మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడే అశోక్ గల్లా. ప్రముఖ పారిశ్రామిక వేత్త కూడా అయిన జయదేవ్ ఇంటి నుంచి అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా `హీరో`. అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో అశోక్ గల్లాకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా థియేటర్ లోనూ ఓటీటీలోనూ విడుదలై నటుడిగా తనకెంతో సంతృప్తినిచ్చిందని అశోక్ గల్లా తెలియిజేస్తున్నారు. ఓటీటీలో వస్తున్న అభినందనలు కొత్త ఉత్సాహానిచ్చాయని తెలియజేస్తూ, తాను చేయబోయే కొత్త సినిమా జూన్ లో వెల్లడిస్తానని పేర్కొన్నారు. రేపు ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా సోమవారంనాడు అశోక్ గల్లా తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. ఏదైనా కొత్త సినిమా కోసమా?
-హీరో సక్సెస్ తర్వాత తిరుపతి వెళ్ళాను. అందుకే ఈ గెటప్ కనిపిస్తుంది.
హీరో సినిమా సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
-హీరో సక్సెస్ ను వృత్తిపరంగా సంతృప్తి చెందాను. సినిమాలో హీరోగా నిలబడాలని అనుకున్నప్పుడు వచ్చిన సక్సెస్ ఇది. ఇప్పుడు తర్వాత ఏమి చేయాలనేది ఆలోచిస్తున్నాను.
హీరో కథను దర్శకుడు శ్రీరామ్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
-నేను మంచి కథతో రావాలనుకున్నాను. ఆ సమయంలో అనుకోకుండా శ్రీరామ్ వచ్చి భోజనం టైంలో కథ చెప్పారు. అది విన్నవెంటనే ఇదే కదా మనం చేయాల్సింది అనిపించింది. వెంటనే ఓకే చెప్పేశాను. ఆ తర్వాత ఆయన ఆఫీస్‌కూడా తీయడం పనులు జరగడం చకచకా జరిగిపోయాయి.
మళ్ళీ ఆయనతో సినిమా చేసే అవకాశం వుందా?
-ప్రస్తుతం వేరే సినిమా చేయాలనుకుంటున్నాను. అవకాశం వుంటే తప్పకుండా చేస్తాను.
హీరో సినిమా చూశాక ఇంకా ఏమైనా కొత్తగా చేస్తే బాగుంటుందనిపించిందా?
-ఇది న్యూ ఏజ్ స్టోరీ. ఈ కథను కామెడీగా చూపించాం. సీరియస్‌గానూ కామెడీ లేకుండా చేయవచ్చు. ప్రోగ్రెసివ్ స్టోరీ కనుక తెలుగు ఫార్మాట్ లో చేయడం వల్ల కొత్త కిక్ ఇచ్చేలా చేశాం.
తదుపరి మీ బేనర్ లోనే సినిమా వుంటుందా?
-బయట బేనర్ లో వుండబోతోంది. త్వరలో వివరాలు తెలియజేస్తాను.