View

వైజాగ్ లో 'గాలిపటం' ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్

Thursday,July31st,2014, 10:44 AM

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా à°Žà°°à°¿à°•à°¾ ఫెర్నాండెజ్‌, క్రిస్టినా ఆకిహివా హీరోయిన్లుగా సంపత్‌నంది టీమ్‌ వర్క్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది లాస్‌ఏంజిల్స్‌ టాకీస్‌తో కలిసి నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం ‘గాలిపటం’. జయదేవ్‌ అప్పన్నగారి సమర్పణలో నవీన్‌గాంధీని దర్శకునిగా పరిచయంచేస్తూ సంపత్‌నంది, కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సారథ్యంలో రూపొందిన à°ˆ చిత్రం ఆడియో ఇటీవల హైదరాబాద్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన à°ˆ పాటలు యువతరాన్ని కిర్రెక్కిస్తూ అనతికాలంలోనే లక్షల సంఖ్యలో అమ్ముడై ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ సాధించింది. à°ˆ సందర్భంగా వైజాగ్‌ ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఇంజనీరింగ్‌ కాలేజ్‌ విభాగంలోని à°¡à°¾. వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను వైభవంగా నిర్వహించారు. à°ˆ వేడుకకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు, అమలాపురం ఎంపీ కె.రవీందర్‌బాబు,  చోడవరం శాసనసభ్యులు కెఎల్‌ఎన్‌ రాజు హాజరుకాగా ‘గాలిపటం’ చిత్ర కథానాయకుడు ఆది, నాయకి క్రిస్టినా
ఆకిహివా, దర్శకుడు నవీన్‌గాంధీ, సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో, గేయ రచయిత భాస్కరభట్ల, చిత్ర నిర్మాతలు సంపత్‌ నంది, కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ à°Žà°‚.ఎస్‌. కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

‘రచ్చ’లా ‘గాలిపటం’ కూడా సూపర్‌హిట్‌  అవుతుంది- విద్యాశాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు
à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు మాట్లాడుతూ - ‘‘నాకు సాయికుమార్‌ అంటే చాలా ఇష్టం. ఆయన కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న ‘గాలిపటం’ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా వుంది. అలాగే మా రామ్‌చరణ్‌కు ‘రచ్చ’లాంటి సూపర్‌హిట్‌ ఇచ్చిన సంపత్‌ నంది నిర్మాతగా మారి ‘గాలిపటం’ నిర్మించడం అభినందనీయం. ‘రచ్చ’లా ‘గాలిపటం’ కూడా సూపర్‌హిట్‌ కావడం ఖాయమన్నారు. త్వరలోనే విశాఖను సినీ రాజధానిగా మార్చుతామని, ఇక్కడకు చిత్ర పరిశ్రమను సాదరంగా ఆహ్వానిస్తున్నామని, వారికి అన్నివిధాల ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. షూటింగ్‌ పర్మిషన్ల కోసం సింగిల్‌ విండో సిస్టం తీసుకు వస్తామన్నారు. చిత్ర పరిశ్రమ ఇక్కడ స్ధిరపడడానికి అనువైన వాతావరణం ఉంది’’ అన్నారు.

వైజాగ్‌లో షూటింగ్‌చేసినా, ఫంక్షన్‌ చేసినా à°† సినిమా సూపర్‌హిట్‌ - ఎంపీ కంభంపాటి హరిబాబు
విశాఖపట్నం లోక్‌సభ సభ్యులు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ - ‘‘ఇంతవరకు వైజాగ్‌లో షూటింగ్‌ గానీ, ఫంక్షన్‌ గానీ జరుపుకున్న ప్రతి చిత్రం సూపర్‌హిట్‌ అనే సెంటిమెంట్‌ బలంగా వుందని, à°† సెంటిమెంట్‌ను ‘గాలిపటం’ కూడా నిజం చేసి మరింత బలం చేకూర్చగలదని నమ్ముతున్నానని అన్నారు. నటుడు సాయికుమార్‌ నాకు మంచి మిత్రుడు. ఆయన మా బిజెపి పార్టీ తరఫున ఇంతకు ముందు కర్నాటక అసెంబ్లీకి పోటీచేశారని, అప్పటి నుండి ఆయనతో నాకు చక్కని స్నేహం ఉంది. వారి అబ్బాయి ఆది మంచి హీరోగా నిలదొక్కుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. ‘గాలిపటం’ ఆడియోలాగే సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. à°ˆ సందర్భంగా à°ˆ వేదిక ద్వారా చిత్ర ప్రముఖులందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మీరంతా విశాఖ వచ్చేయండి. ఇక్కడ మీకు అన్ని వసతులు కల్పిస్తాం. సహజసిద్ధమైన అందాల సుందర ప్రదేశాలు, అన్నిరకాల లొకేషన్లు ఇక్కడ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని విశాఖను నవ్యాంధ్రప్రదేశ్‌కు సినీ రాజధానిగా మార్చుకుందాం’’ అన్నారు.

పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం - పండగొచ్చింది ఎగరెయ్‌à°°à°¾ గాలిపటం - సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో
చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో తన పాటలతో ఆడిటోరియంలో జోష్‌ నింపారు. నేరుగా ప్రేక్షకుల మధ్య వెళ్లి వారిని ఉత్సాహపరిచారు. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్‌ ‘పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం’ పాటతో యూత్‌ని కిరాక్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘గాలిపటం’ పాటలకు లభిస్తున్న ఆదరణ అమోఘం. ఈరోజు వైజాగ్‌లో ఆడియన్స్‌ మధ్య à°ˆ ఫంక్షన్‌ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. ఆడియోలాగే సినిమాని కూడా సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను. అన్నయ్య సంపత్‌ నంది ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంత మంచి మ్యూజిక్‌ ఇవ్వగలిగానని ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు.

‘గాలిపటం’ రెపరెపలాడుతుంది - భాస్కరభట్ల
గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ మాట్లాడుతూ - ‘‘కొన్ని చిత్రాల విజయాలు ముందుగానే ఊహించగలుగుతామని నాకు ఎందుకో మొదటి నుండి అనిపిస్తుంది. ‘గాలిపటం’ గ్యారంటీగా సూపర్‌హిట్‌ అవుతుందని. అందుకు నిదర్శనం ఆడియో సూపర్‌హిట్‌ కావడం. నేను ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తిగా వైజాగ్‌లో ‘గాలిపటం’ ఫంక్షన్‌లో పాల్గొనడం ఆనందంగా వుంది. నేను ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం సాయికుమార్‌ గారే. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి వుంటాను’’ అన్నారు.

వైజాగ్‌లో హిట్‌ టాక్‌ వస్తే à°† సినిమాకు తిరుగులేదు - నవీన్‌గాంధీ
మేము ఏ సినిమా అయినా విడుదలైనప్పుడు వైజాగ్‌ టాక్‌ మీద డిపెండ్‌ అవుతాం. ఇక్కడ హిట్‌ టాక్‌ వస్తే ఇక à°† సినిమాకు ఎదురే లేదని భావిస్తాం. à°† సెంటిమెంట్‌తోనే à°ˆ ఫంక్షన్‌ ఇక్కడ జరపడానికి డిసైడ్‌ అయ్యాం. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ మా ‘గాలిపటం’ చిత్రంపై పాజిటివ్‌à°—à°¾ మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా వుంది. à°’à°• విభిన్నమైన కథాంశంతో ‘గాలిపటం’ రూపొందించాను. చాలా బాగా వచ్చింది. సంపత్‌నంది గారు తను à°’à°• పెద్ద దర్శకుడైనప్పటికీ నా మీద నమ్మకంతో à°ˆ బాధ్యతను అప్పగించారు. కిరణ్‌గారు ఎంతో ప్రోత్సహించారు. హీరో ఆది బాగా కోపరేట్‌ చేశారు. అలాగే యూనిట్‌ సభ్యులందరూ నాకు అన్నివిధాల సహాయ సహకారాలు అందించారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.

వైజాగ్‌ అంటే నాకు చాలా అభిమానం - నిర్మాత సంపత్‌నంది
నాకు మొదటి నుండి  వైజాగ్‌ అన్నా, వైజాగ్‌ ఏరియా ప్రజలన్నా ఎనలేని అభిమానం. వైజాగ్‌ అంటే గొప్ప సెంటిమెంట్‌. నా మొదటి చిత్రం ‘ఏమైంది ఈవేళ’ ఇక్కడ 50 రోజులు ఆడింది. రెండో చిత్రం ‘రచ్చ’ 100 రోజులు ఆడింది. మిగతా ఏరియాల్లో కంటే వైజాగ్‌ ఏరియాలో ‘రచ్చ’పెద్ద హిట్‌. అందుకే ‘గాలిపటం’ ప్లాటినం డిస్క్‌ ఇక్కడే చేయాలని నిర్ణయించాం. ముందుగా ఆర్‌కె బీచ్‌లో పబ్లిక్‌ ఫంక్షన్‌à°—à°¾ నిర్వహించాలని ప్లాన్‌ చేశాం. కానీ వర్షం కారణంగా ఇండోర్‌ స్టేడియంలో చేయాల్సి వచ్చింది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మంత్రివర్యులు à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు, ఎంపీ కంభంపాటి హరిబాబు, కె.రవీందర్‌బాబు, ఎమ్మెల్యే ఆర్‌ఎల్‌ఎన్‌ రాజు గార్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎంతో కష్టపడి సమిష్టిగా à°ˆ చిత్రాన్ని నిర్మించాము. నూటికి నూరు శాతం ఎక్కడా రాజీపడకుండా మేము అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేశాము. చాలా సంతృప్తికరంగా వచ్చింది. ఆడియో సూపర్‌హిట్‌ కావడంతో మా నమ్మకం రెట్టింపు అయింది. ‘గాలిపటం’ గ్యారంటీగా సూపర్‌హిట్‌ అవుతుంది. ఇదే విషయాన్ని రేపు మీరు చెబుతారు. ఆగస్టు 8à°µ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాం అన్నారు.

అబ్బాయిలు ఆటోవాలాలాంటి వారు ఒకర్ని పిలిస్తే పదిమంది పలుకుతారు - హీరోయిన్‌ క్రిస్టినా ఆకిహివా
చిత్ర కథానాయిక క్రిస్టినా ఆకిహివాని నాలుగు మాటలు తెలుగులో చెప్పాలని కోరగా వైజాగ్‌ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అందర్నీ నవ్వించింది. ‘గాలిపటం’లో డైలాగ్‌ చెప్పాలని ఆడియన్స్‌ డిమాండ్‌ చేయగా ‘అబ్బాయిలు ఆటోవాలాలాంటి వారు. ఒకర్ని పిలిస్తే పదిమంది పలుకుతారు’ అని చెప్పి చిలిపిగా కవ్వించింది.

‘గాలిపటం’ హిట్‌ నాన్నకు బర్త్‌డే గిఫ్ట్‌ - లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది
నేను శ్రీకాకుళంలో పుట్టాను. à°ˆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాడ్ని. వైజాగ్‌తో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. నేను ఇక్కడే సత్యానంద్‌ మాస్టార్‌ వద్ద నటనలో శిక్షణ పొందాను. నటనకు సంబంధించి ఎన్నో మెలకువలు ఆయన వద్ద నేర్చుకున్నాను. నేను హీరో కాకముందే వైజాగ్‌తో నా బంధం పెనవేసుకుంది. శిక్షణా సమయంలో వైజాగ్‌ ఆర్‌కె బీచ్‌లో సరదాగా తిరిగేవాడ్ని. ఆరోజుల్ని తలచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు ‘గాలిపటం’ ఫంక్షన్‌ ద్వారా మిమ్మల్ని కలవడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఈరోజు నాన్నగారి పుట్టినరోజు. ఉదయం అమ్మ ఫోన్‌ చేసి అడిగింది. ‘నాన్నగారికి బర్త్‌డే గిఫ్ట్‌ ఏమిస్తావురా’ అని. వెంటనే తడబడకుండా చెప్పేశాను ‘గాలిపటం’ హిట్టే నాన్నగారికి బర్త్‌డే గిఫ్ట్‌ అని. అమ్మ చాలా సంతోషించింది. ఆనందంతో పొంగిపోయింది. కానీ తర్వాత నాకు టెన్షన్‌ పట్టుకుంది. ఎందుకంటే హిట్‌ కొట్టడం గిఫ్ట్‌ కొన్నంత తేలిక కాదు. అది నా చేతుల్లో లేదు. మీ చేతుల్లో ఉంది. మీ అందరి చేతుల్లో ఉంది. నాకు నమ్మకం వుంది. మీ అందరిపైనా నాకు నమ్మకం ఉంది. విభిన్న కథాంశంతో వచ్చిన ప్రతి చిత్రాన్ని మీరు ఆదరించారు, ఆదరిస్తున్నారు. ‘గాలిపటం’ 100 శాతం మీ అందరి ఆదరణ చూరగొంటుంది. మీ అభిమానం, ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

మెమెంటోల ప్రదానం
చివరగా ‘గాలిపటం’ ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ జ్ఞాపికలను మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు, ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎంపీ కె. రవీందర్‌బాబు, ఎమ్మెల్యే కెఎల్‌ఎన్‌ రాజు చేతుల మీదుగా చిత్ర యూనిట్‌ సభ్యులకు బహూకరించారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
కార్తీక్, ప్రాచి, భరత్, పోసాని, భార్గవి, దువ్వాసి, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె. బుజ్జి, ఆర్ట్: డి.వై. సత్యనారాయణ, ఎడిటింగ్: రాంబాబు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !