View

మహేష్, పవన్ ఎన్టీఆర్ నుంచి ఎన్నో నేర్చుకున్నాను - రవివర్మ

Wednesday,March25th,2015, 03:24 PM

'వెన్నెల', 'బొమ్మరిల్లు', 'రాఖీ', 'సైనికుడు' తాజాగా 'తుంగభద్ర' ఇలా దాదాపు 26 సినిమాల్లో సపోర్టింగ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవివర్మ'కాలింగ్ బెల్' చిత్రంలో లీడ్ రోల్ చేసారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపధ్యంలో రవివర్మ మీడియాతో సమావేశమై, తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఈ విధంగా...

చిత్ర రంగంలోకి ఎలా అడుగుపెట్టారు?
దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన 'వెన్నెల' చిత్రం ద్వారా నేను నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాను. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో ఉన్నాను. అప్పుడే నాకీ సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమాలోని నా పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. బొమ్మరిల్లు, రాఖీ, సైనికుడు, ఇంకోసారి, విరోధి, జల్సా... ఇలా వరుసగా సినిమాలు చేసాను. దాదాపు 26సినిమాల్లో నటించాను. టాలీవుడ్ నన్ను బాగా ఆదరిస్తోంది.

ఇన్ని సినిమాల్లో నటించిన మీకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన పాత్రల గురించి చెప్పండి?
వెన్నెల, రాఖీ, విరోధి, జల్సా సినిమాల్లోని పాత్రలు నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. నటుడిగా నాకంటూ ఓ స్థానాన్ని కల్పించాయి. ఇటీవల విడుదలైన 'తుంగభద్ర' చిత్రంలో కూడా చాలా మంచి పాత్ర చేసాను. ఈ సినిమా చూసిన వారు చాలామంది నన్ను అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.

నటనలో శిక్షణ తీసుకున్నారా?
న్యూయార్క్ లో యాక్టింగ్ కోర్స్ చేయాలనే ఆలోచన ఉండేది. కానీ అక్కడ కోర్స్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఆ ఆలోచనను విరమించుకున్నాను. సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఆ కోరిక అలాగే ఉండిపోయింది. అందుకే ఈ మధ్యనే న్యూయార్క్ లో యాక్టింగ్ లో క్రాష్ కోర్స్ పూర్తి చేసాను.

నటుడు అవ్వాలనుకునే ప్రతివారు నటనతో పాటు డ్యాన్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నారు కదా? మరి మీరు డ్యాన్స్ నేర్చుకోలేదా?
స్కూల్ డేస్ నుంచి బాగా సినిమాలు చూసేవాడిని. హీరోలు డ్యాన్స్ చేస్తుంటే నేను కళ్లప్పగించి చూసేవాడిని. డ్యాన్స్ మీద చాలా ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే కథక్ నేర్చుకున్నాను.

26సినిమాలు చేసిన మీకు, మంచి బ్రేక్ రాలేదనే ఫీలింగ్ ఉందా?
బ్రేక్ వచ్చిందా? రాలేదా అంటే నేనేమీ చెప్పలేను. ఎందుకంటే నటుడిగా నేను ఎప్పుడూ సినిమాలు లేక ఖాళీగా లేను. ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూ బిజీగానే ఉన్నాను. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టే కదా నేను ఇంతవరకూ రాగలిగాను. కాబట్టి ఎలాంటి అసంతృప్తి లేదు.

'కాలింగ్ బెల్' లో లీడ్ రోల్ చేసారు కదా? దాని గురించి చెప్పండి?
'కాలింగ్ బెల్' చాలా మంచి సినిమా. ఇటీవల విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. నాకు కూడా మంచి పేరును తెచ్చి పెట్టింది. ఈ సినిమా రిజల్ట్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఆ రకంగా ఈ యేడాది నాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి.

'కాలింగ్ బెల్' లో లీడ్ రోల్ చేసారు కదా? ఇకముందు లీడ్ రోల్స్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారా?
లీడ్ రోల్స్ మాత్రమే చేయాలనే ఆలోచన లేదు. నేను చేసే పాత్ర బాగుండాలి. ఆ పాత్ర సినిమాలో కీ రోల్ అవుతుందనుకుంటే, ఆ సినిమాని అసలు వదులుకోను. కాబట్టి లీడ్ రోల్, సపోర్టింగ్ రోల్ ఏదైనా చేయడానికి సిద్ధమే.

స్టార్ హీరోలతో నటించారు కదా... వారి గురించి చెప్పండి?
ఎన్టీఆర్ 'రాఖీ'లో నటించాను. పవన్ కళ్యాణ్ 'జల్సా' చిత్రంలో చేసాను. మహేష్ బాబుతో 'సైనికుడు' చిత్రంలో కలిసి నటించాను. ఇప్పుడు 'శ్రీమంతుడు' చేస్తున్నాను. వీరందరి దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. లొకేషన్ లో సరదాగా మాట్లాడుకుంటాం. హీరోలందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.

ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు?
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శ్రీమంతుడు' చిత్రంలో నటిస్తున్నాను. అందులో చాలా మంచి పాత్ర చేస్తున్నాను. 'అసుర', 'క్రిమినల్స్' చిత్రాల్లో కూడా నా పాత్రలు బాగుంటాయి. ఈ యేడాది నేను సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన 7సినిమాలు విడుదలకానున్నాయి. అన్నింటిల్లోనూ మంచి పాత్రలే చేసాను. ఈ యేడాది నటుడిగా నా కెరియర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !