View

బాలరాజు నా గౌరవం పెంచాడు: ప్రకాశ్ రాజ్

Saturday,October04th,2014, 04:10 PM

రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 1న విడుదలై ప్రేక్షకాదరణతో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తాతయ్య బాలరాజు పాత్రను ప్రకాష్ రాజ్ పోషించారు. ఈ పాత్ర ద్వారా ప్రేక్షకుల మనసులను మరోసారి కొల్లగొట్టిన ప్రకాశ్ రాజ్ ఈ రోజు (4.10.2014) మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఈ సినిమా విజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఆ విశేషాలు ఈ విధంగా...

'గోవిందుడు అందరివాడేలే' సక్సెస్ ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
ఈ సినిమా విజయం నాకు రెండు విధాలుగా ఆనందాన్ని కలుగజేసింది. కృష్ణవంశీ హిట్ కొట్టాలని కోరుకునే వ్యక్తుల్లో నేనొకడిని. ఈ సినిమా కృష్ణవంశీకి మంచి విజయం సాధించింది పెట్టింది. ఆ రకంగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. కృష్ణవంశీకి విజయం తెచ్చి పెట్టిన సినిమాలో నేను నటించడం మరింత ఆనందాన్ని కలుగజేస్తోంది.

ఈ సినిమా విజయం సాధిస్తుందని ముందే ఊహించారా?
ఈ సినిమా కథని కృష్ణవంశీ నా దగ్గర చెప్పగానే, ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పాను. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలను కళ్లకు కట్టినట్టు చూపించడంలో కృష్ణవంశీ దిట్ట. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని ముందే ఊహించాను.

కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే సినిమాల్లో మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తోంది. దీని పట్ల మీ ఫీలింగ్?
కృష్ణవంశీ చెప్పే కథలు, క్రియేట్ చేసే పాత్రలు నాకు బాగా కనెక్ట్ అవుతాయి. తను నా పాత్ర గురించి చెప్పేటప్పుడే... గెటప్ ఎలా ఉండాలి, మాట తీరు ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలనే దానిపై ఓ అవగాహన వచ్చేస్తుంది. ఇక లొకేషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత నా పద్ధతిలో నేను నటిస్తాను. కానీ తనకు కావాల్సింది రాబట్టుకోవడం దర్శకుడి బాధ్యత. తనకు ఆర్టిస్ట్ నుంచి ఏం కావాలో తీసుకోవడం వంద శాతం తెలిసిన డైరెక్టర్ కృష్ణవంశీ.  నాలోని నటుడిని పూర్తిగా వాడుకుంటాడు. అది నాకు చాలా ప్లస్ అవుతుంది. అందుకే కృష్ణవంశీ సినిమాల్లోని నా పాత్రలకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తోంది.

ఈ సినిమాలో మిమ్మల్ని ఆకట్టుకున్న సన్నివేశం?
ఈ సినిమా నా మనసుకు ఎంతో హాయిని కలిగించింది. ప్రతి సన్నివేశాన్ని నేను ఎంజాయ్ చేసాను. బాలరాజు పాత్రలో ఒదిగిపోయాను. ఈ పాత్ర నాకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

బాలరాజు పాత్ర కోసం ముందు రాజ్ కిరణ్ ని తీసుకున్నారు? ఆ తర్వాత మిమ్మల్ని రీ ప్లేస్ చేసారు. ఎలా అనిపించింది?
ఏ సినిమాలో అయినా నటుడిని మార్చడమనేది దర్శక, నిర్మాతలకు సంబంధించిన విషయం. బాలరాజు పాత్ర కోసం రాజ్ కిరణ్ ని తీసుకున్నారు. కొంత షూట్ చేసిన అనంతరం ఆ పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా లేదు... నేటివిటీ మిస్ అవుతుందని చిరంజీవిగారు, కృష్ణవంశీగారు భావించడంతో నన్ను తీసుకున్నారు. అంతే తప్ప... వేరే ఎలాంటి ఆలోచన లేదు.


చరణ్ గురించి చెప్పండి?
చిరంజీవి అన్నయ్యతో నాది 20యేళ్ల అనుబంధం. చరణ్ చిన్నప్పట్నుంచి నాకు తెలుసు. చరణ్ నటించింది 8 సినిమాలు మాత్రమే. కానీ తన మెచ్యుర్టీ చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. కథకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఓ హీరోకి ఉండాల్సిన మంచి లక్షణం అది. సినిమా సక్సెస్ లో అందరికీ భాగం ఉందని నమ్మే వ్యక్తి చరణ్. తను నాకు ఓ బిడ్డలాంటి వాడు.

మీపై చిత్రీకరించిన 'నీలి రంగు చీరలోనా..' పాట విశేషాదరణ పొందుతోంది? దీని పట్ల మీ ఫీలింగ్?
ఈ సినిమా కథకు చాలా ఇంపార్టెంట్ అయిన పాట ఇది. ఈ పాటలోనే కృష్ణవంశీ ఈ కథ మొత్తాన్ని చెప్పేసాడు. ఈ పాట నా, జయసుధ పాత్రతో మొదలవుతుంది. ఆ తర్వాత మొత్తం కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే అందమైన పాట.


మీకు, కృష్ణవంశీకీ మధ్య  విభేదాలు ఉన్నాయి కదా? మరి వాటిని ఎలా పరిష్కరించుకున్నారు?
నేను, కృష్ణవంశీ ఇద్దరం చాలా స్ట్రాంగ్ పర్సన్స్. మాలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు చాలా చర్చలు జరుగుతాయి. వాటి వల్ల కొన్నిగొడవలు కూడా వస్తాయి. ఆ గొడవల్లో కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. మళ్లీ మాట్లాడుకుని మా గొడవలకు ఫుల్ స్టాప్  పెట్టేస్తాం. గొడవపడే వాళ్లకి పరిష్కరించుకోవడం కూడా తెలిస్తే, ఆ గొడవలు ఇట్టే క్లియర్ అయిపోతాయి. నేను కృష్ణవంశీని ద్వేషించడం కంటే ఎక్కువ ప్రేమిస్తాను. మా ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !