View

'సూర్య vs సూర్య' ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రం - హీరో నిఖిల్

Monday,March02nd,2015, 02:12 PM

'స్వామి రారా', 'కార్తికేయ' చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన హీరో నిఖిల్ 'సూర్య వర్సెస్ సూర్య' తో హ్యాట్రిక్ హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు. నిఖిల్, త్రిద జంటగా సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన à°ˆ చిత్రం ద్వారా కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మార్చి 5à°¨ à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్బంగా à°ˆ సినిమా గురించి నిఖిల్ చెప్పిన విశేషాలు à°ˆ విధంగా...

సూర్య వర్సెస్ సూర్య కథ గురించి చెప్పండి?
ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రం ఇది. సూర్యుడిని చూడటానికి ఇష్టపడని ఓ కుర్రాడు ఉదయమంతా బయటికి రాకుండా, ఓ అమ్మాయిని ఎలా ప్రేమించగలిగాడనే అంశాన్ని అద్బుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్.

ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేసారు?
ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా నటించాను. కాలేజ్ గోయింగ్ కుర్రాడిలా కనిపించడానికి నా బాడీ లాంగ్వేజ్ లో మార్పులు చేసుకున్నాను. అలాగే ఈ పాత్ర కోసం 10కిలోలు బరువు తగ్గాను. రేర్ డిసీజ్ తో బాధపడే కుర్రాడి పాత్ర. కాబట్టి ఇలాంటి డిసీజ్ లకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇలాంటి డిసీజ్ తో బాధపడేవారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారి మనోభావాలు ఎలా ఉంటాయి తదితర వాటి గురించి క్షణ్ణంగా తెలుసుకున్నాను. ఆఫ్ కోర్స్ డైరెక్టర్ దీనికి సంబంధించి చాలా పీడ్ బ్యాక్ ఇచ్చారు. నేను కూడా అన్నీ తెలుసుకుంటే పాత్రలో ఒదిగిపోయి నటించడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం కేటాయించాను.

ఈ కథ నచ్చడానికి ముఖ్య కారణం ఏంటీ?
డైరెక్టర్ ఈ స్టోరీ లైన్ చెప్పగానే చాలా ఎగ్జయిట్ అయిపోయాను. చాలా డిఫరెంట్ గా అనిపించింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వకుండా స్ర్కిఫ్ట్ ప్రిపేర్ చేసారు. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగల సత్తా ఉన్న స్ర్కిఫ్ట్. అందుకే ఈ సినిమాని మిస్ అవ్వకూడదని స్టోరీ లైన్ విన్న వెంటనే డిసైడ్ అయ్యాను.

డిఫరెంట్ స్టోరీ లైన్స్ తోనే వరుసగా సినిమాలు చేస్తున్నారు?
అవునండి. మనకు చాలామంది హీరోలు ఉన్నారు. కాంపీటిషన్ కూడా ఎక్కువగా ఉంది. ఈ పోటీని తట్టుకుని నిలబడాలంటే నేను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలి. అందుకే కథ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాను. డిఫరెంట్ కథలతో సినిమాలు చేసినప్పుడే నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందగలుగుతాను.

ఈ సినిమాలో మధుబాల నటించారు కదా... సీనియర్ నటితో తెరపంచుకోవడం పట్ల ఎలా ఫీలవుతున్నారు?
మధుబాలగారు హీరోయిన్ గా నటిస్తున్నప్పటి నుంచే నేను ఆమెకు పెద్ద అభిమానిని. తను ఈ సినిమాలో నటించడం వల్ల ఎక్కువ సమయం ఆమెతో మాట్లాడానికి కుదిరింది. ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఇక ఈ సినిమాలో మధుబాలగారి పాత్ర చాలా బాగుంటుంది. ఆమె అద్భుతంగా నటించారు.

హీరోయిన్ త్రిద గురించి చెప్పండి?
ఈ సినిమా కోసం కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాము. కథకు కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించే డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తను చాలా బాగా నటించింది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెడుతుంది.

మీ తదుపరి ప్రాజెక్ట్ గురించి చెప్పండి?
కొన్ని కథలు విన్నాను. వాటిల్లో కొన్ని కథలు నచ్చాయి. కాకపోతే మూడు నెలలు బ్రేక్ తీసుకుంటున్నాను. యాక్టింగ్ కోర్స్ చేయడానికి యు.యస్ వెళుతున్నాను. తిరిగి వచ్చిన తర్వాతే నా తదుపరి ప్రాజెక్ట్స్ కి సంబంధించి ప్రకటిస్తాను.

ఇప్పుడు యాక్టింగ్ కోర్సు చేయడమేంటీ?
నిజమేంటంటే... ఈ సినిమా విడుదలైన తర్వాత తిరుపతి వెంకన్నకు తలనీలాలు సమర్పించబోతున్నాను. జుత్తు లేకుండా నటించడం కుదరదు కాబట్టి మూడు నెలలు బ్రేక్ తీసుకోబోతున్నాను. ఈ మూడు నెలలు వృధా చేయకూడదని, యాక్టింగ్ లో ఇంకా మెళుకువలు నేర్చుకోవడానికి, కొత్త టెక్నిక్స్ తెలుసుకోవడానికి యు.యస్ వెళుతున్నాను. వచ్చిన వెంటనే నా తదుపరి సినిమా ప్రకటిస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !