View

ఇంటర్య్వూ - డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ (సోగ్గాడే చిన్ని నాయన)

Thursday,January14th,2016, 01:51 PM

కింగ్ నాగార్జున న‌టించిన 'సోగ్గాడే చిన్నినాయ‌న' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు క‌ల్యాణ్ కృష్ణ‌. ఇందులో నాగార్జున తండ్రీ కొడుకులుగా డ్యుయెల్ రోల్ చేసారు. ఇందులో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటించారు. అన్న‌పూర్ణ సంస్థ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రేపు (15.1.2016) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ క‌ల్యాణ్ కృష్ణ ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం...


మీ నేపధ్యం?
మాది వెస్ట్ గోదావ‌రి. నేను పెరిగిందంతా వైజాగ్‌. యూనివ‌ర్శిటీలో ఎం.కామ్ చేస్తున్న‌ప్పుడే హోలీ సినిమాకు స్క్రిప్ట్ ఇచ్చాను. ఆ త‌ర్వాత తేజ‌గారి ద‌గ్గ‌ర జై నుంచి ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో చేశా. పోసానిగారి ద‌గ్గ‌ర, సూర్యా మూవీస్‌లోనూ ప‌నిచేశాను. దాదాపు ప‌దేళ్ళ‌కు పైగా ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో చేశాను. దర్శకుడిగా ఇది నాకు తొలి సినిమా.


అన్నపూర్ఱ స్టూడియోలో సినిమా చేసే అవకాశం ఎలా వచ్చింది? 
నేను నాగ‌చైత‌న్య‌ను దృష్టిలో పెట్టుకుని అంత‌కు ముందు నాగార్జున‌గారికి రెండు క‌థ‌లు చెప్పాను. చైత‌న్య మ‌రో రెండు ప్రాజెక్టులు చేస్తున్నార‌ని, న‌న్ను వెయిట్ చేయ‌మ‌ని చెప్పారు నాగ్ సార్‌. స‌రేన‌నుకున్నా. అలాంటి స‌మ‌యంలోనే ఒక‌సారి రామ్మోహ‌న్‌గారు ఫోన్ చేసి ఈ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని మెయిల్ చేశారు. 15 డేస్ టైమ్ తీసుకుని మెయిల్ చేశా. వెంట‌నే నాగ్ సార్‌కి న‌చ్చి మ‌రో 15 డేస్ టైమ్ ఇచ్చి న‌న్ను బౌండ్ స్క్రిప్ట్ చేయ‌మ‌న్నారు. చేశాను.


ఈ చిత్రంలో నాగార్జున డ్యుయెల్ రోల్ చేసారు... ఆ పాత్రలు ఎలా ఉంటాయి?
నాగార్జున‌గారు బంగార్రాజు పాత్ర‌లోనూ, రాంబాబుగానూ క‌నిపిస్తారు. బంగార్రాజు స‌ర‌దాగా ప‌ల్లెటూరిలో సాగే పాత్ర‌. ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌గా కృష్ణ‌కుమారి పాత్ర ఉంటుంది. అందులో ఎవ‌రు చేశార‌నేది స‌స్పెన్స్. ఈ సినిమాలో రాంబాబు పాత్ర‌ను త‌ల్లి నాజూగ్గా పెంచుతుంది. అత‌నికి త‌న వృత్తి త‌ప్ప ఇంకేమీ తెలియ‌దు. అలాంటి పాత్ర అది.


ఇందులో నాగార్జున ఆత్మ‌గా క‌నిపిస్తారా?
అవునండీ. మ‌ధ్య‌లో కొంత ఫ్లాష్ బ్యాక్ త‌ప్ప మిగిలిందంతా ఆయ‌న ఆత్మ‌గానే క‌నిపిస్తారు. ఇందులో య‌మ‌లోకాన్ని కూడా ఒక లోకంగా క్రియేట్ చేసి కొత్త‌గా చూపించాం. దాంతో పాటు ఒక పాము, ఒక టెంపుల్ కూడా ఇందులో కీ రోల్స్ గా ఉంటాయి.


ఈ సినిమా హైలైట్స్ ఏంటి?
బంగార్రాజు, స‌త్య‌భామ‌, రామ్మోహ‌న్‌, సీత పాత్ర‌లు నాలుగు పిల్ల‌ర్ల‌లాగా ఉంటాయి. ఈ సినిమాలో రొమాన్స్, హ్యూమ‌ర్ ఉంటుంది. పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అనూప్ రీరికార్డింగ్ చాలా బాగా చేశారు. బ్ర‌హ్మానందంగారి పాత్ర బావుంటుంది. కంప్లీట్ విలేజ్ బేస్డ్ సినిమా. అన‌సూయ‌, హంసానందిని అతిథి పాత్ర‌ల్లో కీల‌కంగా క‌నిపిస్తారు. య‌ముడుగా నాగ‌బాబు చేశారు. సంప‌త్‌గారు, నాజ‌ర్‌గారు, పోసానిగారి పాత్ర‌లు హైలైట్ అవుతాయి. నాగార్జున‌గారు సినిమా చూసి మెచ్చుకున్నారు.


మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
అన్న‌పూర్ణ స్టూడియోలోనే ఉంటుందండీ.


మీకు చిరంజీవిగారితో అనుబంధం ఉంద‌ట క‌దా?
మా అన్న‌య్య‌కు చిరంజీవిగారు ఫ్రెండ్‌. ఆ చ‌నువుతో నేను ఈ ప్రాజెక్ట్ ఓకే అయిన సంగ‌తిని ఆయ‌న‌తో చెప్పాను. ముందే ఎందుకు చెప్ప‌లేద‌ని అడిగారు అంటూ ఇంటర్య్వూ ముగించారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !