View

ఇంటర్య్వూ - డైరెక్టర్ మదన్ (గరం)

Saturday,February06th,2016, 04:06 PM

'ఆ నలుగురు' చిత్రంతో ఉత్తమ కథా రచయిత అనిపించుకున్న మదన్ 'పెళ్లయిన కొత్తలో'తో తనలో మంచి దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నారు. ఆ తర్వాత చేసినవి కూడా 'మదన్ మంచి కంటెంట్ తో సినిమాలు చేస్తాడు' అనిపించాయి. ప్రస్తుతం ఆది, అదా శర్మ జంటగా మదన్ దర్శకత్వం వహించిన చిత్రం 'గరం'. ఈ కథ నచ్చి నటుడు సాయికుమార్ నిర్మాతగా మారాలనుకున్నారు. శ్రీమతి వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీమతి సురేఖా సాయికుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మదన్ తో జరిపిన ఇంటర్వ్యూ...


'గరం' అంటున్నారు. ఇలాంటి టైటిల్ తో మీరు సినిమా చేయడం ఆశ్యర్యంగా ఉంది?
నిజమే. నేను కూడా ఇలాంటి టైటిల్ తో సినిమా చేస్తానని ఊహించలేదు. 'గరం' అంటే ఓన్లీ యాక్షన్ కాదు. కోపాన్ని రిఫర్ చేసేటప్పుడు గరం అంటాం. అలాగే, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా అలా అనవచ్చు. ఈ చిత్రంలో అన్ని అంశాలూ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి.. అన్ని ఎమోషన్స్ నీ రిఫర్ చేసేట్లుగా 'గరం' అని పెట్టాం.


ఈ చిత్రంలో ఆది పాత్ర గురించి?
ఆది పాత్ర పేరు వరాలు. చలాకీగా ఎమోషనల్ గా.. ఇలా వరాలులో ఆల్ షేడ్స్ ఉంటాయి. బేసిక్ గా ఇది లవ్ స్టోరి. యూత్, ఫ్యామిలీస్ అందరూ కలిసి చూసే విధంగా ఉంటుంది. వరాలు పాత్ర కోసం ఆది మామూలుగా కష్టపడలేదు. ఈ కథను నమ్మాడు. అందుకే చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇటలీలో ఎత్తైన ప్రాంతంలో తీసిన సీన్ తన కష్టానికి ఓ నిదర్శనంగా చెప్పొచ్చు. ఎముకలు కొరికే చలిలో ఒంటి మీద పల్చని షర్ట్, ప్యాంటుతో ఆ సీన్ చేయాలి. ఎంతో కష్టపడి ఆది పైకి ఎక్కాక వాతావరణం అనుకూలించలేదు. దాదాపు నాలుగు గంటలు పైనే నిలబడి, ఆ తర్వాత కిందకు దిగి వచ్చాడు. మర్నాడు ఆ షాట్ వద్దని మేమంటామేమోనని తనే ముందుగా పైకి ఎక్కేశాడు. ఆదిలో అంకితభావానికి ఇదో నిదర్శనం. ఈ చిత్రం నటుడిగా తనకు మరింత మంచి పేరు తెచ్చిపెడుతుంది.


ఈ సినిమా మధ్యలో ఆగింది. ఆ తర్వాత సాయకుమార్ ఎంటర్ కావడంతో నిర్మాణం హ్యాపీగా సాగి ఉంటుందేమో?
అవును. ఎంత ఈజీగా జరిగిందంటే.. కేక్ వాక్ అంటారే అలా. సాయికుమార్ బెస్ట్ ప్రొడ్యూసర్. భవిష్యత్తులో ఇలాంటి మంచి నిర్మాత నాకు దొరుకుతారో లేదో నాకు తెలియదు. కథకు తగ్గట్టుగా ఖర్చుపెట్టారు. నేనేదడిగినా కాదనలేదు. ఈ విషయంలో సురేఖ, వసంత గార్లకు ధన్యవాదాలు చెప్పాలి.


అసలీ చిత్రం మధ్యలో ఆగడానికి కారణం ఏంటి?
నా మిత్రుడు నాగిరెడ్డి చనిపోయారు. వాస్తవానికి ఈ చిత్రం సెట్ కావడానికి తనే కారణం. నాకు కుడిభుజం లాంటివాడు. ఈ సినిమా పనుల మీద వెళుతుండగా యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు చనిపోయాడు. నేను నాగిరెడ్డి పక్కనే ఉన్నాను. తను లేని లోటు భర్తీ చేయలేనిది. నాగిరెడ్డి మరణంతో నేను చాలా షాకయ్యా. దాన్నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ విధంగా షూటింగ్ కి ఆటంకం ఏర్పడింది. సాయికుమార్, ఆది తదితరుల సపోర్ట్ తో తేరుకోగలిగాను.


మంచి కంటెంట్ తో సినిమాలు తీసే మీరు శ్రీనివాస్ గవిరెడ్డి ఇచ్చిన లైన్ తో ఈ సినిమా తీశారు. మరి.. ఇందులో కంటెంట్ గురించి?
కంటెంట్ లేనిదే నేను సినిమా తీయను. కథలో సోల్ ఉండాలి. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను కమర్షియల్ అంశాలతో తీస్తుంటాను. అందుకు ఓ ఉదాహరణ 'పెళ్లయిన కొత్తలో'. 'గరం'లో మంచి కథ ఉంది. కమర్షియల్ విలువలున్నాయి. యూత్, ఫ్యామిలీస్, మాస్ అందరూ చూసే విధంగా ఉంటుంది.


కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలకన్నా రొటీన్ కమర్షియల్ చిత్రాలకే ఎక్కువ క్రేజ్ ఉంటుందేమో?
అలా అనలేం. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకెప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఒక్కోసారి రెగ్యులర్ ఫార్మట్ లో సాగే సినిమాల హవా సాగుతుంది. అది కొంత కాలం వరకే. మళ్లీ ప్రేకకులు కంటెంట్ ఉన్న చిత్రాలపైనే మొగ్గు చూపుతారు. అయితే సమకాలీన పరిస్థితులకు తగ్గ కంటెంట్ రెడీ చేసుకోవాలి. అప్పుడు ప్రేకకులు కనెక్ట్ అవుతారు. 'శ్రీమంతుడు' ఆ కోవకు చెందిన చిత్రమే కాబట్టి, కనెక్ట్ అయ్యారు.


'గరం'కన్నా ముందు మొదలుపెట్టిన 'కాఫీ విత్ మై వైఫ్' సినిమా స్టేటస్ ఏంటి?
కన్నడంలో విడుదల చేశాం. బాగానే ఉందనిపించుకుంది. తెలుగులో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.


సినిమా సినిమాకీ ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు?
ఒకానొక దశలో సినిమా ఇండస్ర్టీ నుంచి వెళ్లిపోదామనుకున్నాను. దాంతో రెండు వ్యాపారాలు చేశాను. అవి వర్కవుట్ కాలేదు. అప్పుడు మనకు సినిమా ఇండస్ర్టీనే కరెక్ట్ అనిపించింది. ఇక వరుసగా సినిమాలు చేస్తా.


తదుపరి చిత్రం గురించి?
ఇంకా ఏం డిసైడ్ చేయలేదు. 'గరం' విడుదల తర్వాతే ఏదైనా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !