View

ఇంటర్య్వూ - నారా రోహిత్ (తుంటరి)

Wednesday,March09th,2016, 07:02 AM

నారా రోహిత్ హీరోగా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తుంటరి'. ఇది తమిళ చిత్రం 'మాన్ కరాటే' కి రీమేక్. లతా హెగ్డె హీరోయిన్ గా నటించింది. శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై అశోక్ బాబా, నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ తో ఫిల్మీబజ్ డాట్ జరిపిన ఇంటర్య్వూ మీ కోసం...

 

తుంటరి సినిమా ఎలా సెట్ అయ్యింది?
తమిళ్ చిత్రం 'మాన్ కరాటే' à°•à°¿ రీమేక్ 'తుంటరి'. ఇప్పటివరకూ నేను ఇలాంటి జోనర్ సినిమా చేయలేదు. కామెడీ ఎంటర్ టైనర్. హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం నచ్చి à°ˆ సినిమా చేయడానికి అంగీకరించాను. à°ˆ డైరెక్టర్ తో మంచి ర్యాపో ఉంది. దాంతో ఎక్కడా కన్ ఫ్యూజ్ లేకుండా చాలా క్లారటీగా à°ˆ సినిమా చేసాను. 

 

తుంటరి లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా ఇది. స్టోరీకి తగట్టు డైలాగులు ఉంటాయి. ఈ సినిమాలో బాక్సర్ గా కనిపిస్తాను. అయితే స్టోరీ మాత్రం బాక్సింగ్ నేపధ్యంలో ఉండదు. సినిమాలో చిన్న పార్ట్ బాక్సింగ్. మంచి ఎంటర్ టైనర్. అన్ని వన్గాల ప్రేకకులకు నచ్చుతుంది.

 

బాక్సర్ గా నటించారు కదా.. ట్రైనింగ్ తీసుకున్నారా?
అలాంటిదేమీ లేదండి.. కాకపోతే బాక్సర్ గా నటిస్తున్నాను కాబట్టి బాక్సింగ్ రింగ్ లో స్టాండింగ్ ఎలా ఉంండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి తదితర విషయాలను జాగ్రత్తగా పరిశీలించాను. లుక్ పరంగా కూడా శ్రద్ధ తీసుకున్నాను.

 

కుమార్ నాగేంద్ర 'జోరు' చిత్రం ఫ్లాప్. మరి ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయడానికి కారణం?
కుమార్ నాగేంద్ర తొలి సినిమా 'గుండెల్లో గోదారి' విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన చిత్రం. 'జోరు' వర్కవుట్ అవ్వనంత మాత్రానా అతనిలో విషయం లేదని కాదు. ఓ సినిమా హిట్ అవ్వడానికి చాలా ఫ్యాక్ట్రర్స్ వర్కవుట్ అవ్వాలి. కాబట్టి సక్సెస్ ని బట్టి ఓ డైరెక్టర్ ని అంచనా వేయలేము. ఫెయిల్యూర్ ఇచ్చాడు కదాని ఆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి వెనకడుగు వేయడం కరెక్ట్ కాదు. ఇక కుమార్ నాగేంద్ర మంచి టెక్నిషియన్. సినిమాను చక్కగా తెరకెక్కించాడు. తమిళం కంటే ఎమోషనల్ గా ఉండేలా సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమా అంతా ఫన్నీగా సాగుతుంది. నా గత చిత్రాలతో పోల్చితే డ్యాన్స్ కూడా చేశాను.

 

తమిళ్ సినిమా రీమేక్ కదా.. ఏమైనా మార్పులు చేసారా?
నేను తమిళ్ సినిమా చూడలేదు. మంచి కమర్షియల్ సినిమా అని విన్నాను. స్ర్కిఫ్ట్ విని ఈ సినిమా చేయడానికి అంగీరించాను. తమిళ్ వెర్షన్ కంటే ఇందులో లవ్. ఎమోషనల్ ఎలిమెంట్స్ ని ఎక్కువగా పెంచడం జరిగింది. మెయిన్ పాయింట్ లో మార్పు చేయలేదు. సీన్స్ విషయంలో మనకు తగ్గటు మార్పులు చేసాము.

 

మీకు తమిళ్ బాగా వచ్చా?
తమిళనాడులో 13సంవత్సరాలు చదువుకున్నాను. నాకు తమిళ్ మాట్లాడటం బాగా వచ్చు. భవిష్యత్తులో తమిళంలో సినిమాలు చేయాలనే ఆలోచన కూడా ఉంది.

 

ఈ నెలలోనే మీవి రెండు సినిమాలు విడుదలవుతున్నాయి?
అవునండి మార్చి 11న 'తంటరి', ఇదే నెల 25న 'సావిత్రి' సినిమాలు విడుదలవుతున్నాయి. సమ్మర్ కి సినిమాలు విడుదల చేయడానికి అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. నా రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండేలా చూసుకున్నాను. రెండు డిఫరెంట్ .జోనర్ సినిమాలు. రెండు చిత్రాలు నా కెరియర్ కి మంచి మలుపు అవుతాయనే నమ్మకం ఉంది.

 

మీ పెదనానగారు సి.యం కదా.. అందుకే ఎక్కువ సినిమాలు చేసే అవకాశం వస్తుందా?
పెదనానగారు సి.యం అయినంత మాత్రానా అవకాశాలు వస్తాయనుకుంటే పొరపాటే. అలాంటిదే ఉంటే నేను రాజమౌళిగారు లాంటి పెద్ద దర్శకులతో సినిమాలు చేసేవాడిని కదా...

 

మీరు కొంచెం లావుగా కనిపిస్తున్నారు కదా.. సన్నబడటానికి వర్కువట్లు చేయడంలేదా?
జూన్ నుండి చేయబోయే సినిమా కోసం సన్నబడాల్సి ఉంటుంది. సన్నబడితేనే à°† సినిమా చేస్తాను. à°† సినిమాకు నేను కూడా à°’à°• నిర్మాతగా వ్యవహరించబోతున్నాను. కాబట్టి వర్కవుట్లు చేసి సన్నబడతాను. ‘రాజా చెయ్యివేస్తే’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కూడా కంప్లీట్ అయ్యింది. మే నెలాఖరుకల్లా ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి కొత్త సినిమా కోసం సన్నబడటం మొదలుపెడతాను.

 

పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు?
ప్రస్తుతం కెరియర్ పైనే నా దృష్టంతా. ఈ యేడాది పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. వచ్చే యేడాది పెళ్లి చేసుకుంటాను.

 

బాలకృష్ణ గారి సినిమాలో నటించే అవకాశం వస్తే?
తప్పకుండా చేస్తాను. చిన్నప్పట్నుంచి బాలకృష్ణగారితో మంచి అనుబంధం ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి. నేను చేసే సినిమాలు గురించి అడిగి తెలుసుకుంటారు. కొన్ని సూచనలు కూడా ఇస్తారు. ఆయన చెప్పినవన్నీ ఫాలో అవుతాను.

 

తదుపరి సినిమాలు?
‘శంకర్’ రిలీజ్ గురించి నిర్మాతకే తెలియాలి. ఎప్పుడూ గ్యాప్ చూసుకుని రిలీజ్ చేస్తాడో చూడాలి. అలాగే ‘పండగలా వచ్చాడు’ కొన్ని రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. వచ్చే నెలలో అది కూడా పూర్తి చేసేస్తాను. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ పూర్తయ్యింది. నేను, శ్రీవిష్ణు కలిసి చేస్తున్న ‘నీది నాది ఒకటే à°•à°¥’ కూడా జూన్, జూలైలో విడుదలవుతుంది. అల్రెడి ఆరు స్క్రిప్ట్స్ లను ఓకే చేశాను. కాంబినేషన్ కంటే స్క్రిప్ట్ కు ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలు ఒకే చేస్తాను. మంచి సినిమాలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !