View

ప్రతి అమ్మకి కనెక్ట్ అవుతుంది - నాగశౌర్య

Thursday,October09th,2014, 12:49 PM

'కుటుంమంతా కలిసి చూడదగ్గ సినిమాలు చేయలనేది నా కోరిక'' అంటున్నారు హీరో నాగశౌర్య. చందమామ కథలు', 'ఊహలు గుసగుసలాడే' లాంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ ద్వారా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న హీరో నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ చిత్రం ద్వారా రాజమౌళి శిష్యుడు త్రికోటి డైరెక్టర్ à°—à°¾ పరిచయం అవుతున్నారు. అక్టోబర్ 10à°¨ à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా à°ˆ రోజు (9.10.2014) à°ˆ సినిమా గురించి, తన తదుపరి చిత్రాల గురించి మీడియాతో మాట్లాడుతూ  à°ªà±ˆ విధంగా స్పందించారు హీరో నాగశౌర్య. మరిన్ని విశేషాలు à°ˆ విధంగా...

'చందమామ కథలు', ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్య' ... ఈ మూడు అచ్చు తెలుగు టైటిల్స్. ఈ టైటిల్స్ తో సినిమాలు చేయడం పట్ల మీ ఫీలింగ్?

ఈ టైటిల్స్ దర్శక, నిర్మాతలు సెలెక్ట్ చేసుకున్నవే. కాకపోతే ఈ సినిమాల్లో నటించే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అచ్చు తెలుగు టైటిల్స్ అంటే నాకు కూడా ఇష్టం. కాబట్టి ఇకముందు కూడా నన్ను టైటిల్ గురించి సజ్జెస్ట్ చేయమని అడిగితే... తెలుగు టైటిల్స్ నే సజెస్ట్ చేస్తాను.

'దిక్కులు చూడకు రామయ్య'  à°¸à°¿à°¨à°¿à°®à°¾ గురించి చెప్పండి?

ఈ సినిమా కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తండ్రి, కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడతారు. ఆ అమ్మాయి వెంట పడతారు. ప్రేమిస్తారు. కానీ ఎక్కడా అసభ్యంగా ఉండదు. కొన్ని కాన్సెఫ్ట్ లను పాజిటివ్ గానూ ప్రజెంట్ చెయ్యొచ్చు. నెగటివ్ గానూ ప్రజెంట్ చెయ్యొచ్చు. ఈ సినిమా కాన్సెఫ్ట్ ని పాజిటివ్ గా, వినోద ప్రధానంగా చెప్పడం జరిగింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇలాంటి కాన్సెఫ్ట్ తో సినిమాలంటే రిస్క్ తో కూడుకున్నవి. మరి ఈ సినిమా చేయడం మీకు రిస్క్ అనిపించలేదా?

à°ˆ సినిమా à°•à°¥ ముందుగా మా నిర్మాత సాయి కొర్రపాటిగారు విన్నారు. ఆయనకు à°ˆ à°•à°¥ బాగా నచ్చింది. కథను నమ్మే వ్యక్తి ఆయన. అలాంటి ఆయన à°ˆ à°•à°¥ పై కాన్ఫిడెంట్ à°—à°¾ ఉన్నారు. నేను ఆయనను నమ్ముతాను. అందుకే ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా à°ˆ సినిమా కమిట్ అయ్యాను. సాయిగారికి ఆయన నిర్మించిన à°—à°¤ చిత్రాలు ఉత్తమాభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చిపెట్టాయి. à°ˆ సినిమా ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుంది. వారాహి బ్యానర్ లో  à°°à±‚పొందే సినిమాలంటే కుటుంబమంతా కలిసి చూడొచ్చిన మరోసారి à°ˆ సినిమా నిరూపిస్తుంది.

ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పండి?

కథ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అవుతుంది. కథను మలిచిన తీరు బాగుంటుంది. కీరవాణిగారు అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అమ్మ, నాన్న, కొడుకు పాత్రలకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ ని కట్టిపడేసే అంశాలు.

మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి?

కొడుకు ఉన్న ప్రతి ఇంటికి నా క్యారెక్టరేజైషన్ కనెక్ట్ అవుతుంది. కొడుకు లేని ప్రతి అమ్మ నాలాంటి కొడుకు ఉంటే బాగుంటుంది కదా అనుకుంటుంది. తల్లి కాబోతున్న ప్రతి అమ్మాయి నాలాంటి కొడుకును కనాలని కోరుకుంటుంది. సో... ప్రతి అమ్మకి నా క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. సాయి కొర్రపాటిగారు ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన వెంటనే ఈ మాటలే నాతో అన్నారు. బాగా నటించావని మెచ్చుకున్నారు.

హీరోగా ఎలాంటి జానర్ సినిమాలు చేయడానికి అంగీకరిస్తారు?

కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమాలు చేయడానికే ఇష్టపడతాను. నా గత సినిమాలు అలాంటి జానర్ కి చెందినవే. పక్కింటి కుర్రాడి తరహా పాత్రలు, లవర్ బోయ్ తరహా పాత్రలు చేయాలనుకుంటాను. బూతు సినిమాల జోలికి అసలు వెళ్లను.

ప్రతి హీరో యాక్షన్ సినిమాలు చేయడానికే ఇష్టపడుతున్నారు? అప్పుడే మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోగలుగుతాం అనే అభిప్రాయం ఉంది? మరి మీరు అటు వైపుగా ఆలోచించరా?

నేను కెరీర్ బిగినింగ్ లో ఉన్నాను. ఇప్పుడే మాస్ సినిమాలు చేస్తే,  à°‡à°•à±à°•à°¡ నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. దానికి ఇంకా సమయం ఉంది. యాక్షన్ సినిమాలు చేయడానికి à°“ ఇమేజ్ కావాలి. à°† ఇమేజ్ ఇంకా నాకు రాలేదు. కాబట్టి కొంతకాలం లవర్ బోయ్ పాత్రలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తాను. భవిష్యత్తులో యాక్షన్ సినిమాల గురించి ఆలోచిస్తాను.

వారాహి బ్యానర్ పై చేస్తున్న రెండో సినిమా ఇది? సాయి కొర్రపాటిగారితో మీ అనుబంధం గురించి చెప్పండి?

సాయిగారు లేకపోతే నేను లేను. 'సినిమా మీద పేషన్ ఉన్న నిర్మాత సాయి కొర్రపాటి. ఆయన ప్రోత్సహం మర్చిపోలేనిది. వారాహి బ్యానర్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. à°† బ్యానర్ లో  à°¨à±‡à°¨à± చేస్తున్న రెండో చిత్రం ఇది. ఇకముందు కూడా à°ˆ బ్యానర్ లో సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను.

మీరు అభిమానించే హీరోల గురించి చెప్పండి?

'నిన్నే పెళ్లాడతా' సినిమా చూసిన తర్వాత నేను నాగార్జునగారికి అభిమానినైపోయాను. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఎన్టీఆర్ చాలా కష్టపడి, కసిగా సినిమా చేస్తారు. ఆయనలానే కష్టపడి, కసిగా సినిమాలు చేయాలని ఆయనను చూసి నేర్చుకున్నాను.

మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి?

'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రంలో నటిస్తున్నాను. (నవ్వుతూ... చూసారా ఇది కూడా అచ్చు తెలుగు టైటిలే). కంఫ్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మొత్తం కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇంకా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. అవి ఫైనలైజ్ అయిన తర్వాత చెబుతాను.

 

Nagashaurya interview about Dikkulu choodaku ramayya



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !