View

ద్వేషాన్ని రాక్షసుడి రూపంలో చూపించాం - దర్శక, నిర్మాత మహేష్

Thursday,August06th,2015, 10:28 AM

మహేష్ హిమ మూవీస్, ఐ ఫాంటసీ డిజైన్ స్టూడియోస్ సంయుక్తంగా రాజ్, గీతా భగత్ జంటగా మహేష్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'కలయా నిజమా'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మహేష్ తో జరిపిన ఇంటర్య్వూ ఈ విధంగా...


'కలయా నిజమా' చిత్రం ఎలా ఉండబోతోంది?
కొత్తగా పెళ్ళైన జంట మధ్య ద్వేషం ఏర్పడితే ఎలాంటి పరిణామాలు ఎడురవుతాయనేదే ఈ చిత్ర కథాంశం. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని ఈ చిత్రం ద్వారా చాలా చక్కగా చెప్పడం జరిగింది. మంచి ప్రయత్నం చేసాం. క్లీన్ 'యు' సర్టిఫికేట్ వచ్చింది. ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది. ఎంటర్ టైన్ మెంట్ తో కూడుకున్న ఫ్యామిలీ థ్రిల్లర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది.


గ్రాఫిక్స్ హైలెట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కారణం?
భార్య భర్తల జీవితాలలో ప్రేమ వర్సెస్ ద్వేషం అనే ఆట ఆద్యంతం రసవత్తరంగా సాగే సోషియో ఫాంటసీ కథాంశంతో గ్రాఫిక్స్ హైలైట్స్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం.ఈ సినిమాలో గ్రాఫిక్స్ పది నిమిషాల పాటు ఉంటుంది. ప్రతి మనిషిలో ద్వేషం ఉంటుంది. దానిని బయటకు తీసుకొచ్చి ఓ రాక్షసుడి రూపంలో చూపించాం. భారీగా సెట్స్ వేసి చూపించే స్తోమత లేక సి.జి ద్వారా మాకున్న స్త్రెంగ్థ్ ను ఉపయోగించి గ్రాఫిక్స్ చేసాం.


తొలి సినిమాకే నిర్మాణ బాధ్యతలు, దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం ఎలా ఫీలయ్యారు?
నేనొక ఆర్కిటెక్ట్ ను. సినిమాలపై ఆసక్తితో ఎన్నో లఘు చిత్రాలను తెరకెక్కించి అవార్డులను కూడా సొంతం చేసుకున్నాను. అయితే ప్రస్తుతం వస్తున్న చిత్రాలన్నీ ఒకే రీతిలో ఉంటున్నాయి. నాలుగు పాటలు, ఫైట్స్ రొటీన్ కథతో చిత్రాలొస్తున్నాయి. మంచి కథలతో చిత్రాలు రావాలనుకున్నాను. అందుకే నేనే నేరుగా భిన్నంగా ఉండే కాన్సెప్ట్ తో చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాను. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. అవన్నీ భారీ బడ్జెట్ తో కూడుకున్నవి. అయితే నిర్మాతలు ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అందుకే నాకున్న పరిధిలో తక్కువ బడ్జెట్ తో సినిమా చేసాను. దర్శకుడిగా 24 క్రాఫ్ట్స్ లో నాకు అవగాహన ఉంది. కథపై క్లారిటీ ఉంది. అందుకే నేనే దర్శకత్వం వహిస్తూ నిర్మాణ బాధ్యతలు చేపట్టడం కష్టం అనిపించలేదు.


ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ గురించి..?
హీరో రాజ్ కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించాడు. హీరోగా తనకు ఇది మొదటి చిత్రం. హీరోయిన్ గా నటించిన గీతా భగత్ పాపులర్ యాంకర్. కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఈ సినిమాలో రాజ్, గీతా అధ్బుతంగా నటించారు.


ఈ సినిమా ఆడియన్స్ కు ఎంత వరకు రీచ్ అవుతుందనుకుంటున్నారు..?
మొదట సినిమా చేయాలనుకున్నప్పుడు అందరితో డిస్కస్ చేసాం. ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా హొమ్ వర్క్ చేసాం. మేము తీసుకున్న పాయింట్ ప్రస్తుతం ఉన్నజెనరేషన్ కు బాగా కనెక్ట్ అవుతుంది. సమస్య వస్తే దాని నుండి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు కానీ పరిష్కరించుకోవట్లేదు. ఈ సినిమాలో ఆ పాయింట్స్ అన్ని చూపించాం. ఖచ్చితంగా ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది.


ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు..?
మొత్తం 25 థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న రిలీజ్ చేస్తున్నాం. థియేటర్స్ సమస్య వలన ఎక్కువ చోట్ల రిలీజ్ చేయలేక ఆగస్ట్ 8, 9 తారీఖులలో మరో కొన్ని ఏరియాల్లో విడుదల చేస్తున్నాం. అలానే ఆగస్ట్ 8న యు.కె లో 10 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. యు.ఎస్, ఆస్ట్రేలియాలో, కెనడా లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !