View

ఆ విషయంలో నేను హ్యాపీ - హీరో శివాజీ

Monday,July07th,2014, 02:26 PM

హీరో శివాజీ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయాల పరంగా కూడా బిజీగా ఉంటున్నారు. కానీ దేని ప్రాధాన్యత దానికే అంటున్నారు శివాజీ. తను నటించిన 'బూచమ్మ బూచోడు' చిత్రం ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు, తను రాజకీయ భవిష్యత్తు గురించి మీడియాతో ఈ విధంగా ముచ్చటించారు.

బూచమ్మ బూచోడు టైటిల్ చాలా బాగుంది? ఇంతకీ ఎవరు బూచమ్మ... ఎవరు బూచోడు?

నిజమే. ఈ టైటిల్ చాలా క్యాచీగా ఉందని ప్రతి ఒక్కరూ అంటున్నారు. బూచమ్మ కైనాజ్ మోతీవాలా అయితే... బూచోడు నేను. ఇది ఇద్దరు సాఫ్ట్ వేర్ భార్యభర్తల మధ్య సాగే కథ. చాలా బాగుంటుంది.

ఇది హారర్ మూవీ కదా?

అవును. ఈ మధ్య చాలా హారర్ మూవీస్ వస్తున్నాయి. కానీ ఈ సినిమా అన్నింటికంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంటుంది. హారర్ సినిమా అయినప్పటికీ, ఈ చిత్రంలో కామెడీ కూడా ఉంటుంది.

ఈ సినిమా ఆరంభమై చాలా రోజులయ్యింది కదా?

నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది. ఈ సినిమా కథ విన్నప్పుడే చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది.

ఈ చిత్రం డైరెక్టర్ గురించి చెప్పండి?

రేవన్ యాదు చిత్ర పరిశ్రమకు కొత్త కాదు. ఈ చిత్రం ద్వారా డైరెకర్ట్ గా పరిచయం అవుతున్నారు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో రేవన్ కి చాలా పట్టుంది. ఈ చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేసాడు. ఆర్టిస్ట్ ల దగ్గర నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకున్నాడు. స్ర్కిఫ్ట్ మొత్తం పూర్తయిన తర్వాతే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. దాంతో ముందే తనకేం కావాలో చక్కగా ప్లాన్ చేసుకుని ఈ చిత్రం పూర్తి చేసారు ఆయన. ఈ సినిమా అతనికి మంచి పేరు తెచ్చిపెడుతుంది.

ఈ సినిమా సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర గురించి చెప్పండి?

నిజానికి ఈ సినిమాకి పాటలకంటే రీ-రికార్డింగ్ ఇంపార్టెంట్. హారర్ మూవీ కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే సీన్స్ హైలెట్ అవుతాయి. ఆ పరంగా శేఖర్ చంద్ర వంద శాతం ఈ చిత్రానికి న్యాయం చేసారు. రీ-రికార్డింగ్ అద్భుతంగా చేసారు. ఈ చిత్రంలో రెండు పాటలు ఓ బిట్ సాంగ్ ఉన్నాయి. ఈ పాటలు సందర్భానుసారంగా ఉంటాయి.

ఈ సినిమా కెమెరా మ్యాన్ గురించి చెప్పండి?

ఈ సినిమా కెమెరా మ్యాన్ విజయ్ మిశ్రా 'స్లమ్ డాగ్ మిలినీయర్' సినిమా చేసారు. ఆయన అద్భుతమైన టెక్నీషియన్. విజువల్ గా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ చాలా టాలెంట్ కలవారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేసారు. ఈ సినిమాకి అద్భుతమైన సాంకేతిక నిపుణులు కుదిరారు.

ఈ చిత్రం నిర్మాతల గురించి చెప్పండి?

మన ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు అయ్యాయి. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారే మా నిర్మాతలు. నిర్మాతల్లో ఒకరైన రమేష్ గారికి వైజాగ్. మరో నిర్మాత ప్రసాద్ రెడ్డి గారిది హైదరాబాద్. ఇద్దరూ సినిమా మీద ఇష్టం ఉన్న నిర్మాతలు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది? మరి మీకు ఇలాంటి చిత్రాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా?

తప్పకుండా చేస్తాను. నేను సాధారణ నటుడిని. చిన్న పాత్ర అయినా చేస్తాను.

నిర్మాతగా  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à± నిర్మించారు కదా? మళ్లీ సొంత బ్యానర్ లో సినిమా నిర్మించాలనే ఆలోచన ఉందా?

ఇప్పుడయితే లేదు. భవిష్యత్తు గురించి ఇప్పుడే చెప్పలేను. అయినా నటుడిగా నేను హ్యాపీగా ఉన్నాను. కాబట్టి ఇప్పట్లో సినిమాలు నిర్మించాలనే ఆలోచన లేదు.

పబ్లిసిటీ గురించి మీ అభిప్రాయం?

ఖచ్చితంగా సినిమాలకు పబ్లిసిటీ చాలా అవసరం. సినిమాకు పెట్టే బడ్జెట్ లో 30శాతం బడ్జెట్ పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టాలి. అప్పుడే సినిమా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. ఈ విషయంలో కాంప్రమైజ్ అయితే... సినిమా విడుదలైన విషయం కూడా ఎవరికీ తెలియకుండా పోతుంది. అందుకే ఈ సినిమాకి పబ్లిసిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వలేదు.

ఇండస్ట్రీ నలుగురు వ్యక్తుల చేతిలో ఉందని చెప్పారు కదా? దాని గురించి చెప్పండి?

నిజానికి నేను మాట్లాడింది వేరు. కానీ మీడియా ఆ వార్తలను ప్రజెంట్ చేసిన విధానం వేరుగా ఉంది. ఇండ్రస్టీ నలుగురు చేతిలో ఉందని నేను అనలేదు... పరిమిత సంఖ్యలో దర్శక, నిర్మాతలు రావడం, వారు గ్రూపులుగా ఏర్పడటంతో కొత్తవారికి అవకాశాలు రావడంలేదని అన్నాను. ఇందులో నిజం ఉంది. ఎందుకంటే ఆ గ్రూపుకు సంబంధించిన వారికి మాత్రమే ఇక్కడ పని దొరుకుతోంది. మిగతా వారు ఖాళీగా ఉంటున్నారు. ఇది మంచిది కాదని అన్నాను. చాలామంది చిత్ర పరిశ్రమకు రావడం వల్ల ఎక్కువ శాతం మందికి జాబ్ దొరుకుతుంది.

రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు కదా? మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

నాకు సినిమాలు, రాజకీయాలు రెండూ ముఖ్యమే. దేని ప్రయార్టీ దానికే ఉంటుంది. ఏదో ఆశించి రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటాను. కానీ సినిమాని వదలను. నాకు నటించడమంటే ఇష్టం.

 

Hero Sivaji Interview



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !