View

పవన్ కల్యాణ్ లో నాకు నచ్చిన విషయం అది - వెంకటేశ్

Wednesday,January07th,2015, 03:35 PM

''నన్ను నేను స్టార్ అని ఎప్పుడూ అనుకోలేదు. మంచి నటుడనిపించుకోవాలన్నది నా ధ్యేయం. అందుకే కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి సాధ్యమైనంతవరకు ప్రయోగాత్మక పాత్రలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాను'' అని వెంకటేశ్ అన్నారు. పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వెంకీ చేసిన 'గోపాల 'గోపాల' విడుదలకు సిద్ధమైంది. హిందీలో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్'కి రీమేక్ ఇది. డాలీ (కిశోర్ కుమార్ పార్ధసాని) దర్శకత్వంలో డి.సురేశ్ బాబు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక.. ఈ చిత్రవిశేషాలను వెంకటేశ్ ని అడిగి తెలుసుకుందాం...

'దృశ్యం' తర్వాత మీరు చేసిన మరో రీమేక్ 'గోపాల గోపాల'. ఈ చిత్రంలో మీ పాత్ర గురించి చెబుతారా?
నా పాత్ర పేరు గోపాలరావు. తనకు దేవుడంటే అస్సలు నమ్మకం ఉండదు. అలాంటి గోపాలరావుకి దేవుణ్ణి నమ్మే పరిస్థితులు వచ్చాయా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రంలో అంతర్లీనంగా సందేశం ఉంది. సందేశం అంటే భారీ సన్నివేశాలతో ఉండదు. లైటర్ వీన్ గా చెప్పడం జరిగింది.

'హిందీ ఓ మై గాడ్' కథలో మార్పులు చేసి, 'గోపాల...'ను తెరకెక్కించడం జరిగిందా?
తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేశాం. హిందీలో దేవుడి పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. కానీ, ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ చేసిన దేవుడి పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. హిందీ చిత్రానికీ, తెలుగు వెర్షన్ కీ చాలా మార్పులు ఉంటాయి.

మీరేమో దేవుణ్ణి నమ్ముతారు.. కానీ ఈ చిత్రంలో అందుకు భిన్నంగా నటించాల్సి రావడం కష్టం అనిపించిందా?
వ్యక్తిత్వానికి భిన్నంగా ఉన్న పాత్ర చేయడం ఎప్పుడూ సవాల్ లా ఉంటుంది. ఆ విధంగా గోపాలరావు పాత్ర నాకు సవాల్ అనిపించింది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయి. ఈ పాత్రను ఎంతో ఇష్టపడి చేశాను. నా పాత్ర ద్వారా ప్రేక్షకులకు సందేశం ఇవ్వడం జరిగింది.

పవన్ కల్యాణ్ కాంబినేషన్లో సినిమా చేయడం గురించి?
వాస్తవానికి మేమిద్దరం కలిసి ఎప్పట్నుంచో సినిమా చేద్దామనుకుంటున్నాం. ఇలాంటి మంచి చిత్రం ద్వారా మా కాంబినేషన్ సెట్ కావడం ఆనందంగా ఉంది. పదేళ్ల క్రితం చేయాల్సిన కాంబినేషన్ చివరికి ఇప్పుడు కుదిరింది. 'ఓ మై గాడ్' చిత్రాన్ని రీమేక్ చేద్దామనుకున్న తర్వాత దేవుడి పాత్రను పవన్ లాంటి నటుడు చే్స్తే బాగుంటుందనుకున్నాం. తను చేయడానికి అంగీకరించాడు. ఈ పాత్రను పవన్ చాలా బాగా చేశాడు.

మీ కామెడీ చాలా ఇష్టమని పవన్ కల్యాణ్ అన్నారు. మరి.. ఆయనలో మీకేం ఇష్టం?
పవన్ కి కూడా మంచి కామిక్ సెన్స్ ఉంది. అదంటే చాలా ఇష్టం. అలాగే, పవన్ ముక్కుసూటితనం ఇష్టం. దేవుడి పాత్ర చేయాలంటే స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఉండాలి. అది పవన్ కి ఉంది.

చిత్రదర్శకుడు కిశోర్ కుమార్ (డాలీ) టేకింగ్ గురించి ఏం చెబుతారు?
ఈ చిత్రం షూటింగ్ ఆరంభించే ముందు డాలీ చాలా వర్కవుట్ చేశాడు. ఒక మంచి ఎంటర్ టైనర్ మూవీ అందించడానికి శాయశక్తులా కృషి చేశాడు.

'గోపాల గోపాల' ఆడియో గురించి?
అనూప్ రూబెన్స్ మంచి పాటలిచ్చాడు. భగవద్గీతకు సంబంధించిన పాట, మూడ నమ్మకాల మీద వచ్చే సాంగ్, భజే భజే..' పాట నాకు చాలా బాగా నచ్చాయి. పాటలు మాత్రం కాదు.. రీ-రికార్డింగ్ కూడా బాగా చేశాడు.

మిథున్ చక్రవర్తితో నటించడం?
హిందీ 'ఓ మై గాడ్'లో చేసిన పాత్రనే తెలుగులో మిథున్ చక్రవర్తి చేశారు. ఇందులో నేను చేసిన గోపాలరావు పాత్రను అభినందిస్తూ 'నీ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్ర అవుతుంది' అన్నారాయన.

ఈ చిత్రం ప్రారంభోత్సవంలో మీ అబ్బాయి అర్జున్ పాల్గొన్నాడు కదా?
అవును. తనకేం బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ మధ్య ఓ సందర్భంలో 'లైఫ్ ఈజ్ సో సింపుల్ నానా' అన్నాడు. ఆ మాటలు విని ఆశ్చర్యపోయాను.

'మసాలా', 'దృశ్యం', ఇప్పుడు 'గోపాల గోపాల'.. ఇలా వరుసగా రీమేక్ చిత్రాలు చేయడానికి కారణం?
మంచి కథ అనిపిస్తే చేస్తున్నాను. అది రీమేక్ చిత్రమా? స్ర్టయిటా? అని ఆలోచించడంలేదు. అలాగే సోలో హీరోగా మంచి కథ వస్తే చేస్తాను. ఒకవేళ మల్టీస్టారర్ కుదిరితే ఓకే. మంచి కథ కుదిరితే ఏ సినిమా అయినా చేయడానికి నేను రెడీ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !