View

వెటకారం నిండిన పాత్ర నాది - మంచు మనోజ్

Sunday,October12th,2014, 04:54 PM

హీరోగా మనోజ్ ది పదేళ్ల యాత్ర. ఈ పదేళ్ల కెరియర్ లో 13 సినిమాలు చేసారు మనోజ్. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ, ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ ముందుకుసాగుతున్నారు. తన చిత్రాలకు తనే ఫైట్స్ కంపోజ్ చేసుకోవడం, పాటలు పాడటంలాంటివి చేసి, మిగతా హీరోలకన్నా భిన్నంగా దూసుకెళుతున్న మనోజ్ తాజా చిత్రం 'కరెంట్ తీగ'. ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించారు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, జగపతిబాబు, సన్నీలియోన్ కీలక పాత్రలు చేసారు. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను మీడియాతో ఈ విధంగా పంచుకున్నారు మనోజ్.

'వరత్తపడాద వాలిబర్ సంఘం' బాగా నచ్చింది

అన్నయ్య నాతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ కథ కుదరలేదు. తను నాగేశ్వరరెడ్డి గారి దర్శకత్వంలో 'దేనికైనా రెడీ' చిత్రం చేసాడు. ఆ తర్వాత నేను కూడా నాగేశ్వరరెడ్డి గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నాను. ఆ విషయం ఆయనతో చెబితే ఓ కథ రెడీ చేసారు. ఆ కథతో సినిమా చేద్దామని నేను, అన్నయ్య అనుకుంటున్న సమయంలో తమిళ చిత్రం 'వరత్తపడాద వాలిబర్ సంఘం' ని చూడమని నాకు తెలిసిన వారు చెప్పారు. నేను, అన్నయ్య, నాగేశ్వరరెడ్డిగారు ఈ తమిళ చిత్రాన్ని చూసాం. ముగ్గురికీ ఈ సినిమా నచ్చింది. వెంటనే అన్నయ్య ఈ చిత్రం హక్కులు తీసుకుని, నాగేశ్వరెడ్డిగారి దర్శకత్వంలో ఈ సినిమాని ఆరంభించాం.

తెలుగు కోసం మార్పులు చేసాం...

'వరత్తపడాద వాలిబర్ సంఘం' హక్కులు అయితే తీసుకున్నాంగానీ, మక్కికిమక్కి దింపేయాలనుకోలేదు. తమిళంలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉండవు. కానీ తెలుగుకి వచ్చేసరికి యాక్షన్ పార్ట్ అవసరం. నేను హీరోగా నటిస్తున్నాను కాబట్టి, యాక్షన్ ఎపిసోడ్స్ పెంచుదామని నాగేశ్వరరెడ్డిగారు అన్నారు. దాంతో స్ర్కిఫ్ట్ లో మార్పులు చేసారు. తెలుగు నేటివిటీకి సరిపడా మార్పులు చేసాం. విలన్ క్యారెక్టర్స్ ని జత చేసాం. నిడివి తగ్గించి, సినిమా ఫాస్ట్ గా ఉండేలా చేసుకున్నాం. అలాగే కామెడీ మిస్ అవ్వకూడదని, డైలాగుల్లో కామెడీ, పంచ్ లు ఉండేలా చూసుకున్నాం. దాంతో కామెడీ మిస్ అయ్యామనే ఫీలింగ్ ఉండదు.

నా పాత్ర వెటకారంతో కూడుకున్నది...

నేను చాలా వరకూ అల్లరిగా, జోష్ à°—à°¾ ఉండే పాత్రలు చేసాను. వాటికి పూర్తి భిన్నంగా à°ˆ సినిమాలోని పాత్ర ఉంటుంది. à°’à°• విలేజ్ లో విలేజ్ ఇంపార్టెంట్ పర్సన్స్ (విఐపి) సంఘానికి లీడర్ ని.  à°† à°Šà°°à°¿ పెద్దలకు వ్యతిరేకంగా వెళుతూ ఊరిని డెవలప్ చేసే పాత్ర నాది. వెటకారం నిండిన మాటలు, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో à°ˆ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాను.

జగపతిబాబుగారితోనే చేయించాలనుకున్నాం...

రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి పాత్ర జగపతిబాబుగారిది. ఆయన వేసే చిన్న పందెంతోనే ఈ సినిమా మొదలవుతుంది. ఈ క్యారెక్టర్ కి జగపతిబాబుగారినే తీసుకోవాలనుకున్నాం. కథ చెప్పగానే, ఈ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన పాత్ర ఈ సినిమాకి బ్యాక్ బోన్ లాంటిది. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి.

సన్నిలియోన్  à°«à±‹à°°à±à°¨à± స్టార్ అని నాన్నకు తెలీదు...

ఈ సినిమాలోని టీచర్ పాత్ర కోసం ఓ పెద్ద హీరోయిన్ ని తీసుకుందామనుకున్నాం. కానీ నా స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు సన్నిలియోన్ ని తీసుకోవడం జరిగింది. ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాన్నగారు తనకు చిన్న సన్మానం చేసి, బాగా నటించిందని మెచ్చుకుని పంపించారు. కానీ తను ఫోర్న్ స్టార్ అని రాంగోపాల్ వర్మగారు నాన్నకు చెప్పారు. అప్పుడు మమ్ముల్ని పిలిచి తిట్టారు. అయితే తను ఇప్పుడు ఫోర్న్ స్టార్ కాదని, హిందీ చిత్రాలు చేస్తోందని చెప్పడంతో నాన్న శాంతించారు. ఈ సినిమాకి సన్నిలియోన్ వల్ల మంచి క్రేజ్ వచ్చింది. ఓ ఐటమ్ పాట చేయడంతో పాటు, టీచర్ గా చేసింది సన్నిలియోన్.

సన్నిలియోన్ వల్ల 'ఎ' సర్టిఫికేట్ రాలేదు...

నిజం చెప్పాలంటే సన్నిలియోన్ తో చిత్రీకరించిన పాట అసభ్యంగా ఉండదు. కానీ ఆమె వెనుక డ్యాన్స్ చేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని 'ఎ' సర్టిపికేట్ ఇచ్చారు. హాలీవుడ్ స్టైల్లో, ఎం టివిలో ప్రసారం అయ్యే పాటల్లా ఈ పాట ఉంటుంది. అంతే తప్ప... ఈ పాట వల్గర్ గా ఉండదు.

అధికారాన్ని దుర్వినియోగం చేసారు...

సెన్సాన్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మీ గారు ప్రతిది భూతద్ధంలో చూస్తారు. దేన్నయినా వేరే విధంగా ఆలోచిస్తే, బూతు కనిపిస్తుంది. ఆవిడగారు 'దొబ్బెయ్', 'ఇన్స్ ట్రుమెంట్లు పగిలిపోతాయ్'లాంటి మాటలను కూడా బూతుగా భావించి కట్స్ ఇచ్చారు. నా 'నోకియా' చిత్రం సెన్సార్ సమయంలో ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 'కరెంట్ తీగ' కి కూడా అలానే జరిగింది. అధికారం చేతిలో ఉంది కదా అని దుర్వినియోగం చేయకూడదు. ఆమె ట్రాన్స్ ఫర్ అయ్యి వెళ్లిపోయింది. ఇకముందు నిర్మాతలు కొంతమేర ఊపిరి పీల్చుకుంటారని భావిస్తున్నాను.

యాక్షన్ ఎపిసోడ్స్ ని 3, 4 రోజుల్లో పూర్తి చేసాను...

యాక్షన్ సీక్వెన్స్ అనగానే, 20, 25రోజులు షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నారు. అది నాకు అసలు మింగుడుపడని విషయం. à°“ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించడానికి అన్ని రోజులు అవసరం లేదు. అందుకే నేను  3, 4 రోజుల్లో యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసుకుని పూర్తి చేయడం అలవాటు చేసుకున్నాను. మొత్తం రియల్ స్టంట్స్. రోప్స్ లాంటివి అసలు వాడను. దానివల్ల బడ్జెట్ తగ్గుతుంది. ఇంట్లో వాళ్లు రిస్క్ చెయ్యొద్దని అంటుంటారు. కానీ రిస్క్ చేయకపోతే ఎలా. జాకీచాన్ ని వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా రిస్క్ చెయ్యొద్దని చెబుతారు. అయితే తను మానలేదు కదా... తను మానితే మనం థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడగలిగేవాళ్లం కాదు. ఎందులో అయినా రిస్క్ ఉంటుంది. కాబట్టి రిస్క్ గురించి ఆలోచించను. కాకపోతే ఇంట్లో వాళ్ల మాటలను పెడచెవిన పెట్టడం ఇష్టంలేక జాగ్రత్తలు తీసుకుంటాను.

రాజేంద్రప్రసాద్ గారంటే చాలా ఇష్టం...

చిన్నప్పట్నుంచి నాకు రాజేంద్రప్రసాద్ గారంటే ఇష్టం. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అందుకే కామెడీ సీన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆయనను తలుచుకుంటాను. నాకు కూడా కామెడీ సీన్స్ చేయడమంటే చాలా ఇష్టం.

డైలాగ్స్, పాటలు హైలెట్...

'కరెంట్ తీగ' చిత్రంలో లవ్ ఉంది. కామెడీ ఉంది. సెంటిమెంట్ ఉంది. పాటలు బాగా కుదిరాయి. తిరుమల శెట్టి రాసిన డైలాగులు వినోదంగా ఉండటంతో పాటు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్, డైరెక్షన్ ఇవన్ని సినిమాకి హైలెట్ గా నిలిచే విషయాలు.

యువన్, అచ్చు నాకు బాగా కనెక్ట్ అయ్యారు....

అచ్చు, యువన్ శంకర్ రాజాతో నాకు రాపో ఎక్కువ. ఈ ఇద్దరూ నాకు బాగా కనెక్ట్ అయ్యారు. నాకు ఎలాంటి పాటలు బాగుంటాయో వారికి బాగా తెలుసు. పాటకు సందర్భం చెప్పగానే, వారు ఎలాంటి ట్యూన్ చేయాలో ఫిక్స్ అయిపోతారు. ఇక నేను వారి పనిలో వేలు పెడతానని ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదు. సరదాగా ట్యూన్స్ గురించి చర్చించుకుంటాం. నేను పాడితే బాగుంటుందని వారు బావిస్తే, పాడతాను. అంతే తప్ప... నేను వేలు పెడతాననేది కరెక్ట్ కాదు. వేరే సంగీత దర్శకులతో నేను వర్క్ చేయననేది కూడా నిజం కాదు.

కాంపీటీషన్ పెరిగింది...

చిత్ర పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతోంది. చాలా మార్పులు వచ్చాయి. ఆర్యోగకరమైన కాంపీటీషన్ ఇండస్ర్టీలో ఉంది. ఇది నాకు బాగా నచ్చుతుంది.  à°šà°¾à°²à°¾à°®à°‚దికి అవకాశాలు వస్తున్నాయి. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశాలు రావాలనేది నా కోరిక. కాబట్టి ఎక్కువ సినిమాలు నిర్మించాలి, కొత్త కొత్త వాళ్లు రావాలి. అప్పుడే చిత్ర పరిశ్రమ బాగుంటుంది.

'సన్నాఫ్ పెదరాయుడు' వర్కవుట్ అవ్వలేదు...

'సన్నాఫ్ పెదరాయుడు' టైటిల్ అనుకున్నాం. కానీ ఆ టైటిల్ కి సరిపడా కథ వర్కవుట్ అవ్వలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లలేకపోయాము. 'కరెంట్ తీగ' తర్వాత రమేష్ పుప్పాల గారి ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాను. ఈ చిత్రంలో నాది నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర. ఈ చిత్రం ద్వారా కొత్త డైరెక్టర్ తెరకు పరిచయంకాబోతున్నారు.

ప్రతిదీ డ్రీమ్ రోల్ లానే భావిస్తాను....

నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రతిదీ డ్రీమ్ రోల్ లానే భావిస్తాను. నాన్నగారు మాత్రం నేనో సోషియో పాంటసీ చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారు. భవిష్యత్తులో అలాంటి సినిమా చేయడానికి ట్రై చేస్తాను.

మెగాఫోన్ పట్టుకుంటాను....

నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టుకుంటాను. కాకపోతే అది ఎప్పుడు జరుగుతుందని మాత్రం ఇప్పుడే చెప్పలేను. ఇప్పుడు మాత్రం నా దృష్టంతా నటనపైనే.

 

Manchu Manoj interview about Current Theega



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !