View

ఇంటర్య్వూ - హీరో నాని (కృష్ణగాడి వీర ప్రేమగాధ)

Tuesday,February09th,2016, 03:09 PM

నాని, మెహరీన్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'. ఈ నెల 12 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో నానితో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన ఇంటర్య్వూ...


కృష్ణగాడి వీర ప్రేమగాధ.. టైటిల్ వెరైటీగా ఉంది.. ముందు టైటిల్ గురించి చెప్పండి?
ఈ సినిమా విషయంలో చాలా కష్టపడింది టైటిల్ ఫిక్స్ చేయడానికే. చాలా టైటిల్స్ ని పరిశీలించాం. కానీ నచ్చలేదు. సినిమా స్టోరీ లైన్ దేని గురించో.. దానికి కనెక్ట్ అయ్యేట్టు టైటిల్ పెట్టాలని ఆలోచించిన తర్వాత తట్టిన టైటిల్ 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'. జానపదం సినిమాలకు ఇంత పెద్ద టైటిల్స్.. ఇలాంటి ఫీల్ ఉన్న టైటిల్స్ పెడతారు కదా.. మేము కూడా రియల్ లొకేషన్స్, అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాం, రాయలసీమలోని లొకేషన్స్ ని చూపించడం జరిగింది. అందుకే ఈ టైటిల్ ని ఫిక్స్ చేసాం, టైటిల్ డిజైన్ చూస్తే పాత సినిమాల పేర్లను, డిజైన్ ని పోలి ఉండటం మీరందరూ గమనించే ఉంటారు. టైటిల్ కూడా అందరికీ నచ్చింది. రేపు సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఈ టైటిల్ ఎందుకు పెట్టామో అర్ధం చేసుకుంటారు.


ఈ సినిమా స్టోరీ లైన్ ఎలా ఉంటుంది?
కృష్ణ పిరికివాడు. మహాలక్ష్మీ అంటే కృష్ణగాడికి ప్రాణం. కానీ పిరికితనంతో ఈ విషయాన్ని బయటికి చెప్పలేడు. 15యేళ్లుగా మహాలక్ష్మీని ప్రేమిస్తాడు. కానీ తన బెస్ట్ ఫ్రెండ్స్ కిగానీ, మహాలక్ష్మీకిగానీ ఈ విషయాన్ని చెప్పడు. అలా పిరికిగా ఉండే కృష్ణ ధైర్యవంతుడుగా మారి తన ప్రేమను ఎలా గెల్చుకున్నాడు అనేదే ఈ చిత్రం స్టోరీ. కథలో ట్విస్ట్ లు చాలానే ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు.


ఈ సినిమాలో మీరు నందమూరి బాలకృష్ణగారి అభిమానిగా నటించారట కదా?
అవును. సినిమాలో నేను బాలకృష్ణగారి అభిమానిని. హిందూపూర్ ప్రజలందరూ బాలయ్యగారికి అభిమానులే. హీరో ఇంట్రడక్షన్ సీన్ లోనే ఈ విషయంలో క్లారటీ ఇస్తాం. బాలయ్య పేరు వాడుకుని హీరో ఓ సమస్య నుంచి బయటపడతాడు.


మీరు బాలయ్య అభిమానిగా నటిస్తున్నారనే విషయం ఆయనకు తెలుసా?
తెలుసు. చాలా హ్యాపీ ఫీలయ్యారు. నా అభిమానిగా నటిస్తున్నావట కదా అని అడిగారు. హిందూపూర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చెప్పు.. ఆ టైంలో నేను అక్కడ ఉంటే వస్తానని చెప్పారు.ఈ సినిమాలో మీరు బాలకృష్ణగారి అభిమాని.. పర్సనల్ గా మీ ఫేవరేట్ హీరో ఎవరు?
పర్సనల్ గా నాకు కమల్ హాసన్ గారంటే చాలా ఇష్టం. ఇక సినిమాల విషయంలోకి వస్తే అందరు నటించిన సినిమాలు చూస్తుంటాను. ఎవరు బాగా నటించినా, వారిని ఇన్సిఫిరేషన్ గా తీసుకుంటాను.


ఈ సినిమాని బాలకృష్ణగారికి ఎప్పుడు చూపించబోతున్నారు?
ఫస్ట్ డే బాలయ్యగారు సినిమాని చూడబోతున్నారు.


బాలయ్య అభిమానులు ఈ సినిమా చూసి ఎలా ఫీలవుతారనుకుంటున్నారు?
ఖచ్చితంగా బాలయ్య అభిమానులకు ఈ సినిమా నచ్చతుంది. నేను బాలయ్య అభిమానులా ఎలా ఉండాలో, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో మా డైరెక్టర్ ఫర్ ఫెక్ట్ గా చెప్పారు. నేను కూడా అలానే ఫాలో అయ్యాను. కాబట్టి బాలయ్య అభిమానులందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.


డైరెక్టర్ హను గురించి చెప్పండి?
నిజం చెప్పాలంటే హను దర్శకత్వంలో నేను ఎప్పుడో సినిమా చేయాల్సి ఉంది. 'అందాల రాక్షసి' కథను హను ముందుగా నాకే చెప్పాడు. నాకు కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత కూడా రెండు, మూడు కథలు చెప్పారు. కానీ నేను ఇంప్రెస్ అవ్వలేకపోయాను. దాంతో నాకు ఎలాంటి కథలు కావాలో చెప్పమని అడిగాడు. అలా చెప్పిన తర్వాత తయారు చేసిన కథ 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'. ఈ కథ నాకు నచ్చడంతో సినిమా సెట్స్ పైకి వెళ్లింది.


భలే భలే మగాడివోయ్ తర్వాత పారితోషికం పెంచారనే వార్తలు వినిపించాయి?
నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ తీసుకున్నపారితోషికం 2500 రూపాయలు. తర్వాత 3500 తీసుకున్నాను. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే పారితోషికం పెంచి తీసుకున్నాను. ఇప్పుడు పారితోషికం పెంచకుండా ఎలా ఉంటాను. అయినా నేను పారితోషికం పెంచినంత మాత్రానా నిర్మాతలు ఇచ్చేయరు. నా మార్కెట్ ని బట్టే పారితోషికం ఇస్తారు.


మణిరత్నంగారి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారనే టాక్ ఉంది?
నిజమే. మణిరత్నంగారి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నమాట వాస్తవమే. కానీ ఆ కథ హిందీ సినిమాకి దగ్గరగా ఉందని కథను పక్కన పెట్టేసారు. ప్రస్తుతం వేరే స్ర్కిఫ్ట్ పైన వర్కవుట్ చేస్తున్నారు. మరి ఆ సినిమాలో చేసే అవకాశం నాకు వస్తుందో లేదో చూడాలి.


మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ లవ్ ఎంటర్ టైన్ లో నటిస్తున్నాను. విరించి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఇకపై ప్రతి 5 నెలలకు నా నుంచి ఓ సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పి ఇంటర్య్వూకి ముగింపు పలికారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !