View

ఇంటర్య్వూ - డైరెక్టర్ మేర్లపాక గాంధీ (ఎక్స్ ప్రెస్ రాజా)

Sunday,January10th,2016, 03:42 PM

రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సూపర్ హిట్స్ త‌రువాత‌ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ శ‌ర్వానంద్‌ హీరోగా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బంపర్ హిట్‌ త‌రువాత‌ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, సుర‌భి క‌థ‌నాయిక‌గా, మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల త‌రువాత‌ క్లీన్ ఎంటర్ టైనర్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ఎక్స్ ప్రెస్ రాజా'. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈ నెల 14 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ రోజు (10.1.2016) డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం...


ఎక్స్ ప్రెస్ రాజా టైటిల్ సౌండ్ చాలా బాగుంది.. ఈ టైటిల్ పెట్టడానికి కారణం?
ఈ చిత్రంలో హీరో పాత్ర చాలా రేసీగా ఉంటుంది. తన ఐడియాస్ గానీ, డీల్ చేసే విధానంగానీ చాలా స్పీడ్ గా ఉంటాయి. అందుకే 'ఎక్స్ ప్రెస్ రాజా' టైటిల్ ని ఫిక్స్ చేసాం. టైటిల్ క్యాచీగా ఉందని అందరూ అన్నారు. టైటిల్ సౌండ్ బాగుందని కూడా అందరూ చెప్పడంతో ఈ టైటిల్ కే ఫిక్స్ అయిపోయాం.


ఈ సినిమా స్టోరీ లైన్ గురించి చెప్పండి?
ఇది చక్కటి లవ్ స్టోరీ. వైజాగ్ మొత్తం మీద ప‌నీ పాటా లేని వాళ్ళ గురించి స‌ర్వే చేస్తే మొద‌టిది హీరో పేరు వ‌స్తుంది. రెండోది ప్ర‌భాస్ శీను పేరు వ‌స్తుంది. అదెలారా నువ్వు నెంబ‌ర్ వ‌న్ వ‌స్తావు నేను క‌దా రావాల్సింది అని వారిద్ద‌రు పోలీస్ స్టేషన్ లో కొట్టుకుంటారు. ఇందులో పోసాని పోలీస్ ఆఫీస‌ర్‌ గా నటించారు. చాలా స‌ర‌దాగా సాగే సినిమా. ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. ప్రతి 15- 20 నిముషాలకు ఓ ట్విస్ట్ వ‌స్తూ ఉంటుంది. ప్రతి పావు గంట‌కి ఓ కొత్త క్యారెక్ట‌ర్ ఎంట్రీ అవుతుంటుంది. ఆ పాత్ర‌కీ హీరో పాత్ర‌కీ లింక్ ఉంటూనే ఉంటుంది. అదేంట‌న్న‌ది చాలా ఆసక్తికరంగా చూపించడం జరిగింది.


సంక్రాంతికి డిక్టేటర్, నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చినినాయనా చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటి మధ్యలో మీ సినిమాని రిలీజ్ చేయడం సేఫేనా?
సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ఆడతాయి. సినిమాలో కూడా కంటెంట్ ఉంది. నిర్మాతలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే అందరం ఆలోచించి ఈ సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాం.


కథ అనుకున్న తర్వాత శర్వానంద్ ని తీసుకున్నారా? శర్వానంద్ ని అనుకుని కథ తయారు చేసారా?
ఫ‌స్ట్ క‌థ అనుకున్నాం. ఆ త‌ర్వాత ర‌న్ రాజా ర‌న్ సినిమా చూశాను. ఆ సినిమాలో ఎప్పుడూ చూడ‌ని శ‌ర్వానంద్‌గారు క‌నిపించారు. చాలా ఫ్రెష్‌గా క‌నిపించారు. నా పాత్ర‌కు సూట్ అవుతార‌ని అనుకున్నా. వెళ్లి క‌థ చెప్పా. ఆయనకు కథ నచ్చింది. దాంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లింది.


శర్వానంద్ పాత్ర ఎలా ఉంటుంది?
శ‌ర్వానంద్ చాలా మంచి ఆర్టిస్ట్. ఈ సినిమాలో శర్వా పాత్రని కొత్త త‌ర‌హాలో ట్రై చేశాం. స‌మ్‌థింగ్ వెరీ క‌మ‌ర్షియ‌ల్‌. ఫైట్స్, పాట‌లు అన్నీ క‌మ‌ర్షియ‌ల్‌గా ఉంటాయి. ఎన్ని టేకులు అడిగినా చేసేవాడు. చాలా హ్యాపీగా అనిపించింది. క‌మ‌ర్షియ‌ల్ తరహాలో డైలాగులు అన్నీ ట్రై చేశాం. శర్వాకి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది.


హీరోయిన్ సురభి గురించి చెప్పండి?
ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ కి సురభి పక్కాగా సరిపోతుంది. అందుకే తనని తీసుకోవడం జరిగింది. తను కూడా క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఇందులో సుర‌భి పాత్ర పేరు అమూల్య. మోసం అంటే భ‌రించ‌లేని క్యారెక్ట‌ర్‌. కాలేజీ స్టూడెంట్‌. హీరోయిన్‌కి ఫైట్ ఉంటుంది. మోసం చేస్తే చంపేయాల‌నుకునే టైప్‌.


ఈ సినిమా హైలైట్స్?
బేసిగ్గా ల‌వ్ స్టోరీ. ఫ‌న్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌. స‌ప్త‌గిరితో పాటు అంద‌రి పాత్ర‌లూ కొత్త‌గా ఉంటాయి. స‌ప్త‌గిరి, సుప్రీత్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ష‌క‌ల‌క శంక‌ర్ వంటి పాత్ర‌ల‌న్నీ క‌థ‌కు ఎలా ఇంట‌ర్ లింక్డ్ అనేది థ్రిల్లింగ్‌గా ఉంటుంది. హీరో, హీరోయిన్లు విడిపోవ‌డానికి కారణం ఉంటుంది. దాన్నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి ఏం చేశార‌నేది ఆస‌క్తిక‌రం. వేంటేజ్ పాయింట్ మూవీ ఉంది క‌దా. దాని కైండ్ ఆఫ్ స్క్రీన్‌ప్లేతో ఉంటుంది సినిమా.


యు.వి క్రియేషన్స్ గురించి చెప్పండి?
టాలీవుడ్ లో బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌. యు.వి క్రియేష‌న్స్ లో ఎవ‌రు ప‌ని చేసినా వాళ్లు ఈ సంస్థ‌తో కనెక్ట్ అయిపోతారు. తమ మాతృ సంస్థలా భావిస్తారు. టెక్నీషియన్స్ ని చూసుకునే విధానం, యువి అధినేతలు సినిమాను ప్రేమించే విధానం, సినిమా బాగా రావాల‌ని ప‌డే తాప‌త్ర‌యం ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఈ సంస్థలో వర్క్ చేయడం నాకు మంచి ఎక్స్ పీరియ‌న్స్. నా తదుపరి సినిమా కూడా యువీ క్రియేష‌న్స్ లోనే ఉంటుంది. ఈ సంస్థలో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తాను.


మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి?
మాది చాలా స్వీట్ ఫ్యామిలీ. కూతురు పుట్టింది. తను పేరు లిపి. సుష్మ నా భార్య. ఎనిమిదో క్లాస్ నుంచి నేను, తను కలిసి చదువుకున్నాం. బిటెక్ లో ప్రపోజ్ చేసాను. తను కూడా అంగీకరించింది. పెళ్లి చేసుకున్నాం.


మీ నాన్నగారు పెద్ద రైటర్ కదా... ఆయన నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకుంటారు?
నాన్నగారు పెద్ద రైటర్. ఆయన నాకు చాలా కథలు చెబుతుంటారు. నేను ఎంటర్ టైన్ మెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆయన రొమాంటిక్ గా కూడా ఉండాలంటారు. అలా మా ఇద్దరి అభిప్రాయాలు డిఫరెంట్ గా ఉంటాయి. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా ఆడటంతో ఆయనకు నా మీద నమ్మకం కలిగింది. నా అభిప్రాయం కూడా కరెక్ట్ అని భావిస్తున్నారు. నాకు నచ్చినట్టు ఎంటర్ టైన్ మెంట్ చేస్తానంటే నాన్నగారికి అవకాశం ఇస్తా... నేను ఏ సినిమా చేసినా ఆయన సలహాలు తీసుకుంటాను.


ఈ సినిమాని ప్రభాస్, రాంచరణ్ చూసారట కదా?
అవును... మా సినిమాని ప్రభాస్, రాంచరణ్ చూసారు. ఇద్దరూ చాలా ఎంజాయ్ చేసారు. బాగుందని ప్రశంసించారు. సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని చెప్పారు.


ఫైనల్ గా... పెద్ద హీరోలతో సినిమా ఎప్పుడు చేస్తారు?
నాకు ఇప్పుడు 27యేళ్లు. చాలా భవిష్యత్తు ఉంది. మంచి కథలు రాసుకుని మెల్లిగా స్టార్ హీరోలను, పెద్ద సంస్థలను సంప్రదిస్తాను. కథలతో ఒప్పించి సినిమాలు చేస్తాను అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !