View

ఇంటర్య్వూ - హీరో ఉపేంద్ర (ఉపేంద్ర 2)

Wednesday,August12th,2015, 09:04 AM

వైవిధ్యానికి చిరునామా ఉపేంద్ర అంటే అతిశయోక్తి కాదు. ఏ సినిమా చేసినా అందులో ఏదో కొత్తదనం ఉంటుంది. ఆయన సినిమాలు విచిత్రంగా ఉంటాయి. ప్రేక్షకులకు అదే నచ్చింది. అందుకే, తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకోగలిగారు ఈ శాండిల్ వుడ్ సూపర్ స్టార్. పదేళ్ల క్రితం ఆయన నటించిన 'ఉపేంద్ర'కు సీక్వెల్ గా ఉపేంద్ర ఇప్పుడు 'ఉపేంద్ర 2' చేశారు. ఇందులో హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. పధ్నాలుగేళ్ల క్రితం ఉపేంద్ర హీరోగా 'రా' నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) 'ఉపేంద్ర 2'ను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక, ఉపేంద్రతో 'ఫిల్మీబజ్.కామ్' జరిపిన ఇంటర్వ్యూలోని విశేషాలు తెలుసుకుందాం...


కొంత విరామం తర్వాత హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. మీ అభిమానులు హ్యాపీ?
నాక్కూడా హ్యాపీయేనండి. యాక్చువల్ గా నాకు తెలుగు సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ, నేనేదీ ప్లాన్ చేయను. ఎలా జరిగితే అలా చేసుకుంటూ వెళ్లిపోతాను.


'ఉపేంద్ర 2' స్పెషల్ ఏంటి?
'ఉపేంద్ర' సినిమా 'నేను' అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. 'ఉపేంద్ర 2' 'నువ్వు' అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. తొలి భాగం మొత్తం నాకేది అనిపిస్తే అది చేస్తా. మలి భాగంలో నువ్వు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చేస్తా.


మొదటి భాగం చేసేటప్పుడే ఈ సీక్వెల్ గురించి అనుకున్నారా?
లేదు. 'నేను' అనే ఫీలింగ్ వదిలేసిన తర్వాత వాడేమవుతాడు? అని 'ఉపేంద్ర'లో నేను చేసిన క్యారెక్టర్ గురించి ఓ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అలా వెంటాడుతూ వచ్చింది. అందులోంచి వచ్చినదే ఈ సీక్వెల్.


వాస్తవ జీవితానికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందా?
అవును. ఇది అందరి సినిమా, 'నువ్వు' అంటే ప్రతి ఒక్కరూ. అందరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అనేది చూపించాం.


ఫస్ట్ పార్ట్ చూడకపోతే సెకండ్ పార్ట్ అర్థం కాదా?
అలా ఏం లేదు. ఆ సినిమా గురించి కనీస అవగాహన లేకపోయినా ఫర్వాలేదు. ఈ చిత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమా దారి ఈ సినిమాది.


'నువ్వు' అంటే ఏంటి?
అంతర్గత స్వేచ్ఛకు సంబంధించిన సినిమా ఇది. ఆ స్వేచ్ఛ గురించి చాలా డీప్ గా డిస్కస్ చేశాం. అది ఆసక్తికరంగా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అవుతంది.


సామాజికపరమైన అంశాలు ఉంటాయా?
లేదు. ఇది ప్యూర్లీ పర్సనల్ గా ఉంటుంది. అంతర్లీనంగా ఓ సందేశం ఉంటుంది.


మీ సినిమాలు అదో రకంగా ఉంటాయి కాబట్టి, మహిళా ప్రేక్షకులు చూడటానికి వెనకాడతారు?
కానీ, చూస్తే ఇష్టపడతారు. ఈ చిత్రం మహిళా ప్రేక్షకులు కూడా చూసే విధంగా ఉంటుంది. వాళ్లకూ నచ్చుతుంది.


ఈ చిత్రానికి ఇన్ స్పిరేషన్ ఏమైనా ఉందా?
లేదు. వేరే సినిమాలు చూసి ఇన్ స్పయిర్ అయ్యి ఈ సినిమా తీయలేదు. థాట్ ప్రాసెస్ లోంచి వచ్చిన పాయింట్ తో తీశాను. అందుకే ఈ సినిమా ఓ కొత్త ప్యాట్రన్ లో ఉంటుంది.


కథ కొత్తగా ఉంటుందా?
నాకు తెలిసి కొత్త కథలు అనేవి ఉండవు. అన్ని కథలు ఆల్ మోస్ట్ అందరికీ తెలిసినవే. కానీ, ఆ కథలు చెప్పే విధానంలో ఒక న్యూ వే ఉంటుంది. ఈ సినిమా ఆ వేలో ఉంటుంది.


తొలి భాగానికీ, మలి భాగానికీ ఉన్న వ్యత్యాసం ఏంటి?
'ఉపేంద్ర'లో నేను అనే కాన్సెప్ట్ ని కొంచెం హార్ష్ గా చెప్పడం జరిగింది. కానీ, ఈ సినిమాలో 'నువ్వు' అనే కాన్సెప్ట్ ని అందుకు భిన్నంగా చెప్పాం.


ఒకవైపు దర్శకత్వం, మరో వైపు నటన.. వాటిలో మీకేది సంతృప్తిగా ఉంటుందా?
డైరెక్షన్ లో ఒక ఫుల్ నెస్ ఉంటుంది. ఎందుకంటే, సినిమా మొత్తం నడిపించాలి. కానీ, నటన అంటే జస్ట్ అలా వచ్చి.. ఇలా నటించేసి వెళ్లడం. అంతే. యాక్టింగ్ ఎంజాయబుల్ గా ఉంటుంది. కానీ, ఇక్కడ కష్టం తక్కువ. డైరెక్షన్ కి ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ కష్టపడినప్పుడు ఎంజాయ్ మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా.


ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి తెలుగులోకి విడుదల చేయడంపై మీ ఫీలింగ్?
నాతో అప్పట్లో 'రా' తీశారు. మా మధ్య మంచి స్నేహం ఉంది. బుజ్జి పెద్ద నిర్మాత అయ్యారు. నేనూ సెటిలయ్యాను. 'ఉపేంద్ర 2'ని చూసి, నచ్చితే తెలుగులో విడుదల చేయమని బుజ్జితో అన్నాను. అప్పుడు తను 'నాకు 'ఉపేంద్ర' అంటే చాలా ఇష్టం. నేను 'ఉపేంద్ర 2'ని విడుదల చేస్తాను' అని కనీసం ఈ సినిమా చూడకుండా తెలుగులో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. బుజ్జి ఈ సినిమా విడుదల చేయడం వల్ల ఇది పెద్ద సినిమా అయ్యింది.


ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లో మీరు తలకిందులుగా ఉన్నారు?
అది పెద్ద టాపిక్ అయ్యింది. మామూలుగా అభిమానులు కటౌట్లకు పాలాభిషేకం చేస్తారు కదా.. ఇప్పుడెలా చేయాలి? అని ఆలోచిస్తున్నారు (నవ్వుతూ).


అలాగే, అఘోరా గెటప్ కూడా కనిపిస్తోంది?
అవును. కథలో భాగంగా ఆ గెటప్ ఉంటుంది. ఈ సినిమాలో నేను ఏ గెటప్ లో కనిపించినా, అది కథానుగుణంగానే ఉంటుంది తప్ప, కథకు సంబంధం లేకుండా ఉండదు.


ఫైనల్లీ.. మీ నుంచి ఎక్కువ తెలుగు సినిమాలు ఆశించవచ్చా?
నేను తెలుగు సినిమాలు చేయడానికి రెడీ. దర్శక, నిర్మాతలు ఆహ్వానిస్తే కాదనను. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు కనబరుస్తున్న ప్రేమాభిమానాలను దూరం చేసుకోలేను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !