View

చిట్ చాట్ - హీరోయిన్ ఆదాశర్మ (గరం)

Tuesday,February09th,2016, 03:30 AM

'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, మంచి గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఆది సరసన తను కథానాయికగా నటించిన 'గరం' చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. మదన్ దర్శకత్వంలో వసంతా శ్రీనివాస్ సమర్పణలో పి. సురేఖ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అటు ట్రెడిషనల్ గా, ఇటు గ్లామరస్ గా కనిపించే అవకాశం దక్కిందనీ, అందుకని ఈ చిత్రం నాకు చాలా స్పెషల్ అని అదా శర్మ చెప్పింది. మరిన్ని విశేషాలను ఈ విధంగా చెప్పింది...


- మదన్ గారు నన్నీ చిత్రానికి ఎంపిక చేయడానికి ఓ కారణం 'హార్ట్ ఎటాక్'. ఆ చిత్రంలో నేను కళ్లతోనే ఎక్కువగా హావాభావాలు పలికిస్తాను. 'గరం'లో పాత్రకు కూడా అలానే చేయాలి. ఇందులో నేను ముస్లిమ్ అమ్మాయిగా నటించాను. సినిమా మొత్తం మీద నాకు ఐదారు డైలాగ్స్ ఉంటాయేమో. మిగతాదంతా కళ్లతోనే ఎక్స్ ప్రెస్ చేస్తాను. బుర్ఖా వేసుకున్న సీన్స్ ని మంచి ఎండల్లో చిత్రీకరించడం జరిగింది. అప్పుడు మాత్రం కొంచెం కష్టమనిపించింది. అది మినహా ఈ చిత్రం నాకు తియ్యని అనుభూతిని మిగిల్చింది.


- బుర్ఖా సన్నివేశాల్లో ట్రెడిషనల్ గా కనిపిస్తాను. పాటల్లో మాత్రం గ్లామరస్ గా కనిపిస్తాను. ముఖ్యంగా మాస్ సాంగ్ 'చిలక పాపా..'లో బాగా డ్యాన్స్ చేశాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ డ్యాన్స్ చేసింది ఈ పాటకే. ఆది ఎనర్జిటిక్. డ్యాన్సులు, ఫైట్లు అన్నీ బాగా చేస్తాడు. లవ్లీ పర్సన్ కూడా.


- ఈ సినిమా ద్వారా నా చిన్నప్పటి కోరిక తీరింది. చిన్నప్పుడు మణిరత్నంగారి 'బొంబాయి' సినిమా చూశాను. ఆ సినిమాలో మనీషా కొయిరాలా ముస్లిమ్ గాళ్ లా నటించిన విషయం తెలిసిందే. ఎప్పటికైనా బుర్ఖా వేసుకుని మనం కూడా అలా నటించాలనుకున్నాను. 'గరం'తో ఆ కోరిక తీరిపోయింది.


- సాయికుమార్ గారు చాలా నైస్ పర్సన్. ఆయన బేనర్లో చేయడం చాలా బాగా అనిపించింది. నన్నో ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఖచ్చితంగా 'గరం'తో మేం మంచి హిట్ కొడతాం అనే నమ్మకం ఉంది. నటిగా కూడా నాకు మరింత పేరు తెచ్చే సినిమా అవుతుంది.


- నాకు నటన అంటే ప్రేమ. క్యారెక్టర్ నిడివి గురించి ఆలోచించను. మంచి పాత్ర అనిపిస్తే చేసేస్తా. అలా అనుకునే 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాలు చేశాను. కొంతమంది ఎందుకవి చేశారు? అనడిగారు. కొంతమంది అభినందించారు. చేస్తే తప్పేంటి? ఏ పని చేసినా విమర్శలు, ప్రశంసలు రెండూ కామన్. అందుకని నేనేదీ పట్టించుకోను. నా మనసుకి అనిపించినది నేను చేస్తా.


- బేసిక్ గా నేను నెగటివ్ పీపుల్ కి దూరంగా ఉంటాను. నెగటివ్ ఆలోచనలను రానివ్వను. వీలైనంతగా పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉంటాను. ఎదుటి వ్యక్తుల్లో కూడా పాజిటివ్ నే చేస్తాను. ఒకవేళ నా గురించి ఎవరైనా నెగటివ్ గా కామెంట్ చేశారని తెలిస్తే, లైట్ తీసుకుంటాను. నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. అందుకని చిన్న చిన్న విషయాలకు హర్ట్ అయిపోను.


- నాకు అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. ముఖ్యంగా పీరియాడికల్ మూవీస్ లో నటించాలనే కోరిక ఉంది. మంచి మంచి పాత్రలు చేస్తూ, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం. షూటింగ్స్ లేని సమయాల్లో పెయింటింగ్ చేస్తాను. వాటిని నా ఫ్రెండ్స్ కి బహుమతిగా ఇస్తుంటాను. పుస్తకాలు బాగా చదువుతాను.


- ఈ మధ్య రష్యల్ బ్యాలే నేర్చుకోవడం మొదలుపెట్టాను. బ్యాలే డ్యాన్స్ ఏదైనా చిన్నప్పుడే నేర్చేసుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది. నేను జిమ్నాస్టిక్స్ కూడా చేసి ఉండటంవల్ల నాకు ఈజీ అవుతోంది. బ్యాలే డ్యాన్స్ ఫిజికల్ ఫిట్ నెస్ కి బాగా ఉపయోగపడుతుంది.


- ప్రస్తుతం కొన్ని చిత్రాలు చర్చలు దశలో ఉన్నాయి. నేను చేసే సినిమాల గురించి దర్శక-నిర్మాతలు ప్రకటిస్తే ఓకే. నా అంతట నేను మాత్రం సినిమా షూటింగ్ ఓ పదిహేను రోజులు పూర్తయ్యాకే ఆ చిత్ర వివరాలు చెబుతా. నాకదో సెంటిమెంట్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !