View

సురేష్ బాబు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను - డార్లింగ్ స్వామి

Sunday,July20th,2014, 04:26 PM

''ఈ సినిమాకి సీనియర్ డైలాగ్ రైటర్స్ ని కాదని, నా మీద నమ్మకంతో నన్ను డైలాగ్ రైటర్ గా తీసుకున్నారు సురేష్ బాబు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను'' అన్నారు మాటల రచయిత డార్లింగ్ స్వామి. డా.డి.రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై.లిమిటెడ్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ సంయుక్తంగా నటి, దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం దృశ్యం. డి.సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి నిర్మాతలు. వెంకటేష్, మీనా జంటగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా వెంకటేష్, మీనా నటించారు. మోహన్ లాల్ మలయాళ చిత్రం 'దృశ్యం'కు అఫీషియల్ రీమేక్ ఇది. ఇందులో నదియా కీలక పాత్ర చేసింది. ఈ సినిమాకి 'డార్లింగ్' స్వామి మాటలందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుని ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు (20.7.2014) డార్లింగ్ స్వామి తో జరిపిన ఇంటర్వ్యూ మీ కోసం...

ముందుగా దృశ్యం సక్సెస్ పట్ల మీ ఫీలింగ్?
చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిందీ చిత్రం. మలయాళ వెర్షన్ చూసిన సురేష్ బాబుగారు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని భావించి రీమేక్ హక్కులను తీసుకున్నారు. ఆ తర్వాత మమ్ముల్ని పిలిచి సినిమా చూపించారు. మలాయళ వెర్షన్ చూసి థ్రిల్ ఫీలయ్యాను. ఓ మంచి సినిమాకి మాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావించాను.

సురేష్ బాబు గారు ఈ సినిమా అవకాశం ఇచ్చినప్పుడు ఏం చెప్పారు?
సీనియర్ రైటర్స్ ని కాదని నా మీద నమ్మకంతో మాటలు రాసే బాధ్యతను నాకు అప్పగించారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో కష్టపడ్డాను. మన నేటివిటీకి దగ్గరగా ఉండాలి అని సురేష్ బాబుగారు చెప్పిన మాటలను పదే పదే గుర్తు చేసుకునీ మరీ ఈ సినిమాకి డైలాగులు రాసాను. ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన తర్వాత డైలాగులు బాగున్నాయని సురేష్ బాబు గారు అభినందించారు. ఆయన నమ్మకం నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది.

రైటర్ గా మీ ప్రస్థానం గురించి చెప్పండి?
మాది తాడేపల్లి గూడెం. గ్రాడ్యుయేషన్ అక్కడే చదువుకున్నాను. వైజాగ్ లో ఎమ్.à°Ž లిటరేచర్ చేసాను. సినిమా మీద ఇష్టంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. ముందు కోన వెంకట్ గారి దగ్గర అసిస్టెంట్ à°—à°¾ చేసాను. 'à°’à°• ఊరిలో' చిత్రంతో రచయితగా మారాను. à°† తర్వా 'హ్యాపీ',  'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్', 'రెబల్' చిత్రాలకు మాటలందించాను. 'రొమాన్స్' చిత్రానికి మెగాఫోన్ పట్టుకున్నాను. 'దృశ్యం' సినిమాకి మాటల రచయితగా అవకాశం రావడంతో మళ్లీ ఇటువైపు వచ్చాను.

లేడీ డైరెక్టర్ తో చేయడం ఎలా అనిపించింది?
శ్రీప్రియగారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఫీల్ ను మిస్ అవ్వకుండా సినిమా మొత్తం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా సీన్స్ ని తెరకెక్కించారు ఆమె.

సినిమాలో కొన్ని లాజిక్ లు మిస్ అయ్యాయనే టాక్ ఉంది?
సినిమా అన్న తర్వాత కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. కానీ వాటిని కనిపించకుండా త్రూ అవుట్ ఫీల్ ని క్యారీ చేసి, ఆడియన్స్ ని ఇన్ వాల్వ్ చేయగలిగితే లాజిక్కులు గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఈ సినిమాలో కొన్ని లాజిక్కులు మిస్ అయినా... అవి పెద్ద లోపంగా అనిపించలేదు.

తెలుగు వెర్షన్ కోసం ఏమైనా మార్పులు చేసారా?
ఒరిజినల్ వెర్షన్ కి ఎక్కువ మార్పులు చేస్తే, ఫీల్ మిస్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మార్పులు చేయకుండా, కొంచెం బెటర్ మెంట్ చేసాం. ఇంటర్వెల్ సీన్ మార్చాం. 20నిముషాల నిడివి తగ్గించాం. ఈ సినిమా కథ ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ విలువలు ఉన్న సినిమా. ఏ భాషలో ఈ సినిమా తీసినా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఫీల్ గుడ్ మూవీ ఇది.

వెంకటేష్ గురించి?
వెంకటేష్ గారు à°ˆ సినిమా అంగీకరించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇద్దరు పిల్లలు తండ్రిగా à°ˆ సినిమాలో నటించాలి. మలయాళ వెర్షన్ చూసి, à°ˆ సినిమా చేయడానికి ముందుకొచ్చారు వెంకటేష్. రాంబాబు పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి ప్రేక్షకుల నుంచి మన్ననలు అందుకున్నారు.  ముందుగా రాంబాబు పాత్రకు దొరబాబు పేరు పెట్టాలని భావించాము. కానీ సురేష్ బాబుగారు à°† పేరు ఆడియన్స్ à°•à°¿ కనెక్ట్ అవ్వదు అని రాంబాబు పేరు సూచించారు. నిజంగానే రాంబాబు పేరు ఆడియన్స్ à°•à°¿ బాగా కనెక్ట్ అయ్యింది.

ఈ సినిమాకి ఏవో లీగల్ సమస్యలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి?
మలయాళం రీమేక్ హక్కులను తీసుకునే తెలుగు రీమేక్ చేసాం. వెబ్ సైట్ ల్లో వచ్చిన వార్తల ద్వారానే ఈ సినిమాకి లీగల్ సమస్యలు వచ్చాయనే విషయం తెలుసుకున్నాను. అసలు విషయం ఏంటనేది నాకు తెలీదు.

మీ తదుపరి ప్రాజెక్ట్ గురించి చెప్పండి?
కరుణాకరన్ దర్శకత్వంలో నితిన్ హీరోగా చేస్తున్న సినిమాకి నేనే రైటర్ గా వర్క్ చేయాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. కరుణాకరన్ తదుపరి చిత్రానికి నేనే రచయితగా వర్క్ చేస్తున్నాను. కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

డైరెక్టర్ గా సినిమాలు కమిట్ అయ్యారా?
కొన్ని ప్రాజెక్ట్స్ ని వర్కవుట్ చేస్తున్నాను. ఇప్పుడే వాటి గురించి రివీల్ చేయలేను. అన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేస్తాను.

Darling Swamy Spoked about Drishyam



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !