View

ఆ ముగ్గురి వల్లే ఈ స్థాయిలో ఉన్నా - హీరో సాయిధరమ్ తేజ్

Tuesday,March24th,2015, 03:45 PM

''మా నాలుగేళ్ల కష్టం మీ (ప్రేక్షకులు) ముందుకు వస్తోంది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది. ఓ మంచి ప్రొడెక్ట్ ఇచ్చాం. దయచేసి అందరూ థియేటర్ కి వెళ్లి, ఈ చిత్రాన్ని చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు'' అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. బొమ్మరిల్లువారి పతాకంపై స్వీయ దర్శకత్వంలో వైవీయస్ చౌదరి రూపొందించిన చిత్రం 'రేయ్'. సాయిధరమ్ తేజ్ హీరోగా సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రతినాయికగా కథకు కీలకంగా నిలిచే పాత్రను శ్రద్ధాదాస్ చేయడం విశేషం. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ తో జరిపిన ఇంటర్వ్యూ...

'రేయ్' ప్రారంభమైన వైనం గురించి చెబుతారా?
చౌదరిగారు ఈ చిత్ర కథను మా మామయ్య చిరంజీవిగారి దగ్గర చెబితే ఆయనకు నచ్చి ఓకే అన్నారు. నేను మాత్రం కథ అడగలేదు. చౌదరిగారు ఎలా చెబితే అలా చేయాలని అనుకున్నాను. కానీ ఆయన కథ చెప్పారు. చాలా కొత్తగా ఉందనిపించింది.

ఇందులో మీ పాత్ర గురించి?
ఇందులో నేను కరేబియన్ బేస్డ్ యువకుడిగా నటించాను. వారి తీరుతెన్నులు మనలా ఉండవు. మనసులో ఏది ఉంటే అది చెప్పేయడం, గట్టిగా మాట్లాడటం వారి స్టైల్. చౌదరిగారు ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు సూట్ అవుతుందా అనుకున్నాను. కానీ కొత్తగా వచ్చే హీరోల మీద ఎలాంటి అంచనాలు ఉండవు కాబట్టి బాగుంటుందని ఆయన అన్నారు. నా పాత్ర ఎంత కొత్తగా ఉంటుందో ఈ సినిమా నేపధ్యం కూడా అంతే కొత్తగా ఉంటుంది. అందుకని ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది.

ఈ పాత్ర కోసం మీరేమైనా కసరత్తులు చేసారా?
కరేబియన్స్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలీదు. ఈ కథ చెప్పిన తర్వాత చౌదరిగారు క్రిస్ బ్రౌన్ కి సంబంధించిన మ్యూజిక్ వీడియోలు, విల్ స్మిత్ చిత్రాలు ఇచ్చారు. వాటిని చూసి బాడీ లాంగ్వేజ్ ని తెలుసుకోమన్నారు. అవి చూసి నాదైన శైలిలో నేను ఈ పాత్ర చేసాను.

మీ కుటుంబానికి చెందిన హీరోలందరూ బాగా డ్యాన్స్ చేస్తారు. మీ తొలి చిత్రంలోనే మీకు బాగా డ్యాన్స్ చేసే స్కోప్ దొరకడం పట్ల మీ ఫీలింగ్?
మామయ్యలు, చరణ్, బన్నీ అందరూ బాగా డ్యాన్స్ చేస్తారు. మా అమ్మగారు కూడా మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ఇచ్చిన స్టేజ్ షోలు చూస్తూ పెరిగాను. అందుకని డ్యాన్స్ మీద అవగాహన ఉంది. కానీ ఇది డ్యాన్స్ బేస్డ్ మూవీ కాబట్టి షూటింగ్ ప్రారంభించే నాలుగు నెలల ముందే డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టేసాను. అలాగే ప్రతి సాంగ్ తీసేముందు స్టెప్స్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. లొకేషన్ లో కొత్త స్టెప్స్ ఇస్తే అప్పటికప్పుడు నేర్చుకుని చేసేవాడిని.

ఈ సినిమా కోసం మీరు బాగా కష్టపడి చేసిన పాట గురించి చెబుతారా?
సినిమాలో వచ్చే చివరి పాట కోసం చాలా కష్టపడ్డాను. ఆ పాటను ఓ సవాల్ లా తీసుకుని చేసాను. ఉదయం 8గంటలకు మొదలుపెట్టి, మర్నాడు ఉదయం 3.30వరకూ ఆ పాట చేసేవాళ్లం. 8గంటలకు రాగలుగుతావా అని చౌదరిగారు అడిగితే, ఇంటికి వెళ్లనని చెప్పి స్టూడియోలోనే పడుకునేవాడిని. దాదాపు 15రోజులు ఇదే వరస. ఈ పాట సినిమాకి హార్ట్ లాంటిది. అందుకే అంత కష్టపడ్డాను.

మీ ముగ్గురు మావయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లో మీకు ఎవరు ఆదర్శం?
ముగ్గురులోనూ ఆదర్శంగా తీసుకోదగ్గ ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అందుకని ఏ ఒక్కరి పేరో చెప్పలేను. నా జీవితానికి ఈ ముగ్గురూ ముఖ్యం.

మీ ముగ్గురు మావయ్యలతో గడిపిన క్షణాల గురించి?
నా స్కూల్ డేస్ లో స్పోర్ట్స్, పెయిటింగ్ వంటి యాక్టివిటీస్ ని నాగబాబు మావయ్య ఎంకరేజ్ చేసేవారు. అలాగే 8వ తరగతి నుంచి డిగ్రీ వరకూ చిరంజీవి మావయ్య అన్నీ చూసుకున్నారు. నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మావయ్య నా కెరియర్ ని చూసుకుంటున్నారు. ఈ ముగ్గురు వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను.

మీ మావయ్యల నుంచి మీరేం నేర్చుకున్నారు?
చిరంజీవి మావయ్య నుంచి క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వం నేర్చుకున్నాను. సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. నాగబాబు మావయ్య నుంచి ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, నిదానంగా ఉండటం నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ మావయ్య నుంచి ముక్కుసూటితనం, నిజాయితీ నేర్చుకున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !