View

మంచి పాత్ర వస్తే మళ్లీ నటిస్తా: రేణూ దేశాయ్

Monday,October13th,2014, 02:22 PM

''పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శం. ఆ ఆదర్శమే నన్ను ముందుకు నడిపిస్తోంది'' అని చెప్పింది రేణూ దేశాయ్. 'బ్రది', 'జానీ'తో నటిగా తనను నిరూపించుకుని, పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది రేణు. ఆయన్నుంచి విడిపోయి, పుణేలో ఉంటున్న రేణు 'మంగళాష్టక్ వన్స్ మోర్' ద్వారా నిర్మాతగా మారింది. ఇప్పుడు 'ఇష్క్ వాలా లవ్'తో దర్శకురాలిగా కూడా తొలి అడుగు వేసింది రేణూ దేశాయ్. ఈ మరాఠీ చిత్రాన్ని తెలుగులో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (13.10.) హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు రేణూ దేశాయ్ ఈ విధంగా సమాధానాలిచ్చింది.

'ఇష్క్ వాలా లవ్' చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నానని పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పారా? అప్పుడాయన స్పందన ఏంటి?

ఈ సినిమా గురించి ఆయన దగ్గర చెప్పాను. ఎలాంటి సహాయం కావాలన్నా అడగమన్నారు. అయితే లక్కీగా సినిమా ఆరంభించినప్పట్నుంచి ముగిసే వరకూ ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదు.

మరి.. ఈ చిత్రాన్ని పవన్ చూశారా?

సినిమా చూడలేదు కానీ.. ట్రైలర్స్ చూశారు. ఆయనకు బాగా నచ్చాయి.

ఈ చిత్రం ఎలా ఉంటుంది?

ఈ చిత్రానికి కథ, దర్శకత్వం నేనే సమకూర్చాను. నిర్మాతను కూడా నేనే. ఇదొక సింపుల్ లవ్ స్టోరీ. వయసు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ కథ కనెక్ట్ అవుతుంది. చాలా సరదాగా సాగే సినిమా. అందరూ ఎంజాయ్ చేయొచ్చు.

ఇందులో మీ అబ్బాయి అఖీరాని నటింపజేయడానికి కారణం ఏంటి?

అఖీరాని నటింపజేయాలన్న ఆలోచన నాకు మొదట్లో లేదు. అనుకోకుండా జరిగింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉంది. దర్శకురాలిగా నా తొలి చిత్రంలో మా అబ్బాయి ఉంటే బాగుంటుందనే సెంటిమెంట్ తో తనని నటింపజేశాను. దర్శకురాలిగా నాకు, నటుడిగా అఖీరాకి ఇది తొలి చిత్రం అవుతుంది.

ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయాలనుకోవడానికి గల కారణం ఏంటి?

ఈ కథ ఏ భాషకైనా నప్పుతుంది. అందుకే తెలుగులో విడుదల చేయాలనుకున్నాను.

ముందు ఈ నెల 17న విడుదల చేయాలనుకున్నారు కదా.. ఇప్పుడా ఆలోచనను విరమించుకున్నట్లున్నారు?

అవును. సినిమా విడుదల వాయిదా వేయడానికి వైజాగ్ లో తుఫాను ఓ కారణం. ఈ నెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాను.

గతంలో నటించారు కదా.. ఇప్పుడేమైనా ఆ ఆలోచన ఉందా?

యాక్టింగ్ అంటే ఇప్పటికీ ఆసక్తి ఉంది. కానీ.. చక్కని కేరక్టర్, మంచి బేనర్ అయితేనే చేస్తా. నేను చేసే పాత్ర చాలా హుందాగా ఉండాలి. అలాంటి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తా.

మరి.. తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించే ఆలోచన ఉందా?

ప్రస్తుతానికైతే లేదు. ఓ హిందీ సినిమా చేయాలనుకుంటున్నా. గత ఏడాదిగా ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాను.

చాలా విరామం తర్వాత టాలీవుడ్ కి వచ్చారు. అది కూడా దర్శకురాలిగా.. ఎలా అనిపిస్తోంది?

చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. హైదరాబాద్ నాకు మెటర్నల్ హెమ్ లాంటిది. ఈ నగరంలో నాకు మర్చిపోలేని మంచి అనుభూతులున్నాయి.

Renu Desai Speaks about Pawan Kalyan



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !