View

ఇంటర్య్వూ - హీరో నాగార్జున (సోగ్గాడే చిన్నినాయనా)

Wednesday,January13th,2016, 04:09 PM

కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ రోజు (13.1.2016) మీడియాతో ముచ్చటించారు నాగార్జున. ఆ విశేషాలు మీ కోసం...


'మనం' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం చేసారు. ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం?
'మనం' చాలా స్పెషల్ మూవీ. ఆ చిత్రాన్ని ఓ క్లాసిక్ హిట్ గా నిలబెట్టాలనే టార్గెట్ తో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఎక్కువ సమయం ఆ సినిమా కోసం కేటాయించాను. సినిమా విడుదలై ఘనవిజయం సాధించడంతో రెండు, మూడు నెలలు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' చిత్రాల షూటింగ్ తో బిజీ అయిపోయాను. నా నుంచి సినిమా రావడం లేట్ అయ్యింది. అయితే 'మీలో కోటీశ్వరుడు' షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాను. ఇప్పుడు 'సోగ్గాడే చిన్ని నాయనా' తో వస్తున్నాను. అతి త్వరలోనే 'ఊపిరి' కూడా విడుదలకానుంది.


సంక్రాంతికి 4 చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇలా పోటీ పడటం ఎలా అనిపిస్తోంది?
సంక్రాంతి పండుగకు రెండు, మూడు సినిమాలు విడుదలవ్వడం కామన్. తెలుగులోనే కాదు... అన్ని భాషల్లోనూ మూడు, నాలుగు సినిమాలు ఈ సీజన్ లో విడుదలవుతుంటాయి. సంక్రాంతికి మూడు రోజులు సెలవులు ఉంటాయి. పైగా శని, ఆదివారాలు కూడా కలిసొయ్యాయి. ఆల్ మోస్ట్ ఈ రోజు నుంచే ఫెస్టివ్ మూడ్ లో ఉన్నారు. ఇప్పుడు చాలా ఈజీగా సినిమాలు ఆడేస్తాయి. కుటుంబం మొత్తం కలుసుకున్నప్పుడు అందరూ కలిసి సినిమా చూడటం కామన్ ఎంటర్ టైన్ మెంట్. సో... ఈ పండుగకు విడుదలవుతున్న అన్ని సినిమాలు బాగా ఆడతాయని నా అభిప్రాయం.


సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఎలా ఉండబోతోంది?
ఒక్క ముక్కలో చెప్పాలంటే పండుగ వాతావరణంలో వస్తున్న పర్ ఫెక్ట్ చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. చాలా సరదాగా ఈ సినిమా ఉంటుంది. అచ్చు తెలుగు సినిమాలా ఉంటుంది. అందుకే సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యాను.


సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్ కూడా ఉంది కదా?
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. విలేజ్ లో బంగార్రాజు చేసే ఫన్ చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాకి సోఫియో ఫాంటసీ ఎలిమెంట్ ని కనెక్ట్ చేయడం ఆసక్తిగా ఉంటుంది.


హలో బ్రదర్ చిత్రంలో డ్యుయెల్ రోల్ చేసారు... ఈ సినిమాలో కూడా డ్యుయెల్ రోల్ చేసారు. రెండు పాత్రలు ఎలా ఉంటాయి?
హలో బ్రదర్ చిత్రంలోని రెండు పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ తరహా పాత్రలను ప్రేక్షకులను ఇష్టపడుతున్నారు. ఈ సినిమాలో బంగార్రాజు పాత్ర సోగ్గాడి తరహాలో ఉంటుంది. ఫుల్ ఫన్ గా ఉంటుంది. మరో పాత్ర అమాయకత్వంతో కూడుకుని ఉంటుంది. రెండూ పాత్రలు చాలా బాగుంటాయి. ప్రేక్షకులను అలరిస్తాయి.


రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి గురించి చెప్పండి?
రమ్యకృష్ణ, నాకు మధ్య వచ్చే పన్నివేశాలు హలో బ్రదర్ సినిమాని గుర్తుకు తెచ్చే విధంగా ఉంటాయి. లావణ్య ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. తను కూడా చాలా బాగా నటించింది. రమ్య, లావణ్య ఇద్దరూ ఎవరి పాత్రలకు వారు సూట్ అయ్యారు.


డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గురించి చెప్పండి?
కళ్యాణ్ కృష్ణ మంచి రైటర్. ఎమోషన్ డ్రామాని చక్కగా తీర్చిదిద్దగల కెపాసిటీ ఉంది. కొత్త దర్శకుడు ఈ సినిమాని తీసాడా అని అందరూ ఆశ్యర్యపోయేంత మెచ్చుర్టీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు కళ్యాణ్ కృష్ణ.


ఎన్ని థియేటర్స్ లో ఈ సినిమా విడుదలవుతోంది?
500 థియేటర్స్ లో విడుదల చేద్దామనుకున్నాము. అనుకున్నట్టుగానే 500 థియేటర్స్ దొరికాయి. రెండో వారం నుంచి థియేటర్స్ సంఖ్య పెరుగుతుంది.


చైతన్య, అఖిల్ తో కలిసి పంచె కట్టుకుని ఈ సినిమాని ప్రమోట్ చేసారు... ఎలా అనిపించింది?
చైతూ, అఖిల్ ఇద్దరికీ బంగార్రాజు పాత్ర నచ్చింది. ఇద్దరూ పంచె కట్టుకున్నారు. వారిని అలా చూసిన తర్వాత ముగ్గురం కలిసి ఓ ఇంటర్య్వూ ఇస్తే బాగుంటుందనిపించింది. పైగా మా ముగ్గురిని అలా చూసి మా అభిమానులు మాత్రమ కాకుండా ప్రేక్షకులు చాలా బాగా స్పందించారు. ముగ్గురూ బాగున్నారని ప్రశంసించారు. చాలా సరదాగా అనిపించింది.


అఖిల్ ఫస్ట్ సినిమా పరాజయం పాలవ్వడంతో ఎలా ఫీలయ్యారు?
బాధపడ్డాను. నిజం చెప్పాలంటే ఓ వారం పాటు మాములు మనిషిని కాలేకపోయాను. ఎందుకంటే నితిన్, అఖిల్ చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందనే విషయం గురించి ఆలోచించాము. ప్రేక్షకులకు సినిమాని కనెక్ట్ అయ్యే విధంగా చెప్పడంలో విఫలమయ్యామని అర్ధమయ్యింది. తొలి సినిమాకే అఖిల్ చాలా నేర్చుకున్నాడు. నా మటుకు 'గీతాంజలి' చిత్రం వరకూ కెరియర్ ఎలా వెళుతుందో, ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలో అర్ధమయ్యేది కాదు. అయిత అఖిల్ తొలి సినిమాకే చాలా అర్ధం చేసుకున్నాడు. ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులకు నచ్చుతాయనే విషయంపై ఓ అవగాహనకు వచ్చాడు. ఇకముందు తన నుంచి వచ్చే చిత్రాలు ప్రేక్షకాదరణ పొందేవిగానే ఉంటాయి.


ఫైనల్ గా మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పిండి?
'ఊపిరి' చిత్రం షూటింగ్ ఈ నెలాఖరుతో పూర్తయిపోతుంది. ఓ డిఫరెంట్ సినిమా. మంచి పాత్ర. వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్ర. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదలవుతుంది. ప్రస్తుతం కొన్ని కథలు కూడా వింటున్నాను. ఇంకా దీ ఫైనలైజ్ అవ్వలేదుగానీ, మంచి కథ కుదిరితే వెంటవెంటనే సినిమాలు చేస్తాను అంటూ ఇంటర్య్వూ కి ముగింపు పలికారు నాగ్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !