View

చిట్ చాట్ - హీరోయిన్ అంజలి (డిక్టేటర్)

Monday,January11th,2016, 03:51 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన 'లెజెండ్', 'లయన్' చిత్రాల్లో అంజలి ఓ హీరోయిన్ గా నటించాల్సి ఉందట. అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఈ అవకాశాన్ని అంజలి మిస్ చేసుకుంది. ఈ విషయాన్ని స్యయంగా అంజలి చెప్పింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా రూపొందిన 'డిక్టేటర్' చిత్రంలో హీరోయిన్ గా నటించింది అంజలి. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ పై శ్రీవాస్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు (11.1.2016) మీడియాతో పంచుకుంది అంజలి. ఆ విశేషాలు మీ కోసం...


- బాలకృష్ణ గారితో 'లెజెండ్', 'లయన్' చిత్రాల్లో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాను. అప్పుడు డేట్స్ కుదరలేదు. అందుకే ఆ సినిమాలు మిస్ చేసుకోవాల్సి వచ్చింది. 'డిక్టేటర్' చిత్రంలో నటించే అవకాశం రాగానే ఎలాగైనా ఈ సినిమా చేయాలి, మిస్ చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. కథ కూడా నచ్చింది. ఇందులో చాలా మంచి పాత్ర చేసాను.


- బాలకృష్ణ గారితో సినిమా అనగానే కొంచెం భయమేసింది. ఆయన స్టార్ హీరో. ఎలా ఉంటారోనని అనుకున్నాను. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని, ఆయనతో నటించడమంటే అంత ఈజీకాదని... ఇలా ఏదేదో చెప్పారు. కానీ షూటింగ్ ఆరంభమై ఆయనతో నటించడం మొదలుపెట్టిన తర్వాత బాలకృష్ణ గారి స్వభావం అర్ధమయ్యింది. ఆయన చాలా జోవియల్ గా ఉంటారు. చిన్న టెక్నీషియన్లు, సహాయ నటులు, పెద్ద టెక్నీషియన్స్ అనే తేడా చూపించరు. అందరితోనూ బాగా మాట్లాడతారు. అలాగే టైం విషయంలో ఆయన చాలా పంక్చువల్ గా ఉంటారు. అందరూ అలానే ఉండాలనుకుంటారు.


- బాలకృష్ణగారి ఎనర్జీ లెవెల్స్ కి మ్యాచ్ అయ్యి స్టెప్పులేయడం చాలా కష్టం. పెద్దగా ప్రాక్టీస్ లేకుండానే టేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కానీ నాకు కొంచెం ప్రాక్టీస్ కావాలంటే టైం ఇచ్చి ఎంకరేజ్ చేసేవారు.


- ఈ సినిమాలోని పాత్ర కోసం కొంచెం బరువు తగ్గాలని డైరెక్టర్ శ్రీవాస్ గారు చెప్పారు. దాంతో ఐదున్నర కేజీలు బరువు తగ్గాను. శ్రీవాస్ గారు కూడా నా లుక్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ఈ సినిమా స్టిల్స్ విడుదలైనప్పట్నుంచి చాలా కొత్తగా కనబడుతున్నారని అందరూ ప్రశంసిస్తున్నారు. బరువు తగ్గడానికి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆనందపడ్డాను.


- నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. పాటలకే పరిమితమయ్యే పాత్ర కాదు నాది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర. చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తాను.


- నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు బాలకృష్ణగారు కొన్ని సీన్స్ చూసారు. కొన్ని సీన్స్ లో నీ నటన చూస్తుంటే సావిత్రిగారు గుర్తుకు వచ్చారని ప్రశంసించారు. లెజండ్రీ యాక్టర్ బాలకృష్ణగారి నోటి వెంట ఈ మాటలు వినడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకంటే నాకు కావాల్సిందేముంటుంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.


- ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీవాస్ గారు రెండు బాధ్యతలు పోషించారు. నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు. ఈ రెండూ మాములు బాధ్యతలు కావు. ఈ రెండు బాధ్యతలను చాలా పర్ ఫెక్ట్ గా పోషించారు. ఓ నిర్మాతగా ఏ సీన్ కి ఎంత బడ్జెట్ పెట్టాలో ఆలోచిస్తూనే, అదే సీన్ ని ప్రేక్షకరంజకంగా తీర్చిదిద్దడానికి కృషి చేసారు.


- ఓంకార్ ఏవరో నాకు తెలీదు. నేనిప్పటివరకూ చూడలేదు. ఆయనతో నేను ప్రేమలో ఉన్నానని వార్తలు ప్రచారం అవ్వడం నన్ను చాలా షాక్ కి గురి చేసాయి. కొన్ని వార్తలు మా మనసుల్ని చాలా బాధపెడతాయి. అవి నిజంకాదని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఇలా రూమర్స్ ఓ ఆర్టిస్ట్ మీద వస్తున్నాయంటే వారికి డిమాండ్ ఉన్నట్టేనని నా ఫ్రెండ్స్ చెబుతుంటారు. సో... నా మీద రూమర్స్ వస్తున్నాయంటే నాకు డిమాండ్ ఉన్నట్టే కదా (నవ్వుతూ). రాజుగారి గది సీక్వెల్ లో నేను నటించడంలేదు. అసలు నన్నెవ్వరూ అప్రోచ్ అవ్వలేదు.


- చిత్ర పరిశ్రమలో కాంపిటీషన్ ఉంది. కాకపోతే ఎవరి టాలెంట్ కి తగ్గ పాత్రలు వారికి వస్తాయి. టాలెంట్ ఉన్నవారికి చిత్ర పరిశ్రమలో మంచి ఆఫర్స్ వస్తుంటాయి. ఎవరు ఏ పాత్రకు సరిపోతారో దర్శకులకు బాగా తెలుసు. ఎందుకంటే నాకు నప్పుతాయనుకునే పాత్రల కోసం డైరెక్టర్స్ నన్నే అప్రోచ్ అవుతున్నారు.


- ఓ తెలుగమ్మాయిగా ఇన్ని సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని కొనసాగుతుండటం ఆనందంగా ఉంది. నేను చేసే పాత్రలు ముందు నాకు నచ్చాలి. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించడంలేదు. సెలిక్టివ్ గా ఎంపిక చేసుకున్న పాత్రలు నాకు మంచి పేరు, గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఇకముందు కూడా సెలెక్టివ్ గానే ఉంటాను.


- సరైనోడు చిత్రంలో నేను ఐటమ్ సాంగ్ చేయలేదు. హీరోకి హెల్ప్ అయ్యే పాత్ర. ఆ పాత్రకు ఓ స్పెషల్ సాంగ్. అందుకే ఆ పాట అంగీకరించించి చేసాను. కథ వినే నేను పాట చేయడానికి అంగీకరించాను.


- ఫైనల్ గా 'డిక్టేటర్' గురించి చెప్పాలంటే... బాలకృష్ణగారి సినిమాల్లో ఉండే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అయితే రెగ్యులర్ సినిమాలా ఉండదు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది. అభిమానులను అలరిస్తుంది. సంక్రాంతి పండుగకు వస్తున్న ఈ సినిమా నిజంగా పండుగకానుకలానే ఉంటుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !