View

వ్యాపారవేత్తతో నా పెళ్లా - సమంత

Monday,April13th,2015, 09:09 AM

''గత ఏడాది నా కెరీర్ లో జయాపజయాలు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయడంలేదనే విమర్శ వచ్చింది. ఈ ఏడాది అందుకు భిన్నంగా నా గురించి క్రిటిక్స్ అభినందిస్తూ రాస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే, ఈ ఏడాది చేస్తున్నవన్నీ మంచి పాత్రలే'' అని సమంత అన్నారు. అల్లు అర్జున్ సరసన సమంత నటించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఇక.. సమంతతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు తెలుసుకుందాం...

'సన్నాఫ్ సత్యమూర్తి' స్పందన ఎలా ఉంది?
మొదటి రోజు టాక్ విని, చాలా షాకయ్యాను. కొంతమంది బాగుందనీ, మరికొంతమంది బాగా లేదనీ అన్నారు. రివ్యూలు కూడా వ్యతిరేకంగానే వచ్చాయి, ఇదంతా ఊహించలేదు. దాంతో బాధ అనిపించింది. కానీ, మొదటి రోజు టాక్ కి భిన్నంగా రెండో రోజు వచ్చింది. మూడో రోజుకి బాగుందనే టాక్ వచ్చింది. ఇప్పుడు మంచి వసూళ్లు రాబడుతోంది.

ఇందులో డయాబెటిక్ గా నటించారు..?
మీరేంటి డయాబెటిక్ గా అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఎవరికైనా రకరకాల సమస్యలుంటాయి. ఏ అమ్మాయీ పర్ ఫెక్ట్ గా ఉండదు. ఏదో లోపం ఉంటుంది. రెండేళ్ల క్రితం నాకు లో షుగర్ ఉండేది. అంటే.,. డయాబెటిస్ ఉన్నట్లు కాదు. కానీ, అది కూడా చిన్న లోపమే కదా. ఈ చిత్రంలో హీరోయిన్ కి డయాబెటిస్ ఉంటుంది. ఈ పాత్ర లైటర్ వీన్ గా ఉంటుండంతో చాలా ఫన్నీగా, బాగుంటుంది.

అల్లు అర్జున్ సరసన నటించడం ఎలా అనిపించింది?
అల్లు అర్జున్ చాలా ఎనర్జిటిక్. ముఖ్యంగా తన కాస్ట్యూమ్స్ బాగుంటాయి. అందుకని ఒకవేళ కాస్ట్యూమ్స్ పరంగా కేర్ తీసుకోకతే తన ముందు పనిమనిషిలా కనిపించే అవకాశం ఉందనిపించింది. అందుకని, తను ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటున్నాడో అడిగి, తెలుసుకుని నా కాస్ట్యూమ్స్ కూడా బ్రహ్మాండంగా ఉండేట్లు చూసుకునేదాన్ని.

అల్లు అర్జున్ డాన్సులు కూడా బాగా చేస్తాడు కదా?
అవును. లక్కీగా నాకీ చిత్రంలో రిస్కీ డాన్స్ స్టెప్స్ లేవు. దాంతో తప్పించుకున్నాను. అల్లు అర్జున్ మంచి డాన్సర్. అది మాత్రమే కాదు.. వృత్తిని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. తన క్రమశిక్షణ చూసి, భలే అనిపించింది. మామూలుగా నేను డైలాగ్స్ ఉన్న సీన్ కి మాత్రమే ఎక్కువగా దృష్టి పెడతాను. డైలాగ్స్ లేని సీన్ ని లైట్ తీసుకుంటాను. కానీ, అల్లు అర్జున్ ఎలాంటి సీన్ అయినా చాలా డెడికేటెడ్ గా ఉంటాడు. తన నుంచి నేనది నేర్చుకున్నాను.

'అత్తారింటికి దారేది' తర్వాత మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడం గురించి?
యాక్చువల్ గా నేను త్రివిక్రమ్ కి అభిమాని. ఆయనతో సినిమా చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. తను నాకు దర్శకుడిగాకన్నా మంచి స్నేహితుడు అని చెప్పాలి. గురువు అంటే కూడా బాగుంటుందేమో. త్రివిక్రమ్ తో మళ్లీ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది.

ఈ చిత్రంలో నిత్యామీనన్, అదా శర్మలతో కలిసి నటించారు కదా.. వాళ్లతో మీ అనుబంధం?
సౌత్ లో నిత్యామీనన్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. తనంటే నాకు చాలా మర్యాద. ఇక అదా శర్మ ఫస్ట్ సీన్లో నటించినప్పుడు తన నటన చూసి ఆశ్చర్యపోయాను. అంత బాగా చేసింది. మంచి అమ్మాయి కూడా. అందుకే, తనకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.

ఇకముందు కూడా ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లున్న చిత్రాల్లో నటిస్తారా?
ప్రేక్షకులకు ఒక్క హీరోయిన్ సరిపోవడం లేదు కదా (నవ్వుతూ). వాళ్లు కోరుకుంటున్నారు కాబట్టి, ఇతర నాయికలతో కలిసి నటించడం నాకిష్టమే.

ట్విట్టర్లో మీరు చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి... మరి. ఇకనుంచి అలాంటి ట్వీట్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నారా?
అస్సలు అనుకోవడంలేదు. నా మనసులో ఏం అనిపిస్తే, అది బయటికి చెప్పేస్తా. నా గురించి బాగా తెలిసినవాళ్లకి ఆ విషయం తెలుసు. తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను.

మీ నడుము గురించి అలీ ఆ మధ్య చేసిన కామెంట్ మీకు కోపం తెప్పించిందా?
లేదు. ఎందుకంటే అలీ నాకు మంచి స్నేహితుడు. కామెడీ కోసమే తను అలా అన్నాడని నాకు తెలుసు. అందుకే 'ఎందుకిలా అన్నావు' అని కనీసం అలీకి ఫోన్ చేసి కూడా అడగలేదు.

చేతి మీద ఏదో గాయం కనిపిస్తోంది?
తమిళ సినిమా కోసం యాక్షన్ సీన్ చేసినప్పుడు అయిన చిన్న గాయం ఇది. ఇప్పటివరకు నేనింత కష్టమైన కారెక్టర్ చేయలేదు. విక్రమ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నేను యాక్షన్ సన్నివేశాలు కూడా చేస్తున్నాను. నాలో మరో కోణం చూపించే చిత్రం ఇది. అసలు మనం నటించగలుగుతామా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఈ చిత్రం ఒక సమాధానం అవుతుంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలవుతుంది.

ఈ ఏడాది తమిళ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లున్నారు?
అలా ఏం లేదు. అక్కడ మంచి పాత్రలు రావడంతో అంగీకరించాను. తెలుగులో కూడా సినిమాలున్నాయి. ఆ చిత్రాల షూటింగ్ ఆరంభమైన తర్వాత వివరాలు చెబుతా.

ఓ వ్యాపారవేత్తతో మీ పెళ్లి అనే వార్త వినిపించింది?
ఆ వ్యాపారవేత్త ఎవరో చెబితే.. పెళ్లి కొడుకుని వెతికే బాధ నాకు తప్పుతుంది (నవ్వుతూ). ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదు. ఇలాంటి వార్తలు ఎక్కణ్ణుంచి పుట్టుకొస్తాయో?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !