View

సొంత కథలపై నమ్మకం ఎక్కువ - డైరెక్టర్ నీలకంఠ

Friday,July18th,2014, 03:40 PM

జరగబోయేది ముందే తెలిస్తే... మనిషి జీవితం ఎలా ఉంటుందనే కాన్సెఫ్ట్ తో రూపొందిన చిత్రం 'మాయ'. జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇలాంటి కాన్సెఫ్ట్ తో తమిళ్, మలాయళ భాషల్లో సినిమాలు వచ్చాయికానీ, తెలుగులో రాలేదు. నీలకంఠ తొలిసారి ఈ పాయింట్ తో సినిమా చేసారు. షిరిడి సాయి కంబైన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ రానే, అవంతిక, సుష్మ నటీనటులు. ఈ చిత్రానికి డా.యం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సంద్భరంగా డైరెక్టర్ నీలకంఠతో జరిపిన ఇంటర్య్వూ మీ కోసం...

ముందుగా ఈ సినిమా కాన్సెఫ్ట్ గురించి చెప్పండి?

జరగబోయేది ముందే తెలిస్తే... ఈ ఊహే చాలా థ్రిల్ కు గురి చేస్తుంది. 'మాయ' కోసం నేను తీసుకున్న పాయింట్ ఇదే. ఇలాంటి కాన్సెఫ్ట్ తో ఇతర బాషల్లో సినిమాలు వచ్చాయిగానీ తెలుగులో రాలేదు. నేనే తొలిసారి ఈ ప్రయోగం చేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసే సినిమా అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో ఈ సినిమా ఉంటుంది.

 

ఈ పాయింట్ తో సినిమా చేయాలనే ఊహా ఎలా వచ్చింది?

నిజం చెప్పాలంటే... వేరే సినిమాలను ఇన్సిఫిరేషన్ à°—à°¾ తీసుకుని కథలు అల్లుకోవడం నాకు ఇష్టం ఉండదు. కొత్త పాయింట్స్ కోసం ఆలోచిస్తుంటాను.  à°† ఆలోచనలోంచి పుట్టిన స్టోరీ లైనే 'మాయ'. నా సినిమాలన్నీ అలా తెరకెక్కినవే. అందుకే à°† సినిమాలను చూస్తున్నప్పుడు ఎక్కడో చూసినట్టు అనిపించవు. ఫ్రెష్ à°—à°¾ ఉంటాయి. కాబట్టి నాకు సొంత కథలపైనే నమ్మకం ఎక్కువ.

 

హీరో హర్షవర్ధన్ గురించి చెప్పండి?

à°•à°¥ అనుకున్న తర్వాత, హీరో పాత్రను ఎవరితో చేయిస్తే బాగుంటుందా అనే చర్చలు నా సన్నిహితులతో  à°šà°¾à°²à°¾à°¨à±‡ జరిగాయి. అందరం హర్షవర్ధన్ రానే అయితే బాగుంటుందనుకున్నాం, ఇక తను à°ˆ పాత్ర చేయడం మొదలుపెట్టిన తర్వాత... పర్ ఫెక్ట్ à°—à°¾ హీరో పాత్రను సెలక్ట్ చేసాం అనుకున్నాం. వంద శాతం హర్ష న్యాయం చేసాడు. అతనికి à°ˆ చిత్రం మంచి గుర్తింపు తెచ్చి పెడుతుంది.

 

హీరోయిన్స్ గురించి?

à°ˆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. కన్నడంలో రెండు సినిమాల్లో నటించిన సుష్మ  à°ˆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరో హీరోయిన్ నందినిరాయ్. ఆమెకు ఇది తొలి పరిచయం. అవంతిక మూడో హీరోయిన్. ఆమె మోడల్ à°°à°‚à°—à°‚ నుంచి వచ్చింది. à°ˆ ముగ్గురి పాత్రలు బాగుంటాయి. వారు కూడా చాలా బాగా నటించారు.

సంగీతం, రీ-రికార్డింగ్ గురించి చెప్పండి?

శేఖర్ చంద్ర చక్కటి పాటలిచ్చారు. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. ఈ సినిమాకి పాటలు, రీ-రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన కాన్సెఫ్ట్ కి, నేను అనుకున్న విధంగా ట్యూన్స్ సమకూర్చారు శేఖర్ చంద్ర.ఇందులోని రెండు పాటలను మా డిజైనర్ రమాదేవి రాసారు. లిరిక్స్ కూడా వినసొంపుగా ఉంటాయి.

 

ఈ సినిమా పట్ల నిర్మాతల ఫీలింగ్?

సినిమా అవుట్ ఫుట్ చూసి చాలా ఆనందంగా ఉన్నారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్ ని ఏర్పాటు చేయడానికి మా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీన్నిబట్టి వారికి ఈ సినిమాపై ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక నేను చెప్పిన కథను, నన్ను పూర్తిగా నమ్మి ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చారు. నాపై ఉంచిన వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.

 

డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డిగారు ఈ చిత్రానికి ఓ నిర్మాత కదా? ఆయన ఏమైనా సలహాలు ఇచ్చారా?

శ్రీధర్ రెడ్డిగారితో నా అనుబంధం ఇప్పటిదికాదు. 2009నుంచి నాకు శ్రీధర్ రెడ్డిగారితో మంచి అనుబంధం ఉంది. ఎప్పట్నుంచో ఇద్దరం కలిసి సినిమా చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఇప్పటివరకూ కుదరలేదు. ఈ సినిమాతో కుదిరింది. ఆయన కూడా డైరెక్టర్ కాబట్టి కొన్ని సూచనలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన సూచలను, సలహాలను పాటించాను. సినిమా అనేది టీమంతా కష్టపడితేనే బాగా వస్తుంది. ఆ రకంగా మా టీమ్ కృషితోనే ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చింది.

 

ఈ సినిమా అవుట్ ఫుట్ ని మీ యూనిట్ మెంబర్స్ కాకుండా బయటవాళ్లు చూసారా?

చూసారు. సినిమాకి సంబంధంలేని కొంతమందికి చూపించాను. వాళ్లందరూ చాలా థ్రిల్ ఫీలయ్యారు. సినిమా బాగుందని అభినందించారు. దాంతో నాకు మరింత నమ్మకం కుదిరింది.

''మిస్సమ్మ' తర్వాత అంతటి మంచి చిత్రం చేయలేకపోయాను. ఈ సినిమా ఆ కొరతను తీర్చుతుంది. నాకు 'మాయ' మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది'' అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు నీలకంఠ.

 

 

Neelakanta interview about Maaya



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !