View

నేను డాన్ చెల్లెల్ని: రకుల్ ప్రీత్ సింగ్

Saturday,September20th,2014, 04:07 AM

కన్నడ చిత్రం 'గిల్లి' ద్వారా హీరోయిన్ à°—à°¾ à°°à°‚à°— ప్రవేశం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. à°† తర్వాత 'కెరటం' చిత్రం ద్వారా టాలీవుడ్ à°•à°¿ పరిచయం అయ్యింది. à°† సినిమా ఫ్లాప్ అవ్వడంతో టాలీవుడ్ లో ఆమెకు వెంటవెంటనే అవకాశాలు రాలేదు.  à°•à°¾à°¨à±€ తమిళంలో 'తడయర తాక్క', 'పుస్తగం'  à°šà°¿à°¤à±à°°à°¾à°²à± చేసింది. హిందీలో చేసిన 'యారియాన్' రకుల్ à°•à°¿ మంచి గుర్తింపు తెచ్చింది. అనంతరం తెలుగులో చేసిన రెండో చిత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' రకుల్ కెరీర్ ని మంచి మలుపు తిప్పింది. à°ˆ సినిమాలో అందం, అభినయం పరంగా రకుల్ మంచి మార్కులు కొట్టేసింది. à°ˆ ఒక్క విజయంతో ప్రస్తుతం రకుల్ చేతిలో à°…à°° డజను సినిమాలు ఉన్నాయి. అందులో à°“ చిత్రం గోపీచంద్ సరసన తను నటించిన 'లౌక్యం'. à°ˆ చిత్రం à°ˆ నెల 26à°¨ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా à°ˆ సినిమా గురించి, తను చేస్తున్న సినిమాల గురించి రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో ముచ్చటించింది. à°† విశేషాలు à°ˆ విధంగా...

'లౌక్యం'లో మీరు చేసిన పాత్ర గురించి?

ఇందులో నా పాత్ర పేరు చంద్రకళ. నేను ఓ డాన్ చెల్లెలిని. నాది బబ్లి అండ్ ఎనర్జిటిక్ క్యారెక్టర్. ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం చేసాను. ఇందులో కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. కుటుంబం అందరూ కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది.

ఈ చిత్రబృందం గురించి?

టీమ్ గురించి చెప్పాలంటే... భవ్య ఆనంద్ ప్రసాద్ గారు, అన్నే రవి గారు, శ్రీవాస్ గారికి ముందుగా థ్యాంక్స్ చెబుతున్నాను. నన్ను à°ˆ సినిమాలో సెలెక్ట్ చేసుకుని à°“ మంచి పాత్ర చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. శ్రీవాస్ గారు  à°ªà°°à± ఫెక్ట్ డైరెక్టర్. ఆర్టిస్టుల నుంచి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. à°ˆ చిత్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు.

గోపీచంద్ సరసన నటించడం ఎలా అనిపించింది?

గోపీచంద్ అమేజింగ్ కో-స్టార్. తన దగ్గర్నుంచి చాలా నేర్చుకోవచ్చు. కో-ఆర్టిస్ట్ లను బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యేసరికి ఈ టీమ్ అంతా నా ఫ్యామిలీ లా అయిపోయింది.

'లౌక్యం'లో మీకు బాగా నచ్చిన పాట?

అనూప్ రూబెన్స్ నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన ఈ సినిమాకి సంగీతం అందించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ట్యూన్స్ అన్నీ బాగుంటాయి. పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. మెలోడి, రొమాంటిక్... ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న సాంగ్స్ ఇచ్చారు. ఈ ఆల్బమ్ లో నాకు నచ్చినవి 'సూడు సూడు...', 'పింక్ లిప్స్' పాటలు. మిగతావి కూడా చాలా బాగుంటాయి.

ఈ చిత్రంలో బ్రహ్మానందం కాంబినేషన్లో నటించడం గురించి?

బ్రహ్మానందం గారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేసాను. ఆయనలాంటి సీనియర్ తో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన సహకారంతోనే మా కాంబినేషన్ సీన్స్ అన్నీ బాగా చేయగలిగాను. స్ర్కీన్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందంగారు, ఆఫ్ స్క్రీన్ లో చాలా సీరియస్ గా ఉంటారు. ఎప్పుడూ తను చేస్తున్న పాత్ర గురించి ఆలోచిస్తుంటారు. కెమెరా ముందుకు రాగానే ఆయనను ఆపడం ఎవరి తరం కాదు... తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించేస్తారు. ఆయన దగ్గర నుంచి మాలాంటి వారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కామెడీ టైమింగ్, సిట్యువేషన్ కి తగ్గట్టు స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వడం బ్రహ్మానందంగారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. ఈ సినిమాలో బ్రహ్మానందంగారిది చాలా ఇంపార్టెంట్ రోల్. ప్రేక్షకులు ఆయన పాత్రను బాగా ఎంజాయ్ చేస్తారు.

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు కదా.. ఎలా ఉంది?

చాలా ఆనందంగా ఉందండి.  à°¡à±‡ అండ్ నైట్ మూడు సినిమాల కోసం వర్క్ చేస్తున్నాను. వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు హిందీ చిత్రం షూటింగ్ నిమిత్తం సిమ్లా వెళ్లబోతున్నాను. à°—à°¤ పది రోజుల నుంచి 'పండుగ చేస్కో' షూటింగ్ తో బిజీగా ఉన్నాను. అంతకుముందు మంచు మనోజ్ తో కలిసి నేను చేస్తున్న 'కరెంట్ తీగ' చిత్రం షూటింగ్ చేసాను. 'కరెంట్ తీగ', 'పండుగ చేస్కో' చిత్రాల్లో నా పాత్రలు చాలా బాగుంటాయి. 'కరెంట్ తీగ' లో  à°¨à°¾à°¦à°¿ ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ పాత్ర. హైస్కూల్ స్టూడెంట్ ని. à°ˆ పాత్ర చాలా బాగుంటుంది. 'పండుగ చేస్కో' లో చెట్టులతో మాట్లాడే క్యారెక్టర్ నాది. చెట్లకు లైఫ్ ఉందని భావించే పాత్ర. అందుకని వాటితో మాట్లాడుతుంటాను. ప్రేక్షకులు à°ˆ క్యారెక్టర్ ని బాగా ఎంజాయ్ చేస్తారు.

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'  à°®à±€ కెరీర్ à°•à°¿ మంచి టర్నింగ్ అవుతుందని ఊహించారా?

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రం చేసేటప్పుడు, à°† సినిమా కథపై చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. మంచి హిట్ అవుతుందని నమ్మాను. అనుకున్నట్టుగానే జరిగింది. అందులో నేను 'ప్రార్థన' అనే పాత్ర చేసాను. à°ˆ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. à°† సినిమా తర్వాత నాకు ఐదు నెలలు గ్యాప్ వచ్చింది. à°ˆ ఐదు నెలలు గ్యాప్ నన్ను చాలా టెన్షన్ కు గురి చేసింది. కానీ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' నా కెరియర్ à°•à°¿ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.  à°† తర్వాత నేను కమిట్ అయిన సినిమా 'లౌక్యం'. à°ˆ సినిమా చేస్తున్నప్పుడే  à°µà°°à±à°¸à°—à°¾ సినిమాలు కమిట్ అయ్యాను. అన్నీ మంచి సినిమాలే. ఒక్క రోజు షూటింగ్ లేకపోయినా నేను డల్ అయిపోతాను. వర్క్ అంటే నాకు à°…à°‚à°¤ ఇష్టం. అందుకే ఇన్ని సినిమాలు అంగీకరించినా, కూల్ à°—à°¾ సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాను.

మీ ప్రాధాన్యం దక్షిణాది చిత్రాలకా... ఉత్తరాదికా?

టాలీవుడ్, బాలీవుడ్... రెండూ ఒకటే...ఏ భాషలో సినిమా చేస్తున్నాను అనేది ముఖ్యం కాదు. ఏ భాషలో సినిమా చేసినా సిన్సియర్ గా కృషి చేస్తాను. కమిటెడ్ గా ఉండి నేను అంగీకరించిన ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాను. కాబట్టి... బాలీవుడ్, టాలీవుడ్. కోలీవుడ్ అనే డిఫరెన్స్ నాకుండదు.

హిందీలో అంగీకరించిన చిత్రం గురించి?

షోలే' చిత్రదర్శకుడు రమేష్ సిప్పి దర్శకత్వంలో à°“ సినిమా అంగీకరించాను. రాజ్ కుమార్ రావు హీరోగా à°ˆ చిత్రం రూపొందనుంది. ఇందులో డ్రీమ్ గర్ల్ హేమమాలిని à°•à°¿ కూతురిగా నటించబోతున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. à°ˆ సినిమా షూటింగ్ కోసమే సిమ్లా వెళ్లబోతున్నాను. à°ˆ షూటింగ్ కోసం ఎగ్జయిటింగ్ à°—à°¾ ఎదురుచూస్తున్నాను. నేను చేసిన  à°Žà°¯à°¿à°°à± టెల్ యాడ్ చూసి, à°ˆ అవకాశం ఇచ్చారు.

మీ చిత్రాల గురించి కాకుండా ఇతర చిత్రాలపై కూడా దృష్టి పెడతారా?

నేను చిత్రరంగంలో ఉన్నాను కాబట్టి... ఇండ్రస్టీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకుంటాను. శుక్రవారం ఓ సినిమా విడుదలవుతోందంటే... ఆ సినిమా రిజల్ట్ గురించి అడిగి తెలుసుకుంటాను. అది నా బాధ్యతగా ఫీలవుతాను.

కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతున్నారు.. పూర్తిగా ఎప్పుడు మాట్లాడతారు?

నా తొలి సినిమా నుంచి తెలుగు మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కొంతమేరకు బాగానే మాట్లాడుతున్నాను. ముందు ముందు ఇంకా బాగా తెలుగు మాట్లాడతాను.

Rakul preeth singh Speaks about Loukhyam



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !