View

ఇంటర్య్వూ - చరణ్ దీప్ (లోఫర్ విలన్)

Wednesday,December30th,2015, 09:45 AM

''కోట శ్రీనివాసరావుగారు నా ఫేవ‌రేట్ విల‌న్. ఆయనలా విలన్ లా లేదా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాల‌న్న‌ది నా తాప‌త్ర‌యం.. ఆ దిశగానే నా జ‌ర్నీ సాగుతుంది'' అన్నారు చరణ్ దీప్. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన 'లోఫర్' చిత్రంలో చరణ్ దీప్ విలన్ గా నటించాడు. ఈ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ సందర్భంగా తన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు చరణ్ దీప్. ఆ విశేషాలు మీ కోసం...


ప‌టాస్ టు లోఫ‌ర్ మీ ఎక్స్ పీరియ‌న్స్ గురించి చెప్పండి..?
నిజంగా ఈ ఇయ‌ర్ ఫెంటాస్టిక్ గా గ‌డిచింది. ప‌టాస్ స‌క్సెస్ టూర్ తో మొద‌లైన నా జ‌ర్నీ లోఫ‌ర్ స‌క్సెస్ టూర్ తో ముగిసింది. ప్ర‌త్యేకంగా లోఫ‌ర్ స‌క్సెస్ టూర్ లో నాకు ప్రేక్ష‌కుల‌నుండి వ‌చ్చిన స్పంద‌న చాలా బాగుంది. అంద‌రూ న‌న్ను తిట్టుకుంటుంటే ఆర్టిస్ట్ గా స‌క్సెస్ అయ్యాన‌నే సంతోషం గ‌లిగింది.


లోఫర్ చిత్రంలో నటించే అవకాశం ఎలా దక్కింది?
పూరి గారితో ప‌నిచేయాల‌నేది నా డ్రీమ్ .. గోలీమార్ సెలెక్ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని తెలిసి నేను వెళ్ళాను. నాతో పాటు ఇంకో ఆర్టిస్ట్ సెలెక్ట్ అయ్యాడ‌ని కో డైరెక్ట‌ర్ చెప్పాడు .. నేను ఎంతో ఎగ్జైట్ అయ్యాను. కానీ నేను సెలెక్ట్ కాలేదు, దాంతో ఆ రోజు చాలా ఏడ్చాను, ఆ ఏడుపు ఒక క‌సిని నాలో పెంచింది. ఎప్ప‌టిక‌యినా పూరి గారి ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయాల‌ని గ‌ట్టిగా అనుకున్నాను. అది లోఫ‌ర్ తో నెర‌వేరింది, పూరి గారికి ఆ విష‌యం చెబితే నాకు గుర్తు లేద‌ని అన్నారు.


పూరి తో మీ జ‌ర్నీ ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది?
నిజానికి పూరి గారి నాలెడ్జ్ లో సినిమా కేవ‌లం ప‌దిశాత‌మే. ఆయ‌న‌కి స‌మాజం పై ఉన్న అవ‌గాహన చూస్తే నాకు ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఆయ‌న అభిమానిగా ఉన్న నేను ఆయ‌న ఫాలోవ‌ర్ ని అయిపోయాను. పూరి గారి వ‌ర్కింగ్ స్టైల్ కి అల‌వాటు ప‌డిన త‌ర్వాత నా ఆలోచ‌నలు చాలా మారాయి. ఆయ‌న‌కు ఎప్ప‌టికీ రుణ ప‌డిపోయిఉంటాను. లోఫ‌ర్ మూవీ లో నా క్యారెక్ట‌ర్ ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది.


కొడుకు ఎలా ఉండ‌కూడ‌దో మీ క్యారెక్ట‌ర్ చెబుతుంది మీ ఇంట్లో ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చింది..?
మా ఇంట్లో నా క్యారెక్ట‌ర్ ని తిట్టుకుంటూనే ఎంజాయ్ చేసారు.. ముఖ్యంగా మ‌ద‌ర్ ని చంపే స‌న్నివేశంలో అయితే నాకు చాలా తిట్లు ప‌డ్డాయి మా అమ్మ‌నుండి కానీ అవ‌న్నీ నాలో ఆర్టిస్ట్ కి కాన్ఫిడెంట్ పెంచాయి.


వ‌రుణ్ తేజ్ తో మీ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది.?
మెగా ఫ్యామిలీనుండి వ‌చ్చిన హీరో లా కాకుండా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. క్లైమాక్స్ ఫైట్ చేస్తున్న‌ప్పుడు ప్రొడ‌క్ష‌న్ వాళ్ళంద‌రూ వ‌రుణ్ కి స‌రైన పొటీ దొరికింది అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రిలీజ్ త‌ర్వాత అదే టాక్ ప్రేక్షకుల నుండి వినిపించ‌డం డ‌బుల్ హ్య‌పీ.


తెలుగుకి మంచి ట‌ఫ్ విల‌న్ దొరికాడ‌ని అనిపిస్తుంది...?
థ్యాంక్స్... బాలీవుడ్ నుండి విల‌న్స్ ని తెచ్చుకోవ‌డం త‌ప్పేమీకాదు.. ద‌ర్శ‌కుడి అంచ‌నాలకు త‌గ్గ‌ట్లు మ‌నం త‌యారు అవ‌గ‌లిగితే తెలుగు వారికే తొలి ప్రాధాన్య‌త ఇస్తారు. ఆ అవ‌గాహ‌న లేకుండా నేను కొంత టైం వేస్ట్ చేసాను.. కానీ త‌ర్వాత సిక్స్ ప్యాక్ చేసాను.. మార్ష‌ల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాను.. ఇప్పుడు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. పూరిగారు చాలా ఎంక‌రేజ్ చేస్తున్నారు..


కన్నడ లో బాక్స‌ర్ మూవీతో ఎంట‌ర్ అయ్యారు..?
అవును.. ఆ మూవీ అక్క‌డ మంచి విజ‌యం సాధించింది. ద‌ర్శ‌న్ హీరోగా చేసిన ఆ మూవీ లో నేను విల‌న్ గా చేసాను. సిక్స్ ప్యాక్ బాగా వ‌ర్క్ అవుట్ అయ్యింది. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.


బాహుబ‌లి 2 లో ఉన్నారా..?
రాజ‌మౌళి గారి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాను. ఫ‌స్ట్ పార్ట్ లో కనిపించిన కాల‌కేయ త‌మ్ముడి క్యారెక్ట‌ర్ రెండో పార్ట్ కి లింక్ అవుతుంద‌ని చెప్పారు. మార్చి లో నా పాత్ర షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని తెలిసింది. సో.. చాలా ఈగ‌ర్ గా ఎదురుచూస్తున్నా..


విల‌న్ గానే కంటిన్యూ అవుతారా..?
నాకు మొద‌టినుండి విల‌న్ రోల్స్ అంటే చాలా ఇష్టం. కోటాగారు నా ఫేవ‌రేట్ విల‌న్. ఆయనలా విలన్ లా లేదా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాల‌న్న‌ది నా తాప‌త్ర‌యం.. ఆ దిశగానే నా జ‌ర్నీ సాగుతుంది. త‌మిళంలో జిల్లా చేసాను మంచి పేరు వ‌చ్చింది. పులి కోసం విజ‌య్ గారు అడిగితే డేట్స్ అడ్జెక్ట్ కాక కుర‌ద‌లేదు. ఇప్ప‌డు శంక‌ర్ శిష్యుడు చేస్తున్న మూవీలో మెయిన్ విల‌న్ గా చేస్తున్నాను..Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !