View

అలా 'పవర్' సెట్ అయ్యింది - డైరెక్టర్ బాబి (కె.రవీంద్ర)

Tuesday,September09th,2014, 05:41 PM

దర్శకుడవ్వాలనే టార్గెట్ తోనే చిత్ర పరిశ్రమకు వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయాలనే ఉద్దేశ్యంతో కొంతమంది దర్శకుల దగ్గరకు వెళ్లాను. కానీ నాకు అవకాశం రాలేదు. 2003లో చిన్నికృష్ణ గారి దగ్గర వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మోహన్ బాబుగారు, కోన వెంకట్ దగ్గర రైటర్ గా వర్క్ చేసాను. అనంతరం దిల్ రాజుగారి కాంపౌండ్ లోకి ఎంటరయ్యాను. 'పవర్' సినిమాతో దర్శకుడయ్యే అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ గానే కొనసాగాలనుకుంటున్నాను'' అని చెప్పారు డైరెక్టర్ బాబి (కె.రవీంద్ర). రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన 'పవర్' చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తన మనోభావాలను మీడియాతో ఈ విధంగా పంచుకున్నారు డైరెక్టర్ బాబి.

 

దర్శకుడిగా 'పవర్' మీకు తొలి సినిమా? ఎలా ఉంది?

రైటర్ గా పలు సినిమాలకు వర్క్ చేసిన నాకు డైరెక్టర్ అయ్యే అవకాశం 'పవర్'తో వచ్చింది. డైరెక్టర్ అవ్వాలన్న నా టార్గెట్ ఈ సినిమాతో తీరినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వంద శాతం కృష్టపడ్డాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది.

'పవర్' సినిమా ఎలా ఉంటుంది?

చాలా బాగుంటుంది. రవితేజ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడనగానే 'విక్రమార్కుడు' చిత్రం గుర్తుకు వస్తుంది. కానీ ఆ సినిమాలో క్యారెక్టర్ కీ, ఈ సినిమాలో క్యారెక్టర్ కీ అస్సలు పోలిక ఉండదు. రవితేజ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాడు.

అసలీ ప్రాజెక్ట్ ఎలా సెట్టయ్యింది?

రవితేజ నటించిన 'బలుపు'కి నేను కథ అందించి విషయం తెలిసిందే. ఆ సినిమా సమయంలోనే 'పవర్' కథ చెప్పాను.. ఆయనకు బాగా నచ్చింది. ఈ చిత్రకథకు న్యాయం చేసే నిర్మాత దొరికితే బాగుంటుందనుకున్నారు. రాక్ లైజ్ వెంకటేష్ ఎప్పట్నుంచో రవితేజతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఆయన ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా ఈ చిత్రం సెట్టయ్యింది.

మీ తొలి చిత్రం కథానాయకుడు రవితేజ కావడం, ఆయనతో సినిమా చేయడం ఎలా అనిపించింది?

'బాబీతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ఉంది' అని రవితేజగారు అనడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. తనో పెద్ద హీరో అని భేషజాలకు పోకుండా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ లా ఈ సినిమాకి పని చేశారు. అలాగే, ఓ ప్రేక్షకుడిలా సినిమాని చూస్తారు. కథ మీద మంచి జడ్జిమెంట్ ఉన్న హీరో రవితేజ.

ప్రకాశ్ రాజ్ పాత్ర గురించి?

ఈ చిత్రంలో చాలా కీలక పాత్ర ఆయనది. సినిమా చూస్తే ఆయన పాత్రకున్న గొప్పదనం తెలుస్తుంది. ఈ పాత్రను ప్రకాశ్ రాజ్ గారు చేస్తేనే బాగుంటుందని రాక్ లైన్ వెంకటేష్ గారితో చెప్పాను. ఈ చిత్రం షూటింగ్ ఆరంభించే వారం రోజలకు ముందు ప్రకాశ్ రాజ్ దగ్గర చెప్పారాయన. వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉండటంతో ప్రకాశ్ రాజ్ గారు అంగీకరించారు. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షాట్ తీసినప్పుడు ప్రకాశ్ రా గారికి 103 ఫీవర్. ఆయినప్పటికీ లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొన్నారు. ఫస్ట్ షాట్ బాగా తీశావ్ బంగారం అని మెచ్చుకున్నారు కూడా.

పాటలు గురించి చెబుతారా?

ఆడియో ఇప్పటికే చాలా హిట్టయ్యింది. ముఖ్యంగా రవితేజగారు పాడిన పాట అందరికీ నచ్చింది. వాస్తవానికి రవితేజగారితో పాడించాలనే ఆలోచన చిత్ర సంగీతదర్శకుడు తమన్ దే.

ఫైనల్ గా ఇకనుంచి మీ ప్రయాణం దర్శకునిగానా? రచయితగానా?

దర్శకునిగానే కొనసాగాలనుకుంటున్నాను.

 

Power movie director Bobby interview



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !