View

చిన్న సినిమా అయినా విజయం పెద్దది: నాగశౌర్య

Tuesday,June24th,2014, 12:26 PM

హీరో కావాలనే ఆకాంక్షతో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడు శౌర్య. దాదాపు నాలుగైదేళ్లు అవకాశాల కోసం ట్రై చేసి, ఇక సినిమాలు మానేసి, బిజినెస్ చూసుకుందామనుకున్నాడు. కట్ చేస్తే.. తను కోరుకున్నట్లు మంచి అవకాశం వచ్చింది. 'చందమామ కథలు'లో ఓ కథలో నటించిన శౌర్య, ఇటీవల విడుదలైన 'ఊహలు గుసగుసలాడే'లో హీరోగా నటించాడు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం విజయపథంలో దూసుకెళుతోంది. ఇక.. శౌర్యతో మాట్లాడదాం...

'ఊహలు గుసగుసలాడే'కి ఎలా అవకాశం ఎలా వచ్చింది?

à°—à°¤ నాలుగైదేళ్లుగా హీరోగా అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను. చాలా ఆఫీసులకి తిరిగాను. కొన్ని ఆడిషన్స్ లో కూడా పాల్గొన్నాను. కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ, నాకు తగ్గట్టుగా లేవు. దాంతో ఇక అవకాశాలు రావని ఫిక్స్ అయ్యాను. ఇండస్ర్టీకి పనికి రానేమో అని కూడా అనిపించింది. à°† సమయంలోనే à°’à°• సినిమా చూశాను. దాని పేరు చెప్పను. à°ˆ సినిమాలో మనకు అవకాశం వస్తే బాగుండేది కదా అనిపించింది. "ఇకనుంచి సినిమాల కోసం ట్రై చేయడం మానేస్తాను.. బిజినెస్ చూసుకుంటా'' అని మమ్మీ, డాడీకి చెబుదామనుకున్నాను. అప్పుడే వారాహి చలన చిత్రం బేనర్ వాళ్లు కొత్త నటీనటుల కోసం అన్వేషిస్తున్నారని తెలిసింది. కానీ, రికమండేషన్ ద్వారా వెళ్లాలేమో, డబ్బులు పెట్టాలేమో అని లైట్ తీసుకున్నాను. ఎందుకంటే, అంతకు ముందు నేను పాల్గొన్న ఆడిషన్స్ దాదాపు ఇలాంటివే. లైట్ తీసుకున్నప్పటికీ ఓసారి ట్రై చేద్దామనిపించి, నా ఫొటోలు మెయిల్ చేశాను.వెంటనే, వీడియో  à°•à±‚à°¡à°¾ పంపించమని పేర్కొన్నారు. వీడియో పంపిస్తే చూసి, పక్కన పడేస్తారు. అందుకే, నేను ఫోన్ చేసి, డైరెక్ట్ à°—à°¾ వస్తానని, యాక్ట్ చేసి చూపిస్తానని అన్నాను.

మరి.. రమ్మన్నారా?

కన్విన్స్ అయ్యి, రమ్మన్నారు. వెళ్లగానే అక్కడ అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈయన ఇక్కడున్నారేంటి? అని అక్కడివారిని అడిగితే, 'ఆయనే డైరెక్టర్' అన్నారు. డెఫినెట్ గా ఈ సినిమాలో అవకాశం వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే, మంచి నటుడిగా పేరుంది. తక్కువ సినిమాలు చేసినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా ఆయన సినిమా అంటే నేటివిటీ ఉంటుంది, మంచి డైలాగ్స్ ఉంటాయి, తెలుగుదనం ఉంటుంది. అందుకని, అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. పది, పదిహేను రోజులు ఆడిషన్స్ చేశారు. ఆ తర్వాత నాకు కాల్ చేయలేదు. ఆ తర్వాత వినాయక చవితి (గత ఏడాది) కి ఫోన్ చేసి ఆఫీసుకు రమ్మన్నారు.

ఎలా అనిపించింది?

చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆఫీసుకెళితే, రాజమౌళిగారు, కీరవాణిగారు, సాయి కొర్రపాటిగారు ఇలా చాలామంది ఉన్నారు. అంతమందిని చూసి, షాక్ అయ్యాను. 'శౌర్య నీ మొత్తం పేరు చెప్పు.. పూజ చేయించాలి' అన్నారు. అప్పుడు తెలిసిందే.. సెలక్ట్ అయ్యానని.

ఈ చిత్రంలో నటించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

శ్రీనివాస్ అవసరాలగారు చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. నాతో క్లియర్ గా అన్నీ చెప్పేవారు. దాంతో చాలా ఈజీ అయ్యింది. శ్రీనివాస్ గారు తనకేం కావాలో బాగా రాబట్టుకున్నారు. తెలుగు మీద ఆయనకు చాలా పట్టు ఉంది. ఈ సినిమా చేయడం ద్వారా తెలుగులో నాకు మరింత కమాండ్ వచ్చింది.

ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?

గత మూడు రోజులుగా నేను ఏదో ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూస్తున్నాను. సినిమా సాగుతున్నంతసేపూ హాయిగా నవ్వుకుంటున్నారు. 'చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి చూసేలా మంచి క్లీన్ ఎంటర్ టైనర్ ఇచ్చారు. కామెడీ చాలా జెన్యూన్ గా ఉంది. కనీసం ఒక్క డైలాగ్ లో కూడా డబుల్ మీనింగ్ లేకపోవడం అభినందనీయం' అని ప్రశంసిస్తున్నారు.

వసూళ్ల పరంగా ఎలా ఉంది?

మొదటి రోజుకన్నా ఆ తర్వాత వసూళ్లు పెరిగాయి. యూఎస్ లో 50వేల డాలర్లు దాటింది. ఒక చిన్న సినిమా అంత వసూలు చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమా తేడా అయ్యుంటే మన పరిస్థితి ఏంటా? అనిపిస్తోంది. లక్కీగా సక్సెస్ అయ్యింది. దాంతో సాయిగారు కొత్తవాళ్లతో సినిమాలు తీస్తారు. అలాగే, నాకూ మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది.

మీ నటనకు వచ్చిన ప్రశంసల గురించి?

చాలా బాగా చేశావని చాలామంది చెప్పారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే రాజమౌళిగారు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా నాతో ఓ సినిమా చేస్తానన్నారు. అది స్వీట్ షాక్ లా అనిపించింది. అలాగే, నాగార్జునగారంటే ఇష్టం. 'శౌర్య బాగా చేశాడు' అని ఆయన్నుంచి కాంప్లిమెంట్ ఆశిస్తున్నా.

కెమెరా అనుభవం గురించి?

ఐదారేళ్లుగా ఆడిషన్స్ లో పాల్గొన్నాను కాబట్టి, నాకు కెమెరా ఫియర్ లేదు. నన్ను ప్రూవ్ చేసుకోవాలనే తపనతో చేశాను.

మీరు సైన్ చేసిన మొదటి సినిమా ఇదేనా?

సైన్ చేసిన మొదటి సినిమా ఇదే. కానీ, విడుదలైన తొలి సినిమా మాత్రం 'చందమామ కథలు'. అయితే. అదే ఎనిమిది కథల సమాహారంతో రూపొందిన సినిమా కాబట్టి, హీరోగా 'ఊహలు గుసగుసలాడే' మొదటి సినిమా అనొచ్చు.

తదుపరి చేయబోతున్న చిత్రాల గురించి?

'దిక్కులు చూడకు రామయ్య.. పక్కనుంది సీతమ్మ' చేస్తున్నా. రాజమౌళిగారి అసిస్టెంట్ కోటిగారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా 'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమాలో నటిస్తున్నా.ఈ రెండు చిత్రాల్లోనూ నావి మంచి పాత్రలే.

 

Nagasourya Happy about oohalu gusagusalade



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !