View

కథకీ, గెటప్స్ కీ 'గడ్డం గ్యాంగ్' టైటిల్ యాఫ్ట్ - హీరో రాజశేఖర్

Sunday,January25th,2015, 07:22 AM

''సక్సెస్ లేక రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు అనిపించుకోవడం ఇష్టం లేదు'' అన్నారు హీరో రాజశేఖర్. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం 'గడ్డం గ్యాంగ్' తమిళ చిత్రం 'సూదుకవ్వమ్' కి రీమేక్. శివాని-శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితారాజశేఖర్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. పి.సంతోష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన షీనా హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టినరోజు. ఫిబ్రవరి 6న 'గడ్డం గ్యాంగ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ఈ సినిమా గురించి, తన తదుపరి సినిమాలు గురించి మాట్లాడారు రాజశేఖర్. ఆ విశేషాలు ఈ విధంగా...

'గడ్డం గ్యాంగ్' గురించి చెప్పండి?
గడ్డం గ్యాంగ్ గురించి చెప్పాలంటే అదో ఓ చెత్త గ్యాంగ్. కొత్త పద్ధతిలో కిడ్నాప్ చేస్తుంటారు. ఐదుగురితో కూడుకున్న ఈ గ్యాంగ్ లో నేను 'గడ్డం దాస్' గా చేసాను. అందరం గడ్డంతో ఉంటాము. కథకు, మా గెటప్స్ కీ 'గడ్డం గ్యాంగ్' టైటిల్ యాఫ్ట్ గా ఉంటుందని భావించి ఈ టైటిల్ పెట్టడం జరిగింది.

ఇది తమిళ చిత్రం 'సూదుకవ్వమ్'కి రీమేక్ కదా... ఈ రీమేక్ చేయడానికి కారణం ఏంటీ?
తమిళ చిత్రం 'సూదుకవ్వమ్' చూడగానే నాకు చాలా నచ్చింది. ఈ ట్రెండ్ కి తగ్గ సినిమా అనిపించింది. అందుకే కోటి రూపాయలు పెట్టి మరీ ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని తీసుకోవడం జరిగింది. గత 5యేళ్ల నుంచి సరైన సక్సెస్ రాలేదు. రొటీన్ చిత్రాలు చేయడం, కథల ఎంపికలో పొరపాట్లు వల్లే సక్సెస్ అందుకోలేకపోయాననే ఫీలింగ్ ఉంది. అందుకే రొటీన్ కి భిన్నంగా, కొత్తగా అనిపించిన 'సూదుకవ్వమ్' సినిమా రీమేక్ లో నటించాలనుకున్నాను. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. తప్పకుండా నాకు దూరమైన సక్సెస్ ఈ సినిమాతో దగ్గరవుతుందనే నమ్మకం ఉంది.

తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసారా?
లేదు. ఎలాంటి మార్పులు చేయలేదు. ఏవైనా మార్పులు చేస్తే, కథను చెడగొట్టినట్టు అవుతుంది. ఒరిజినల్ వెర్షన్ చాలా బాగుంటుంది. అన్ని భాషల వారిని మెప్పించే విధంగా ఈ సబ్జెక్ట్ ఉంటుంది. అందుకే ఎలాంటి మార్పులు చేయలేదు. డైలాగ్స్ విషయంలో మాత్రం కొన్ని పంచ్ లు ఉండేలాగా చూసుకున్నాం.

డైరెక్టర్ సంతోష్ ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేసారు?
శేషు, ఎవడైతే నాకేంటి సినిమాల ద్వారా జీవిత మంచి దర్శకురాలిగా నిరూపించుకుంది. ఆమెతోనే ఈ సినిమా చేయించాలనుకున్నాను. కానీ సినిమా నిర్మాణం చూసుకుంటూ డైరెక్షన్ చేయడం నావల్ల కాదని జీవిత చెప్పింది. అందుకే సంతోష్ తో ఈ సినిమా చేయించాము. తను ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేసాడు. ఒరిజినల్ వెర్షన్ కంటే టేకింగ్ పరంగా చాలా బాగుంటుంది. నటీనటుల దగ్గర్నుంచి తనకు కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ ని రాబట్టడంలో సంతోష్ వంద శాతం సఫలీకృతులయ్యారు.

ముందుగా ఈ సినిమాకి అంజనా లవేనియాని కథానాయికగా తీసుకున్నారు కదా? మరి తర్వాత షీనాని తీసుకోవడానికి కారణం?
ఈ సినిమా కథ పరంగా హీరోయిన్ నా ఒళ్లో ఎక్కువ పేరు కూర్చోవాలి. అంజనా చాలా హైట్ గా ఉంటుంది. తను నా ఒళ్లో కూర్చుంటే అంత కంఫర్ట్ గా ఉండదు. పైగా షాట్స్ కూడా బాగుండవు. అందుకే షీనాని తీసుకోవడం జరిగింది. షీనా అద్భుతంగా నటంచింది. తన పాత్ర చాలా బాగుంటుంది.

ఈ సినిమాని సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నట్టు ఉన్నారు?
లేదండి. సినిమా మొత్తానికి చెప్పలేదు. ట్రైలర్ లో మాత్రం నా వాయిస్ వినబడుతుంది. ట్రైలర్ కట్ చేసినప్పుడు సాయికుమార్ గారు వేరే పనులతో బిజీగా ఉన్నారు. అందుకే నేను వాయిస్ ఇచ్చాను. కానీ సినిమాలోని నా పాత్రకు సాయికుమార్ గారే డబ్బింగ్ చెప్పారు.

ఇంకా ఈ సినిమాలోని ఇతర సాంకేతిక నిపుణుల గురించి చెప్పండి?
అచ్చు ఈ చిత్రానికి పాటలు సమకూర్చాడు. పాటలు అద్భుతంగా వచ్చాయి. ఇక ఈ సినిమాకి రీరికార్డింగ్ కూడా హైలెట్ అవుతుంది. రీరికార్డింగ్ సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేసే విధంగా చేసాడు అచ్చు. ఫోటోగ్రఫీ, నా క్యారెక్టర్, కథ, స్ర్కీన్ ప్లే... అన్నీ బాగా కుదిరాయి. కాబట్టి ఈ సినిమా విజయం సాధిస్తుందని అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను.

మంచి క్యారెక్టర్స్, విలన్ పాత్రలకు ఆఫర్స్ వస్తే చేయడానికి సిద్ధమేనా?
ఈ వయసులో హీరోగానే చేస్తాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది. మంచి క్యారెక్టర్స్, మల్టీ స్టారర్, విలన్ పాత్రలు చేయడానికి నేను రెడీ. కాకపోతే కొంతకాలంగా నేను సక్సెస్ లో లేను. ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తే... సినిమాలు లేక రాజేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారని అంటారు. అందుకే ఓ సినిమా సక్సెస్ తర్వాత చేయాలనుకున్నాను. కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి. 'గడ్డం గ్యాంగ్' విడుదల తర్వాత ఆ అవకాశాలను పరిశీలిస్తాను.

ఈ ఆఫర్లలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కూడా ఉందా?
లేదండి. ఇంకా చిరంజీవిగారి 150వ సినిమాకి కథ సెట్ అవ్వలేదనే వార్తలే నేను వింటున్నాను. ఒకవేళ ఆ సినిమాలో నాకు మంచి పాత్ర ఉండి, చిరంజీవిగారు నన్ను ఆ పాత్ర చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తాను. ఒక్క చిరంజీవిగారనే కాదు... వేరే సినిమాల్లో నాకు తగ్గ పాత్రలు ఉండి, నేను చేస్తే బాగుంటుందని డైరెక్టర్స్ భావిస్తే ఆ ఆవకాశాలను వదులుకోను.

'గడ్డం గ్యాంగ్' కాకుండా మీరు చేస్తున్న సినిమాల గురించి చెప్పండి?
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'పట్టపగలు' చిత్రం చేసాను. అది షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో ఈ చిత్రం విడుదలకానుంది. మా అమ్మాయితో కలిసి 'వందకు వంద', 'అర్జున' సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాల షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. 'గడ్డం గ్యాంగ్' విడుదల తర్వాత వరుసగా ఈ సినిమాలు కూడా విడుదలవుతాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !