View

ఇంటర్వ్యూ - హీరో ఆది (బర్త్ డే స్పెషల్)

Tuesday,December22nd,2015, 05:22 PM

లవ్లీ రాక్ స్టార్ ఆది హ్యాండ్ సమ్ గా ఉంటాడు. నటన పరంగా కూడా భేష్ అనిపించుకున్నాడు. ఒక్క కమర్షియల్ హిట్ వస్తే చాలు.. కెరీర్ ఇంకా ఎదుగుతుంది. తాజా చిత్రం 'గరమ్' ఆ సక్సెస్ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రకథ నచ్చి, శ్రీనివాసాయ స్ర్కీన్స్ పతాకంపై శ్రీమతి వసంతా శ్రీనివాస్ సమర్పణలో పి. సురేఖ (సాయికుమార్ సతీమణి) నిర్మించారు. మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. డిసెంబర్ 23 ఆది బర్త్ డే. ఈ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ...


'గరమ్' రిలీజ్ కి రెడీ అయ్యింది.. యాక్చువల్ గా రిలీజ్ డిలే అయ్యింది కదా?
ఈ చిత్ర కథ చాలా బలంగా ఉంటుంది. సినిమా మేం అనుకున్నట్లుగా రావాలని రాజీపడలేదు. ఆర్టిస్టులందరి డేట్స్ దొరికాక, పక్కా ప్లానింగ్ తో చేశాం. కథ మీద ఉన్న నమ్మకంతో లేట్ అయినా ఫర్వాలేదు.. బాగా రావాలనుకున్నాం. శ్రీనివాస్ గవిరెడ్డి మంచి కథ ఇచ్చారు. నాకు కొత్తగా ఉంటుంది. త్వరగా వచ్చినా, ఆలస్యంగా వచ్చినా.. ఆడియన్స్ కి నచ్చాలి. డాడీ, నేను, డైరెక్టర్ అలానే అనుకుని ఈ సినిమా చేశాం.


ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కూడా పూర్తయ్యింది. మంచి డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం.


ఇందులో మీ పాత్ర పేరేంటి?
నా పాత్ర పేరు వరాలబాబు. పల్లెటూరి కుర్రాణ్ణి. ముక్కుసూటిగా ఉండే కుర్రాడు. ప్రేమిస్తే చెప్పెయ్.. బాధ అనిపిస్తే ఏడ్చెయ్...కోపం వస్తే కొట్టెయ్.. మనసులో ఏ ఫీలింగ్స్ ఉండకూడదనుకునే కుర్రాడు. ఫస్ట్ టైమ్ ఈ చిత్రం కోసం ఈస్ట్ గోదావరి స్లాంగ్ లో మాట్లాడాను. నా పాత్ర చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది.


ఈ చిత్రాన్ని ముందు వేరే బేనర్లో ప్రారంభించారు కదా.. ఆ తర్వాత మీరే సొంతంగా నిర్మించడానికి కారణం ఏంటి?
కొన్ని కారణాల వల్ల ముందు ప్రారంభించిన నిర్మాత తప్పుకున్నారు. అప్పటికే ఈ కథతో పది రోజులు ప్రయాణం చేశాం. మదన్ గారు, నాకు.. అందరికీ బాగా నచ్చింది. కథ బాగుంది కాబట్టి, మేం టేకోవర్ చేసుకుని, సొంతంగా నిర్మించాం.


నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలన్నది మీ ఆలోచనా? మీ నాన్నగారిదా?
ఇద్దరి ఆలోచనా కాదు. అలా జరిగిపోయిందంతే. నాకిది ఏడో సినిమా. సెంటిమెంట్ గా ఏడో సినిమా ఆగకూడదనుకున్నాం. పైగా, మంచి సినిమా అవుతుందని నమ్మాం. కొన్నిసార్లు నాలుగు రోజులే షూటింగ్ చేసినా ఆ సినిమా మీద ప్రేమ ఏర్పడుతుంది.. ఈ సినిమా మీద నాక్కూడా అలా ప్రేమ ఏర్పడింది. ఓ రెండు నెలలు ఆగాం. చివరికి మేమే నిర్మించాలని డిసైడ్ అయ్యాం.


ఈస్ట్ గోదావరి స్లాంగ్ లో మాట్లాడటానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చిందా?
లేదు. ఈ సినిమా రచయిత శ్రీనివాస్ గవిరెడ్డికి ఆ స్లాంగ్ తెలుసు. ఓ వారం రోజులు ఆయన దగ్గర నేర్చుకున్నాను. డాడీ ఏమన్నారంటే.. సీన్ చేసేటప్పుడు నటన గురించి ఆలోచించు.. డబ్బింగ్ చెప్పేటప్పుడు స్లాంగ్ గురించి ఆలోచించవచ్చు అన్నారు. శ్రీనివాస్ ఏమో రవితేజ సినిమాలు చూడమనీ, రామ్ నటించిన 'కందిరీగ' చూడమని అన్నారు. చూశాను కానీ.. నా స్టైల్ లో చేశాను. ఈస్ల్ గోదావరి కుర్రాడి క్యారెక్టర్ ఆది చేస్తే ఎలా ఉంటుందో అలా చేశాను.


రాజమండ్రితో బంధుత్వం ఉంది కదా.. ఎవరినైనా గమనించారా?
పర్టిక్యులర్ గా గమనించలేదు. అటువైపు వాళ్లు ఏం మాట్లాడినా అందులో చిన్నపాటి వెటకారం ఉంటుంది. సెటైర్ మిస్ అవ్వదు. నా వైఫ్ కూడా చాలా జోవియల్ గా ఉంటుంది. అక్కడివాళ్లకి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. మా మామయ్యగారు చాలా జోకులేస్తుంటారు. అటువైపు వాళ్లతో ఉన్నప్పుడు చాలా పాజిటివ్ గా ఉంటుంది.


మదన్ క్లాస్ డైరెక్టర్.. మీరేమో మాస్.. మీ ఇద్దరికీ ఎలా సింక్ అయ్యింది?
మదన్ గారు చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ఈ చిత్రంలో ఆ సెన్సిబుల్టీస్ ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఈ కథకు ఆయన పర్ ఫెక్ట్. డాడీతో చాలా సినిమాలకు ఫైట్ మాస్టర్ గా చేసిన థ్రిల్లర్ మంజు ఈ చిత్రానికి చేశారు. ఆయనతో నేను చేయడం ఇదే మొదటిసారి. వెంకట్ అని ఇంకో ఫైట్ మాస్టర్ కూడా చేశారు. ఒక్కో ఫైట్ ని ఒక్కో కాన్సెప్ట్ లో చేశాం.


మదన్ వర్కింగ్ స్టయిల్ ఎలా ఉంటుంది?
చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తనకేం కావాలో ఆర్టిస్టులకు చెప్పి, ఎంతవరకూ కావాలో అంతే రాబట్టుకుంటారు. నటన విషయంలో చాలా స్వేచ్ఛ ఇస్తారు. ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు.


'గరమ్' టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
క్యారెక్టర్ లో ఉండే స్పార్క్ ని దృష్టిలో పెట్టుకుని ఈ టైటిల్ పెట్టాం. 'గరమ్' అన్నాం కదా అని అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ అనుకునే అవకాశం ఉంది. కానీ, లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. ఇలా అన్ని అంశాలూ ఉన్న చిత్రం.


ఈ చిత్రాన్ని మీ అమ్మగారు చూశారు కదా.. ఏమన్నారు?
ఆవిడ చాలా హ్యాపీ. చూసినవాళ్లందరూ బాగుందన్నారు. మా అమ్మగారు ఈ సినిమా గురించి ఏం చెప్పారో అందరికీ చెప్పి, ప్రమోషన్ కి ఉపయోగించదల్చుకోలేదు.


మీ పాప పుట్టిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కదా.. ఎలా ఉంది?
అదొక్కటే కాదు.. నా గత చిత్రం 'రఫ్' విడుదలై ఏడాది అయిపోయింది. నా పెళ్లి తర్వాత విడుదలవుతున్న ఫస్ట్ మూవీ ఇదే. ఈ ఏడాది కాలం చాలా స్పీడ్ గా వెళ్లిపోయింది. నా కూతురు నాకు లక్ ఇస్తుందని నమ్ముతున్నాను. సినిమా విజయం మీద పూర్తి నమ్మకం ఉంది.


ఏడాది గ్యాప్ ఎందుకు వచ్చిందనుకుంటున్నారు?
తెలియడంలేదు. ఒక్కోసారి అలా జరిగిపోతుంది. పైగా ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసినవాళ్లందరూ బిజీ ఆర్టిస్టులే. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, పోసాని, నరేశ్, కబీర్ సింగ్.. ఇలా అందరూ బిజీ. వీళ్ల డేట్స్ దొరకడానికి చాలా టైమ్ పట్టింది. ఇంకో విషయం ఏంటంటే.. సినిమా ఎప్పుడో అయిపోయినా మంచి డేట్ కోసం ఎదురు చూశాం. డిసెంబర్ 4న అనుకున్నాం. ఆ తర్వాత వేరే తేదీ అనుకున్నాం. ఆ తేదీల్లో చాలా సినిమాలున్నాయి. మంచి తేదీ దొరకాలి. మేం నిర్మించిన మొదటి సినిమా కాబట్టి, మంచి తేదీలో విడుదల చేయాలనుకున్నాం. 'సాయికుమార్ గారు ఇలాంటి సినిమా చేశారేంటి?' అని ఎవరూ అనుకోకూడదు. అందుకే చాలా జాగ్రత్తగా తీశాం.


మీ నాన్నగారు నిర్మాణం కొనసాగిస్తారా?
కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఈ బేనర్ మెయిన్ ఎజెండా ఏంటంటే.. ఎక్కువ సినిమాలు తీయకపోయినా.. మంచి కథలు దొరికినప్పుడు సినిమాలు తీయాలనుకుంటున్నాం. మిగతా హీరోలతో కూడా తీయాలని ఉంది.


సినిమా నిర్మాణం అనేది గ్యాంబ్లింగ్ లాంటిది. ఫిఫ్టీ ఫిఫ్టీ బిజినెస్..
అవును నిజమే. ప్రస్తుతానికి మేం పాజిటివ్ గానే ఉన్నాం. సినిమా నిర్మాణం అనేది రిస్కే.. కాదనడంలేదు.


తండ్రయ్యారు.. మీ ఫీలింగ్ ని షేర్ చేసుకుంటారా.. పోలికలు మీవా? మీ భార్యవా?
ఇప్పుడే పోలికలు తెలియవని పెద్దవాళ్లు చెప్పారు. ఇంకొంత టైమ్ పడుతుంది. పాప పుట్టిన తర్వాత మా పేరంట్స్ మీద వేల్యూ పెరిగిపోయింది. అమ్మా నాన్న ఎంత బాగా పెంచితే మనం ఈ స్థాయిలో ఉన్నాం అనిపిస్తోంది. ఫాదర్ హుడ్ అనేది ఓ మ్యాజిక్. ఓ నాలుగైదు గంటలు పాపను చూడకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఐయామ్ ఎంజాయింగ్ ఫాదర్ హుడ్.


పాపకి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు?
ఇంకా డిస్కస్ చేస్తున్నాం. మా ఇద్దరికీ నచ్చినది మా పెద్దవాళ్లకు నచ్చడంలేదు. వాళ్లకు నచ్చినవి మాకు నచ్చడంలేదు. ఫైనల్ గా ఏమనుకున్నామంటే.. మా ఇద్దరికీ నచ్చిన పేరు పెట్టాలనుకున్నాం. మా అక్కకు కూడా పాపే. పేరు ఆద్య. ఇప్పుడు మా ఇంట్లో చాలామంది మహాలక్ష్ములు ఉన్నారు.


'చుట్టాలబ్బాయ్' సంగతేంటి?
వీరభద్రమ్ గారు చాలా బాగా తీస్తున్నారు. నలభై శాతం సినిమా పూర్తయ్యింది. నిర్మాతల ప్లానింగ్ బాగుంది.


కొత్త సంవత్సరం నిర్ణయాలేమైనా ఉన్నాయా?
నిర్ణయాలు కాదు కానీ, ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాకు రావాల్సినంత బెటర్ సినిమాలు ఇంకా రావడంలేదనే ఫీలింగ్ ఉంది. అందుకే అన్నీ కమిట్ కావడంలేదు. గుడ్ ఫిలిమ్స్ చేయాలనుకుంటున్నా. ఓ మంచి కమర్షియల్ హిట్ మూవీ పడాలనుకుంటున్నా. అప్పుడే ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో ఓ క్లారిటీ ఉంటుంది.


కథల ఎంపిక పరంగా ఏమైనా కష్టమవుతోందా?
ఏడాదికి దాదాపు మూడొందల సినిమాలు విడుదలైతే, అందులో ఎనిమిది, తొమ్మిది సినిమాలు మంచి విజయం సొంతం చేసుకుంటున్నాయి. సో.. కథలు ఎంపిక చేయడం కొంచెం కష్టంగానే ఉంటోంది. ఒక్కోసారి పాయింట్ విన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. తీసిన తర్వాత బాగుండదు. చెప్పినప్పుడు మామూలుగా ఉన్న పాయింట్ తీసిన తర్వాత బాగుంటుంది. సో.. కథలు సెలక్ట్ చేయడం కష్టమే.


ఫైనల్లీ.. బర్త్ డే ప్లాన్స్ ఏంటి?
'గరమ్' ఆడియో ఆవిష్కరణ వేడుక జరగనుంది. నా భార్య రాజమండ్రిలో ఉంది. సో.. ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాను. వేరే ప్రత్యేకంగా ఏమీ ప్లాన్ చేయడంలేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !