View

'ఆషికి-2'కన్నా 'నీ జతగా నేనుండాలి' బాగుంటుంది - సచిన్

Wednesday,August06th,2014, 03:18 AM

''బాలీవుడ్ కి ధీటుగా తెలుగు పరిశ్రమ ఉంది'' అని చెప్పారు సచిన్. మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఓరేయ్ పండుగాడు చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఉత్తరాది యువకుడు కొంత విరామం తర్వాత తెలుగులో చేసిన చిత్రం 'నీ జతగా నేనుండాలి'. హిందీలో ఘనవిజయం సాధించిన 'ఆషికి-2'కి ఇది రీమేక్. జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ 7న సచిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంర్వ్యూ....

చాలా గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేశారు.. ఈ గ్యాప్ కి కారణం ఏంటి?

కావాలని తీసుకున్న విరామం కాదు. నేను ముందు కథానాయకుడైనది తెలుగులోనే. నేను చేసిన 'మౌనమేలనోయి' మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత చేసిన 'నిను చూడక నేనుండలేను', 'ఒరేయ్ పండుగాడు' కూడా నాకు హెల్ప్ అయ్యాయి. 'ఒరేయ్ పండుగాడు' తర్వాత హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాను. అక్కడ వరుసగా మూడు సినిమాలు చేయడంతో తెలుగులో గ్యాప్ వచ్చింది.

'ఆషికి -2'ని రీమేక్ చేయాలని ఎందుకు అనుకున్నారు?

ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఏ భాషకైనా ఈ కథ నప్పుతుంది. కొంత విరామం తర్వాత తెలుగులో సినిమా చేయాలనుకున్నప్పుడు ఓ మంచి లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందనిపించింది. అందుకే బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన 'ఆషికి -2' లవ్ స్టోరీ ని తెలుగులో చేయాలనుకున్నాను. తెలుగులో నేను చేసిన మూడు చిత్రాలూ ప్రేమకథలే. ఈ ప్రేమకథ వినూత్నంగా ఉంటుంది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.

తెలుగుకి అనుగుణంగా ఏమైనా మార్పులు చేశారా?

చేశాం.. కానీ, ఆ మార్పులు తెరపై చూస్తేనే బాగుంటుంది. 'ఆషికి-2' ప్రధాన ఇతివృత్తం అలానే ఉంటుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేశాం. క్లయిమాక్స్ లో వచ్చే మలుపు సినిమాకి కీలకంగా ఉంటుంది. నాకు తెలిసి 'ఆషికి-2' కన్నా ఈ చిత్రం బాగుంటుంది.

ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ సంస్థలో చేయడానికి కారణం ఏంటి?

'ఒరేయ్ పండు' సినిమాలో గణేష్ నటించారు. అప్పుడే ఆయనతో నాకు మంచి స్నేహం కుదిరింది. నేను హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత తెలుగుకి గ్యాప్ వచ్చినప్పుడు 'నువ్వు కెరీర్ ఆరంభించింది తెలుగులోనే కదా.. ఇక్కడ కూడా సినిమాలు చేస్తే బాగుంటుంది' అని ఆయన అన్నారు. తెలుగులో గణేష్ ఎంత సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసరో తెలిసిందే. అందుకే నా రీ-ఎంట్రీ చిత్రాన్ని తన బేనర్లోనే చేయాలనుకున్నాను.

'నీ జతగా నేనుండాలి'లో మీ పాత్ర గురించి చెప్పండి?

బేసిక్ à°—à°¾ రాక్ స్టార్ ని. à°† పాత్ర చేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ, à°ˆ పాత్ర ఎప్పుడూ మందు కొడుతూ ఉంటుంది. మందు కొట్టినట్లు నటించడం చిన్న విషయం కాదు. అలాగే హెవీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అవి చేయడానికి చాలా కష్టపడ్డాను.  à°† కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది.

ఈ చిత్రం హైలైట్స్ గురించి?

కథే మెయిన్ హైలైట్. నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గణేష్ ఏ విషయంలోనూ రాజీపడకుండా భారీ ఎత్తున ఈ సినిమా తీశారు. మంచి పాటలకు స్కోప్ ఉన్న కథ ఇది. పాటలన్నీ బాగా కుదిరాయి. సంగీతం ఓ ప్రధాన బలం. ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభిస్తోంది. పాటలకు చంద్రబోస్ రాసిన సాహిత్యం ఓ అదనపు ఆకర్షణ.

చిత్రదర్శకుడు జయరవీంద్ర టేకింగ్ ఎలా అనిపించింది?

ఈ సినిమాకి దర్శకుడిగా జయరవీంద్ర అయితేనే కరెక్ట్ అని గణేష్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'బంపర్ ఆఫర్' చూశాను. నాకు చాలా నచ్చింది. ఈ కథలో మార్పులు చేసిన తర్వాత జయ రవీంద్ర చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది. కథ బాగా చెప్పడమే కాదు.. దాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ని బాగా తీశారు. ఆ సీన్స్ లో ప్రేక్షకులు కదిలిపోవడం ఖాయం.

తదుపరి చిత్రాల గురించి?

'ఆషికి-2'ని తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నాను. ఇక వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. తెలుగులో ఒక హారర్ మూవీ, ఒక రొమాంటిక్ మూవీ చేయనున్నాను. అవి చర్చల దశలో ఉన్నాయి. ఇకనుంచి నేను ఏ సినిమా చేసిన తెలుగు, హిందీ భాషల్లో చేయాలనుకుంటున్నాను. అలాగే, త్వరలో 'థింక్ టాంక్' అనే సంస్థను ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ సంస్థపై ఆన్ లైన్ డిజిటల్ విధానంలో షార్ట్ ఫిలింస్ తీయాలనుకుంటున్నా. ఇంకా ఫుల్ లెంగ్త్ చిత్రాలు కూడా తీయాలనే ఆలోచన ఉంది.

Sachin Joshi Speaks about Nee Jathaga Nenundali



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !