటింగ్ పూర్తయ్యి, ఎడిటింగ్ దశకు వచ్చేవరకు టైటిల్ ఖరారు చేయలేదు. ఒకసారి సాయి కొర్రపాటిగారు టైటిల్ కన్ ఫార్మ్ చేసేద్దాం అన్నారు. ఆ సమయంలో పాత పాటలు వింటున్నాను. వాటిలో 'బందిపోటు'లోని 'ఊహలు గుసగుసలాడే..' పాట ఒకటి. మాది రొమాంటిక్ కామెడీ మూవీ కాబట్టి, కధకు కూడా కనెక్ట్ అవుతుంది. అందుకే, ఆ టైటిల్ పెట్టాం.

దర్శకునిగా మొదటి సినిమాని రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో చేయడానికి కారణమేదైనా ఉంది?

మొదటి సినిమాకి ఈ జానర్ సేఫ్ అనిపించి, చేశాను. 'శ్రీనివాస్ అవసరాల మంచి సినిమా తీశాడు కానీ, నిర్మతకే డబ్బులు రాలేదు' అనిపించుకోవడం నాకే మంచిది కాదు. అందుకే, సేఫ్ జానర్ ని ఎంచుకున్నాను.

ఈ చిత్రంలో మీరు కూడా ఓ పాత్ర చేశారు..?

స్టూడియో ఓనర్ గా చేశాను. నిజానికి ఈ పాత్రను వేరేవాళ్లతో చేయించమన్నారు సాయి కొర్రపాటిగారు. దర్శకునిగా నాకిది తొలి సినిమా కాబట్టి, రెండు బాధ్యతలు ఎందుకు? అనుకున్నారు. కానీ, నాలుగైదు రోజులు షూటింగ్ చూసి, నేను సెటిల్డ్ గా చేస్తున్నానని ఆయనకు నమ్మకం కుదిరింది. అందుకే, నేనే ఈ పాత్ర చేస్తానంటే కాదనలేదు.

ఇకనుంచి నటుడిగానా? లేక దర్శకత్వం వైపేనా?

ఫలానా శాఖకి పరిమితం కావాలని అనుకోవడంలేదు. మంచి ఫీల్ గుడ్ మూవీలో నటించే అవకాశం వస్తే, అది చేస్తా. మంచి సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే, అది చేస్తా. నటన, డైరెక్షన్.. ఏం చేసినా 'గుడ్ మూవీ'లో భాగస్వామ్యం కావాలన్నదే నా ఆశయం.

Avasarala Srinivas Speaka about Oohalu Gusagusaladae



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !