View

హీరోగా నా టార్గెట్ అదే - బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Friday,January02nd,2015, 01:30 PM

బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయిన 'అల్లుడు శీను' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమానే స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేసాడు. మలి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు. భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాడు. తొలి సినిమాతోనే డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసి, మంచి పెర్ ఫార్మర్ గా పేరు తెచ్చుకున్నాడు సాయి శ్రీనివాస్. రేపు (3.1.2015) బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తో జరిపిన ఇంటర్య్వూ ఈ విధంగా...

తొలి సినిమా 'అల్లుడు శీను'తో కమర్షియల్ విజయం అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత చేసే సినిమాలు ఎలా ఉండాలని భావిస్తున్నారు?
పక్కా కమర్షియల్ సినిమాలు చేయాలన్నదే నా టార్గెట్. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసానని అందరూ మెచ్చుకున్నారు. కాబట్టి నా తదుపరి సినిమాల్లో కూడా మంచి ఫైట్స్, డ్యాన్స్ చేయడానికి స్కోప్ ఉన్న పాటలు ఉండేలా చూసుకుంటాను.

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తో తొలి సినిమా చేసారు? మలి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నారు ఎలా ఫీలవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. నా తొలి సినిమాకి వినాయక్ అంకుల్ దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా సినిమా చూసి బోయపాటి శ్రీనుగారు చాలా అప్రిషియేట్ చేసారు. అలాగే తన దగ్గర నాకు సరిపడా యూత్ ఫుల్ లవ్ సబ్జెక్ట్ ఉందని చెప్పారు. ఆ పాయింట్ మాకు నచ్చడం, సినిమా ప్లానింగ్ చేయడం జరిగింది.

బోయపాటి శ్రీనుగారితో మీరే చేయబోయే సినిమా ఎలా ఉంటుంది?
ఈ సినిమా గురించి నేను ఇప్పుడే ఎక్కువ చేప్పలేను. డైరెక్టర్ గారు చెబితేనే బాగుంటుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. చాలా మంచి పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఓ సినిమా అంగీకరించేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు?
ముందు మంచి కథ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత కథను సరిగ్గా ప్రజెంట్ చేయగల డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను.

కథలు మీరు సెలెక్ట్ చేసుకుంటారా? లేక మీ నాన్నగారు కూడా కథలు వింటారా?
నాన్నగారికి సినిమాలపైన మంచి అవగాహన ఉంది. ఆయనకు ఎంతో అనుభవం కూడా ఉంది. కాబట్టి ముందు నాన్నగారే కథలు వింటారు. ఆయనకు కథ నచ్చితే నా దగ్గరకు పంపిస్తారు. నేను కథ విన్న తర్వాత నాన్నగారితో చర్చించి డెసిషన్ తీసుకుంటాను.

తొలి చిత్రంలోనే 40కోట్ల క్లబ్ లో చేరారు? దాంతో రెండో చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇది మీపై ఫ్రెషర్ పడుతుందా కదా?
అవును. తొలి సినిమా విజయం మలి సినిమాపై ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి ఈ విషయంలో మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అందుకే కథ రెడీ అవ్వకుండా సినిమా ప్రారంభించడం లేదు. స్ర్కిఫ్ట్ పూర్తయిన తర్వాతే సినిమా ప్రారంభిస్తాం.

డ్యాన్స్, ఫైట్స్ పరంగా తొలి సినిమాతోనే ఫ్రూవ్ చేసుకున్నారు. మలి సినిమాకి సంబంధించి ఎలాంటి వర్కవుట్స్ చేస్తున్నారు?
రెండో సినిమా కోసం బాడీ పెంచాను. డ్యాన్స్, జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. హెయిర్ స్టైల్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటాను. నటన పరంగా కూడా మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను.

తొలి, మలి సినిమాలు స్టార్ డైరెక్టర్స్ తో ప్లాన్ చేసుకున్నారు? కొత్త డైరెక్టర్స్ తో సినిమా చేసే అవకాశం లేదా?
కొత్త డైరెక్టర్స్ చెప్పే కథలు కూడా వింటున్నాను. మంచి కథ దొరికితే కొత్తవారితో సినిమా చేయడానికి రెడీ. గత ఆరు నెలల నుంచి చాలా కథలు వింటున్నాను. ఎంతోమంది కొత్తవారు వచ్చి కథలు చెబుతున్నారు.

తొలి సినిమా తర్వాత రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నారు?
నా కెరియర్ బిగినింగ్ లో ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే తొందరపడి వెంటవెంటనే సినిమాలు చేయడంలేదు. మూడు, నాలుగు సినిమాలు చేసిన తర్వాత ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్రిస్తాను.

హీరోగా మీ టార్గెట్ ఏంటీ?
నాన్నగారు చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. కాబట్టి ముందు ఆయన పేరు చెడగొట్టే విధంగా నేను ఉండకూడదు. మంచి సినిమాలు చేయాలి. బెస్ట్ హీరో అనిపించుకోవాలి. ఇప్పటికి నా టార్గెట్ ఇదే.

బోయపాటిగారితో సినిమా కమిట్ అయ్యారు? ఇంకా ఏ ప్రాజెక్ట్ అయినా ఫైనలైజ్ అయ్యిందా?
ప్రస్తుతం బోయపాటి శ్రీనుగారి సినిమా గురించి ఆలోచిస్తున్నాను. తమిళ చిత్రం 'సుందర్ పాండియన్' రీమేక్ లో కూడా నటించే అవకాశం ఉంది. ఈ చిత్రం భీమినేని శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో ఉంటుంది. ప్రస్తుతం తమిళ చిత్రానికి మార్పులు చేస్తున్నారు. మన నేటివిటీకి తగ్గట్టు కథకు మార్పులు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాను అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు శ్రీనివాస్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !