View

ఇంటర్య్వూ - ప్రభాకర్ (రైట్ రైట్)

Saturday,June04th,2016, 04:14 PM

సినిమా సినిమాకీ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకుంటూ, యూత్, ఫ్యామిలీస్ à°•à°¿ దగ్గయరయ్యాడు సుమంత్ అశ్విన్. లవర్స్, కేరింత, కొలంబస్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న à°ˆ యువహీరో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'రైట్ రైట్'. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా à°®‌ను à°¦‌ర్శ‌à°•‌త్వంలో శ్రీ à°¸‌త్య à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ à°ª‌తాకంపై జె.వంశీకృష్ణ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో రూపొందుతోన్న à°ˆ చిత్రం జూన్ n10à°¨ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ చిత్రంలో 'బాహుబలి' ప్రభాకర్ కీలక పాత్ర పోషించారు. à°ˆ సినిమా తన కెరియర్ à°•à°¿ మంచి మలుపు అవుతుందనే నమ్మకంతో ఉన్న ప్రభాకర్ తన మనసులోని మాటలను à°ˆ విధంగా పంచుకున్నారు.

 

ముందుగా మీ కెరియర్ కి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి గారి గురించి చెప్పండి?
'మర్యాదరామన్న' చిత్రంలో నాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టే పాత్ర ఇచ్చారు రాజమౌళి. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. అయితే అన్నీ ఒక ఫైట్, ఒక సీన్ అనేట్లుగా ఉండటంతో నా కెరియర్ కి మంచి బ్రేక్ రాలేదు. అయితే మళ్లీ రాజమౌళిగారే 'బాహుబలి' లో కాలకేయ పాత్ర ఇచ్చి నా కెరియర్ కి బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత నా పరిస్థితి చాలా బాగుంది. నన్ను సినిమాలో పెట్టుకోవడం వల్ల సినిమాకి ప్లస్ అవుతుందని దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నారు. దాంతో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.


రైట్ రైట్ చిత్రంలోని మీ పాత్ర గురించి?
ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేసాను. ఇప్పటివరకూ విలన్ గా మాత్రమే కనిపించిన నేను 'రైట్ రైట్' సినిమాలో డ్రైవర్ పాత్రలో కనిపిస్తాను. ఇది పాజిటివ్ రోల్. ఇప్పటివరకూ నాలోని విలనిజం చూసిన ఆడియన్స్ సెంటిమెంట్, ఎమోషన్స్ ఉన్న పాత్రలో చూస్తారు. నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించే పాత్ర ఇది. ఇసకోటా నుండి గవిటీకి బస్సు నడిపే డ్రైవర్ పాత్ర. సాధారణంగా సిటీ నుండి విలేజ్ కు వెళ్లే బస్ డ్రైవర్, కండెక్టర్ అక్కడే రాత్రి స్టే చేసి తర్వాత పొద్దున్నే తిరుగు ప్రయాణం చేస్తుంటారు. అందువల్ల అక్కడి పల్లె ప్రజలతో మంచి సంబంధాలుంటాయి. అలాగే అక్కడి ప్రజలతో సత్సంబంధాలుండే పాత్రలో కనపడతాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతాను.


రైట్ రైట్ మలయాళ చిత్రానికి రీమేక్ కదా?
అవునండి. ఆ సినిమా చూసాను. చాలా బాగుంది. కొన్ని మార్పులు కూడా చేసారు. మలయాళ వెర్షన్ లో కంటే నా పాత్రను బెటర్ గా డిజైన్ చేసారు. ఈ చిత్రంలో డ్యాన్సులు కూడా చేసాను.


డైరెక్టర్ మను గురించి?
డైరెక్టర్ మను దృశ్యం చిత్రంతో సహా పలు చిత్రాలకు కో డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రతి రోజు నా పాత్రకు సంబంధించి ముందురోజునే ఏ సన్నివేశాలు చేయాలి, ఎలా చేయాలని చెప్పేవారు. చాలా టాలెంటెడ్ పర్సన్. విలక్షణమైన పాత్ర కావడంతో బాడీలాంగ్వేజ్ లో మార్పు చూపించాలి. కాబట్టి డైరెక్టర్ మనుగారితో, ఎం.ఎస్.రాజుగారితో బాగా డిస్కస్ చేసేవాడిని. వారి సలహాలు, సూచనలు బాగా హెల్ప్ అయ్యాయి.


హీరో సుమంత్ అశ్విన్ గురించి చెప్పండి?
ఈ సినిమా తోనే సుమంత్ అశ్విన్ తో నాకు పరిచయం ఏర్పడింది. తను నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. అలా రావడానికి కారణం సుమంత్. సీన్ చిత్రీకరణ ముందు ఎలా చేస్తే బాగుంటుందో డిస్కస్ చేసేవాళ్లం. దాంతో మా సీన్స్ బాగా వచ్చాయి. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.


తదుపరి చిత్రాలు?
ఆక్సిజన్ లో టిపికల్ విలన్ గా కనిపిస్తాను. అలాగే అవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి, కాళకేయ వర్సెస్ కాట్రవల్లీ సినిమాలు చేస్తున్నాను. మలయాళంలో మోహన్ లాల్ గారితో కలిసి సినిమా చేస్తున్నాను. అలాగే కన్నడంలో మూడు సినిమాలు చేస్తున్నాను. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాను. హ్యాపీగా ఉంది. బాహుబలి నాకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చింది. సినిమా విడుదల సమయంలో చాలా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగినప్పుడు అక్కడ ఉన్న విదేశీయులు చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. విదేశీయులు కూడా నా నటనను మెచ్చుకోవడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంతకంటే ఇంకేం కావాలి అనిపించింది అంటూ ఇంటర్య్వూకి ముగింపు పలికారు ప్రభాకర్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !