View

50శాతం నా పర్సనల్ ఎక్స్ పీరియన్స్ తోనే '365 Days' - రాంగోపాల్ వర్మ

Wednesday,May06th,2015, 12:23 PM

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన 25యేళ్ల కెరియర్ లో ఎన్నో ప్రయోగాలు చేసారు. సౌండ్ తో రకరకాల ప్రయోగాలు చేసి ప్రేక్షకులను అబ్బురపరిచిన రాంగోపాల్ వర్మ, కొన్ని పిచ్చి థాట్స్ తో ప్రేక్షకులను విసిగించారు కూడా. అయినా సరే రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా నందు, అనైక సోఠి జంటగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో డి.వి.క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రం '365 Days'. హారర్, థ్రిల్లర్ జోనర్స్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న రామూ ట్రెండ్ మార్చి రొమాన్స్ జోనర్ లో '365 Days' చిత్రాన్ని చేసారు. రాంగోపాల్ వర్మ కెరియర్ లోనే తొలిసారి ఈ చిత్రానికి 'యు' సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మతో జరిపిన ఇంటర్య్వూ మీ కోసం...

ముందుగా ఈ సినిమా కథ గురించి చెప్పండి?
ఓ జంట ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమా స్ర్కీన్ ప్లే ని రూపొందించడం జరిగింది. ఈ సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు ఉండవు. ఈ సినిమాలో క్రైమ్ లేదు. పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు చాలాకాలం కలిసి ఉండటం అనేది చాలా కష్టం. వారి బ్రేక్ అప్ కి సిల్లీ రీజన్స్ ఉండొచ్చు. కానీ చాలా నిజం మాత్రం ఉంటుంది. ఆ పాయింట్ ని తీసుకునే 365 Days సినిమా చేసాను. ఈ సినిమా నాకు చాలా స్పెషల్.

'365 Days' టైటిల్ వెరైటీగా ఉంది...ఈ టైటిల్ పెట్టడానికి కారణం?
పెళ్లి జరిగిన యేడాది తర్వాతే అసలైన జీవితం ఆరంభమవుతుందనేది నా ఫీలింగ్. ఓ యేడాది దాటిన తర్వాతే భార్యభర్తల అసలు సిసలైన స్వరూపాలు బయటపడతాయి. అప్పుడే ప్రాబ్లమ్స్ ఆరంభమవుతాయి. అలాంటి ఓ జంట కథే '365 Days'. అందుకే ఈ టైటిల్ ని పెట్టడం జరిగింది.

పెళ్లి చేసుకోవడం తప్పంటారా?
పెళ్లి గురించి స్టేట్ మెంట్ ఇవ్వడానికి నేనెవ్వరిని. నేను చూసిన కొన్ని ఇన్సిడెన్స్ ని, సొసైటీలో ఈ రోజు జరుగుతున్న కొన్ని సంఘటనలను, పెళ్లి తర్వాత కొన్ని రిలేషన్ షిప్స్ ఎలా ఉంటున్నాయనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది.

మీ స్వీయ అనుభవం కూడా ఈ సినిమాకి ఉపయోగపడిందా?
యాభై శాతం సినిమా నా పర్సనల్ ఎక్స్ పీరియన్స్ తో చేసిందే. ఇక కొన్ని ప్రాబ్లమ్స్ కి ప్రతి వ్యక్తి ఫీలయ్యే విధానం, వారి ఎమోషన్స్ అన్నీ ఒకటిగానే ఉంటాయని నా అభిప్రాయం. విడాకులు తీసుకోవడం, విడిగా ఉండటం, విడిపోయి వేరే వేరే రిలేషిన్ షిప్స్ కి కనెక్ట అవ్వడంలాంటివి ఓ వ్యక్తి జీవితానికి సంబంధించినవి మాత్రమే కాదు... చాలామంది జీవితాల్లో, సొసైటీలో జరుగుతున్నవే. వాటి ఆధారంగా కొన్ని సన్నివేశాలను అల్లుకోవడం జరిగింది.

ఈ సినిమా ఏ వర్గానికి కనెక్ట్ అవుతుందనుకుంటున్నారు?
పెళ్లయిన వారు, పెళ్లి కావాల్సిన వారు, పెళ్లి చేసుకుని విడిపోయినవారు... ఎవరికైనా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. ఈ సినిమాలో క్రైమ్ లేదు. నా కెరియర్ లో 'యు' సర్టిఫికేట్ పొందిన సినిమా. కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

తొలిసారి 'యు' సర్టిఫికేట్ అందుకోవడం ఎలా ఉంది?
నాకే కొత్తగా ఉంది. నిజానికి 'ఎ' సర్టిఫికేట్ వచ్చినా నాకేం పెద్ద పట్టింపు లేదు. క్రైమ్, హారర్ జోనర్ సినిమాలు చేసాను. ఇప్పుడు రొమాంటిక్ జోనర్ చేసాను.

మీరు ఎప్పుడో పెళ్లి బంధం నుంచి బయటికి వచ్చేసారు? అప్పట్లో మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? ఇప్పుడు ఏం ఫీలవుతున్నారు?
అప్పట్లో నేను నా గురించి మాత్రమే ఆలోచించేవాడిని. నా భార్య ఏం ఆలోచిస్తుందానే విషయాన్ని అసలు పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు అలాలేను.

అప్పట్లో నా భార్య ఏం ఆలోచించి ఉంటుంది... నేనెంత కరెక్ట్ అని అనుకునేవాడినో, తనూ అంతే కరెక్ట్ అని ఇప్పుడు తెలుసుకున్నాను. à°®à±€à°²à±‹ బాగా మార్పు కనిపిస్తోంది?
నేను ఛండాలమైన మనిషిని అని నా ఫీలింగ్. ఇప్పుడిప్పుడే మనిషిలా మారుతున్నాను. నా అభిప్రాయాలు, ఆలోచనలలో మార్పు వచ్చిన మాట వాస్తవమే. అనుభవం మీదే ఇవన్ని తెలుస్తాయనుకుంటున్నాను.

భవిష్యత్తులో పెళ్లిళ్లు ఎలా ఉంటాయనుకుంటున్నారు?
ఎవరికి వారు పర్సనల్ జోన్ ని ఏర్పర్చుకుని జీవితాలను గడపడానికి ఇష్టపడుతున్నారు. వారి పర్సనల్ లైఫ్ లోకి లైఫ్ పార్టనర్ వచ్చినా భరించలేకపోతున్నారు. ఒకరికోసం ఒకరు మారడం, అడ్జెస్ట్ అయ్యి బ్రతకడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ విషయాలన్నింటిలోనూ పూర్తి అవగాహనతో ఒకరి స్వేచ్ఛకు మరొకరు భంగం కలిగించకుండా ఉండేంతవరకూ వివాహ బంధం పటిష్టంగానే ఉంటుంది. లేని పక్షంలో మాత్రం రిలేషన్ షిప్స్ నిలబడవు.

సహజీవనం గురించి?
ఇప్పుడిప్పుడే సహజీవనం అనే కాన్సెఫ్ట్ పెరిగిపోతోంది. విదేశాల్లోని ఈ కల్చర్, ఇండియా వరకూ కూడా వచ్చేసింది. త్వరలోనే వీకెండ్ రిలేషన్స్ లాంటివి కూడా వచ్చేస్తాయి. నన్నడిగితే అవర్లీ రిలేషన్ షిప్ కోరుకుంటాను.

పెద్ద బడ్జెట్ సినిమాలు మానేసినట్టున్నారు?
అలాంటిదేమీ లేదు. నాకు పెద్ద, చిన్నా అనే తేడా లేదు. కాన్సెఫ్ట్ ని బట్టి బడ్జెట్. పెట్టిన బడ్జెట్ తిరిగిరావడం ఇంతవరకూ మాత్రమే ఆలోచిస్తాను. సక్సెస్ ఫుల్ సినిమా ఏదైనా పెద్ద సినిమానే అని నా ఫీలింగ్.

మీ తదుపరి ప్రాజెక్ట్?
'కిల్లింగ్ వీరప్పన్' అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ ని ప్లాన్ చేస్తున్నాను. ఈ సినిమాని సింఫుల్ బడ్జెట్ తో చేయలేము. కథకు సరిపడా బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి కథను బట్టే బడ్జెట్ కానీ, బడ్జెట్ కోసం సినిమా తీయాలనే ఆలోచనలో నేనుండను అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు రాంగోపాల్ వర్మ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !