View

మహేష్ బాబు అంటే నాకిష్టం: దుల్కర్ సల్మాన్

Thursday,April23rd,2015, 06:25 PM

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'ఓకే బంగారం' చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతూ ముందుకు దూసుకెళుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ద్వారా దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసాడు దుల్కర్. తనను ఇంత బాగా ఆదరించిన టాలీవుడ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సినిమాకి సంబంధించిన పలు విశేషాలను మీడియాతో పంచుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఆ విశేషాలు ఈ విధంగా...

- మా నాన్నగారికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఇక్కడ స్ర్టయిట్ చిత్రాలు చేశారు. అలాగే మలయాళంలో నటించిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదమయ్యాయి. దేశ, విదేశాల్లో మా నాన్నగారికి తెలుగు అభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్లు నాన్నను పలకరించడం స్వయంగా చూశాను. ఇప్పుడు నేను కూడా ఓ మంచి చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఇక్కడ సినీ ప్రేమికుల సంఖ్య ఎక్కువ. తెలుగువారు కొంతమంది ఫోన్ చేసి, అభినందిస్తున్నారు. నాకిక్కడ ఇంత ప్రేమ లభించడం ఆనందంగా ఉంది.

- చిన్నప్పట్నుంచీ మణిరత్నంగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. 'ఓకే బంగారం' కోసం ఆయన నన్ను సంప్రతించినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఆ తర్వాత ఆయన చెప్పిన ఈ పాయింట్ విని, చాలా ఇంప్రెస్ అయ్యాను. మణిరత్నంగారి సినిమా అంటే ఏదో నటించినట్లుగా ఉండదు. జీవించినట్లుగా ఉంటుంది. ఆయన అలానే చేయించుకుంటారు.

- నిత్యా మీనన్, నేనూ మలయాళంలో రెండు చిత్రాల్లో కలిసి నటించాం. మా కాంబినేషన్లో ఇది మూడో చిత్రం. ఆల్రెడీ మూడు సినిమాల్లో కలిసి నటించినందున మా మధ్య ఓ ఆండర్ స్టాండింగ్ ఏర్పడింది. 'ఓకే బంగారం'లో మా ఇద్దరి కెమిస్ర్టీ బాగుందని అందరూ అంటున్నారు.

- నా మాతృభాష మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాను. 'ఓకే బంగారం'తో కలిసి తమిళంలో నేను రెండు చిత్రాలు చేశాను. మన భారతదేశంలో ఎక్కువ భాషలుంటాయి. అదో వరం. నాకు భాషాభేదం లేదు. మంచి కథ దొరికితే ఎక్కడైనా చేస్తా. ఒకవేళ నేను నటించే మలయాళ చిత్రాలను ఎవరైనా తెలుగులోకి అనువదిస్తే నాకు ఆనందమే.

- నేను తెలుగు చిత్రాలు చూస్తుంటాను. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తదితర హీరోల చిత్రాలు చూస్తుంటాను. నాకు మహేష్, పవన్ అంటే ఇష్టం.

- రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వార్త గురించి ఇక్కడ మాట్లాడుకోదల్చుకోలేదు. ఇది సందర్భం కూడా కాదు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తారా? అని మీరడుగుతున్నారు కాబట్టి, చెబుతున్నా 'ఏదైనా కథను బట్టి నిర్ణయిస్తా'.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !