View

చిట్ చాట్ - నిర్మాత దిల్ రాజు (కృష్ణాష్టమి)

Thursday,February18th,2016, 04:54 PM

సునీల్‌, నిక్కీగల్రాని, డింపుల్‌ చోపడే నటీనటులుగా రూపొందిన చిత్రం 'కృష్ణాష్టమి'. వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజుతో ఫిల్మీబజ్ డాట్ కామ్ చిట్ చాట్...


- గోపీచంద్‌ మలినేని ‘పండగచేస్కో’ సినిమా కంటే ముందుగానే ఈ కథను చెప్పాడు. కథలోని ఎంటర్‌టైన్మెంట్‌ అందరికీ బాగా నచ్చింది. కచ్చితంగా కమర్షియల్‌గా కూడా వర్కవుట్‌ అవుతుందనిపించి, బన్నిని కలిసి ఈ కథను చెప్పాం. అయితే బన్ని ఆర్య, పరుగు చిత్రాల‌ తర్వాత నెక్ట్‌ట్‌ లెవల్‌లో సమ్‌థింగ్‌ ఏదో కొత్తగా చేయానుకుంటున్నాడు. దాంతో ఈ సినిమాను ఆపాం. తర్వాత గోపీచంద్‌ మలినేని పండగచేస్కో సినిమా చాన్స్‌ రావడంతో ఆ పనిలో బిజీగా మారిపోయాడు.


- సాయిధరమ్‌తేజ్‌ కోసం వాసువర్మ ల‌వర్‌ అనే కొత్త కథను సిద్ధం చేశాడు. ‘కృష్ణాష్టమి’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దినేష్ ల‌వ‌ర్ సినిమాకు ట్యూన్స్‌ కూడా కంపోజ్‌ చేశాడు. కానీ అది కూడా వర్కవుట్ అవ్వలేదు.


- అప్పుడు నేను, వాసు కూర్చుని అనుకున్న కథ ‘కృష్ణాష్టమి’ నాకు కథ నచ్చింది. కానీ, ఇంకా వర్క్‌ చేయాల్సి ఉంది, చాలా మంచి సినిమా అవుతుందని అనుకున్నాం. అప్పట్నుంచి వాసువర్మ స్క్రిప్ట్‌ డెవల‌ప్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు.


- ఓ రోజు సునీల్‌ను పిలిపించి 20 నిమిషాలు కథను వినిపించాం. తను వినగానే ఇంత పెద్ద బడ్జెట్‌ మూవీ నాతో ప్లాన్‌ చేస్తున్నారా? అని అన్నాడు. అయితే వాసువర్మ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తెలియగానే వేరే సినిమా ఏదీ చేయకుండా ఈ సినిమా చేస్తానని అన్నాడు. అన్నమాట ప్రకారం ఈ సినిమా 80శాతం పూర్తయ్యే వరకు ఏ సినిమా యాక్సెప్ట్‌ చేయలేదు. అలా సెట్‌ అయ్యిందే కృష్ణాష్టమి.


- నేను దర్శకులుగా పరిచయం చేసిన భాస్కర్‌, బోయపాటి, సుకుమార్, శ్రీకాంత్‌ అడ్డాల మంచి పోజిషన్‌లో ఉన్నారు. వాసువర్మను జోష్‌ సినిమా డైరెక్ట్‌ చేయమని అన్నప్పుడు నేను నిర్మాతగా చేసిన తప్పేంటంటే జోష్‌ 2009లో విడుదలైంది. ఆ సమయంలో కాలేజీల్లో గొడలు ఉండేవి కావు. కానీ సినిమాలో గొడవల‌ను పెద్దగా చూపించే ప్రయత్నం చేశాం. లెజెండ్రీ ఫ్యామిలీకి చెందిన నాగచైతన్య వారి బ్యానర్‌లో కాకుండా నా బ్యానర్‌లో సినిమా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇలా నిర్మాతగా నేను చేసిన తప్పుల‌వీ. దిల్‌, ఆర్య, బొమ్మరిల్లు వరకు వాసువర్మ నా పక్కనే ఉన్నాడు. కాబట్టి తన టాలెంట్ నాకు తెలుసు. రేపు ‘కృష్ణాష్టమి’ సినిమా చూస్తే తన టాలెంట్‌ ఏంటో మీకు తెలుస్తుంది. నేను తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రంతో నిల‌బెట్టుకుంటాడని చెప్పగల‌ను.


- సునీల్‌ ఇప్పటి వరకు కృష్ణాష్టమి వంటి సినిమా చేయలేదు. దీంట్లో కొత్త సునీల్‌ కనపడతాడు. ఇది బన్ని కోసం తయారు చేసుకున్న కథ, సునీల్‌ చేస్తున్నాడని ఎక్కడా హీరోయిజం తగ్గించలేదు. హీరోయిక్‌గా చూపిస్తూనే సునీల్‌ టైప్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా ప్లాన్‌ చేశాం.


- ఇక బడ్జెట్‌ విషయానికి వస్తే బృందావనం, మిష్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ సినిమాల‌కు ఆ రోజుల్లో పెట్టిన బడ్జెట్‌ కంటే ఎక్కువగానే పెట్టాం. ఈ సినిమాను 45రోజుల పాటు ఫారిన్‌లోనే షూట్‌ చేశాం. అయితే కాలాన్ని, పరిస్థితుల‌ను బట్టి బడ్జెట్‌ చూడలేం. అన్నీ సినిమాను ఫారిన్‌లో షూట్‌ చేయలేం కదా, బడ్జెట్‌ అనేది సినిమాను బట్టి మారుతుంటుంది.


- హీరో పక్కవాడి సమస్యను తీర్చడానికి ఎంత దూరమైనా వెళ్ళే క్యారెక్టర్‌. అలాంటి హీరోకు అనుకోకుండా ఓ సమస్య ఎదురవుతుంది. అప్పుడు హీరో ఎలా రియాక్ట్‌ అయ్యాడు అనే విషయాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాం. కమర్షియల్‌ తరహాలో అందంగా ఉండే రివేంజ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కృష్ణాష్టమి'. సింపుల్‌గా చెప్పాంటే నీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ విత్‌ కమర్షియల్ ఎలిమెంట్స్‌.


- సినిమా చూసేటప్పుడు ఎవరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూ వారికి ఉంటుంది. చాలా సినిమాలు రివ్యూవర్స్‌కు నచ్చలేదు కానీ ఆడియెన్స్‌కు నచ్చాయి. ఇక్కడే నేనెవరినీ తప్పు పట్టలేదు. సినిమా గోల్‌ ఆడియెన్స్‌ శాటిస్పాక్షన్‌ మాత్రమే. ఈ సినిమాకు నా వరకు 3.25 నుండి 3.5 రేటింగ్‌ వస్తుందని అనుకుంటున్నాను.


- సుప్రీమ్‌ సినిమా ఏప్రిల్‌ 1న విడుదల‌వుతుంది. 5,6 సినిమాలు స్క్రిప్ట్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్‌ చేస్తాం. మరో నాలుగు సినిమాలు స్క్రిప్ట్స్‌ రెడీ అయిన తర్వాత సెట్స్‌లోకి వెళతాం. ఇప్పుడు కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఓ విజువల్‌ సినిమాను రెడీ చేశాను. అది తెలుగు, తమిళంలో నిర్మిస్తాను. హిందీలో డబ్‌ చేసి విడుదల‌ చేస్తాను. ఫాంటసీ, హర్రర్‌ జోనర్‌లో సినిమా ఉంటుంది. టైటిల్‌ ‘రుద్రాక్ష’ అని వినపడుతుంది కానీ టైటిల్‌ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


- పవన్‌కళ్యాణ్‌గారు స్క్రిప్ట్‌ తీసుకురా..సినిమా చేద్దామని అన్నారు. నేను ఆ పనిలోనే ఉన్నాను. ఆయనతో సినిమా చేయడం నా లైఫ్‌ యాంబిషన్‌. నేను కూడా వెయిట్‌ చేస్తున్నాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !