View

త్రివిక్రమ్ గారి వల్లే నేనీ స్థాయికి చేరుకున్నాను - ఎడిటర్ ప్రవీణ్ పూడి

Sunday,March01st,2015, 10:36 AM

''ఓ సినిమాని డైరెక్టర్ ఎంత బాగా తీసినా, ఎడిటర్ కత్తెరకు పదును ఉంటేనే ఆ సినిమా సక్రమంగా ఉంటుంది. అందుకే చాలా బాధ్యతగా, ఎంతో శ్రధ్ధగా ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటాను'' అంటున్నారు ఎడిటర్ ప్రవీణ్ పూడి. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుగారి దగ్గర శిష్యరికం చేసిన ప్రవీణ్ పూడి 'ఆకాశరామన్న' చిత్రం ద్వారా ఎడిటర్ గా పరిచయం అయ్యారు. జులాయి, అత్తారింటికి దారేది, మనం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఎడిటింగ్ చేసారు. ఈ రోజు (1.3.2015) ప్రవీణ్ పూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఈ విధంగా...

హ్యాపీ బర్త్ డే ప్రవీణ్ గారు... ఎడిటర్ గా ఇప్పుడు సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగిస్తున్నారు. అసలు చిత్రపరిశ్రమలోకి ఎలా అడగుపెట్టారు?
థ్యాంక్స్ అండి... స్వతహాగా నేను చదువులో చాలా పూర్ స్టూడంట్ ని. ఇంటర్ తర్వాత చదువుకు గుడ్ బై చెప్పేసాను. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు తెలిసిన వాళ్ల ద్వారా కోటగిరి వెంకటేశ్వరరావుగారి దగ్గర అప్రెంటీస్ గా జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. అలా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను.

ఎన్ని సంవత్సరాలు అసిస్టెంట్ ఎడిటర్ గా కొనసాగారు?
వెంకటేశ్వరరావుగారి దగ్గర రాజకుమారుడు, చూడాలని ఉంది, సమరసింహా రెడ్డిలాంటి సినిమాలు చేసాను. మార్తాండ్.కె.వెంకటేష్ గారి దగ్గర కూడా చేసాను. 2002లో పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో చేరాను. దాదాపు 6సంవత్సరాలు అక్కడ వర్క్ చేసాను. జానీ, గుడంబా శంకర్, బాలు, అన్నవరం, జల్సా సినిమాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా వర్క్ చేసాను. ఈ సినిమాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను.

ఏ సినిమాతో ఎడిటర్ గా మీ కెరియర్ ఆరంభమయ్యింది?
శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర చేస్తున్నప్పుడు 'ఆకాశరామన్న' చిత్రానికి ఎడిటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో రూపొందిన 'జులాయి' చిత్రానికి ఎడిటింగ్ చేసే అవకాశం రావడం, ఆ సినిమా మంచి విజయం సాధించడం, నాకు చాలా మంచి పేరు రావడం జరిగింది. ఈ సినిమా నా కెరియర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత 'మనం, 'అత్తారింటికి దారేది' చిత్రాలకు ఎడిటింగ్ చేసే అవకాశం రావడం జరిగింది. ఈ సినిమాలు నా కెరియర్ ని పీక్ లోకి తీసుకెళ్లాయి. త్రివిక్రమ్ గారి వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను.

ఓ సినిమాకి ఎడిటింగ్ చేసే ముందు మీరు చేసే హోమ్ వర్క్ ఏంటీ?
నా వరకూ నేను సినిమాకి ఎడిటింగ్ ఆరంభించే ముందు షాట్ బై షాట్ రాసుకుని నోట్స్ తయారు చేసుకుంటాను. దాన్ని ఫాలో అవుతూ ఎడిటింగ్ చేస్తాను. చక్కటి స్ర్కీన్ ప్లేతో రూపొందిన 'మనం' సినిమాకి ఎడిటింగ్ చేయడం ఓ మంచి అనుభూతిని కలిగించింది.

ఇప్పుడు డిజిటల్ ఎడిటింగ్ వచ్చేసింది. ఇంతకుముందు ఫిల్మ్ ఎడిటింగ్ కీ, ఇప్పుడు చేస్తున్న డిజిటల్ ఎడిటింగ్ కి తేడా ఏంటీ?
ఫిల్మ్ ఎడిటింగ్ చాలా కష్టం. ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దడం చాలా కష్టం. డిజిటల్ ఎడిటింగ్ అలా కాదు. ఏమైనా తప్పు జరిగితే సరిద్దుకునే అవకాశం ఉంది. ఒక సీన్ కి ఎక్కువ షాట్స్ వస్తాయి. వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా ఎడిట్ చేస్తే సరిపోతుంది.

సినిమా ఫెయిల్ అయితే... అందులో ఎడిటర్ బాధ్యత ఎంత ఉంటుంది?
ఏ సినిమా అయినా డైరెక్టర్ తీసిన దాన్నిబట్టే ఎడిట్ చేస్తాం. డైరెక్టర్ ఒక్కో సీన్ కి చాలా షాట్స్ తీస్తారు. ఆ షాట్స్ ని తీసుకుని, సీన్ కున్న ఇంపార్టెన్స్ ని మైండ్ లో పెట్టుకుని, ఆ సీన్ సిడివి ఎంత ఉంటే బాగుంటుందో దాని ప్రకారం సీన్ ని ఎడిట్ చేయడం ఎడిటర్ బాధ్యత. కంటెంట్ లేని సీన్ నిడివి ఎక్కువగా ఉండి, ప్రేక్షకులు అసహనానికి గురైతే అది ఖచ్చితంగా ఎడిటర్ తప్పే. అలాంటివి జరగకుండా ఎడిటర్ జాగ్రత్త వహించాలి.

ఇప్పటివరకూ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ చెప్పండి?
అత్తారింటికి దారేది చిత్రం విడుదలకు ముందు టీమందరం కలిసి సినిమా చూసాం. సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ గారు క్లయి మ్యాక్స్ సీన్ అద్భుతంగా ఎడిట్ చేసావంటూ చాలా మెచ్చుకున్నారు. ఈ కాంప్లిమెంట్స్ ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ సీన్ కి నేను చాలా కాంప్లిమెంట్స్ అందుకున్నాను.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెప్పండి?
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి నేనే ఎడిటర్ ని. నాగార్జునగారి 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నాను. నితిన్ హీరోగా రూపొందిన 'కొరియర్ బోయ్ కళ్యాణ్' చిత్రానికి కూడా ఎడిటింగ్ చేస్తున్నాను. ఈ యేడాది తమిళ్ సినిమాలకు ఎడిటింగ్ చేసే అవకాశం కూడా వస్తుందనుకుంటున్నాను. నా కెరియర్ ఇంత సక్సెస్ ఫుల్ గా కొనసాగడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !