View

'రేయ్' అని పిలిచే టైప్ కాదు నేను - శ్రద్ధాదాస్

Sunday,March22nd,2015, 08:29 AM

''ఎప్పుడూ ఒకే రకం పాత్రలు చేస్తే నటిగా నాకు సంతృప్తి లభించకపోవడంతో పాటు ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేస్తాను. అందుకే, వెరైటీ రోల్స్ చేయడానికి ట్రై చేస్తుంటాను. 'రేయ్'లో చేసిన పాత్ర నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. నాకు తెలిసి ఈ చిత్రం తర్వాత నాకు శక్తిమంతమైన పాత్రలివ్వడానికి, నటనకు అవకాశం ఉన్న పాత్రకు చాన్స్ ఇవ్వడానికి దర్శకులు వెనకాడరు'' అంటున్నారు శ్రద్ధాదాస్. యలమంచిలి గీత సమర్పణలో స్వీయ దర్శకత్వంలో వైవీయస్ చౌదరి నిర్మించిన 'రేయ్' చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. సాయిధర్ తేజ్, శ్రద్ధాదాస్, సయామీ ఖేర్ ముఖ్య తారలుగా ఈ చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా శ్రద్ధాదాస్ తో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు ఈ విధంగా...

'రేయ్'లో మీ పాత్ర గురించి?
ఇందులో నేను మెక్సికన్ కి చెందిన పాప్ స్టార్ రోల్ చేశాను. కారెక్టర్ చాలా స్టయిలిష్ గా ఉంటుంది. విలనీ రోల్ అన్నమాట. పూర్థి స్థాయి విలన్ గా నేను నటించిన తొలి చిత్రం ఇది. పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో చాలా సంతృప్తి అనిపించింది.

పాప్ స్టార్ రోల్ కోసం ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నారా?
వైవీయస్ గారు నాకు హాలీవుడ్ స్టార్స్ జెన్నిఫర్ లోపెజ్, బియాన్సె నోల్స్, బ్రిట్నీ స్పియర్స్ వంటివారి వీడియోలు చూపించారు. వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూశాను. జెన్నిఫర్ లోపెజ్ ఫిజిక్ చాలా బాగుంటుంది. తనని దృష్టిలో పెట్టుకుని, నాదైన శైలిలో ఈ పాత్ర చేశాను.

ఈ పాత్రం కోసం బరువు తగ్గినట్లున్నారు?
అవును. బ్యాంకాక్ షెడ్యూల్ అప్పుడైతే ఉడకబెట్టిన చికెన్, రోటీ, పప్పు, జ్యూస్.. ఇవి మినహా ఏమీ తినేదాన్ని కాదు. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావడానికి రెండు నెలల ముందు నుంచి నేను డైట్ పరంగా కొన్ని నియమాలు పాటించడం మొదలుపెట్టాను. ఒక్కోసారి కేవలం ఉడకబెట్టిన కూరగాయ ముక్కలతోనే సరిపెట్టుకునేదాన్ని.

పాప్ స్టార్ కాబట్టి, కాస్ట్యూమ్స్ కూడా బాగుండి ఉంటాయేమో?
ఒక్క ఫోటో షూట్ కే 200 డ్రెస్సుల వరకూ వాడాను. వైవీయస్ గారు చాలా పర్ ఫెక్షనిస్ట్. కాస్ట్యూమ్ లో చిన్న లోపం ఉన్నా వేరే డిజైన్ చేయించేవారు. ఈ ఒక్క సినిమాకే నేను 250 డ్రెస్సుల వరకూ వాడాను. ఒక వైట్ డ్రెస్ అప్పుడైతే తెగ ఇబ్బందిపడ్డాను. ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత కూర్చోవడానికి కుదరదు. నిలబడే ఉండాలి. చివరికి ప్రకృతి అవపరాలకు కూడా వెళ్లే వీలుండదు. ఇలా ఈ చిత్రం కోసం ఎక్కువే కష్టపడ్డాను. నా పాత్ర ఎంత శక్తిమంతంగా ఉంటుందో అంత గ్లామరస్ గా ఉంటుంది. ఈ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది.

ఎవరినైనా 'రేయ్' అని పిలుస్తారా?
విశేషం ఏంటంటే.. నేనెవర్నీ అలా పిలిచే అమ్మాయి కాదు. చాలా సున్నిత మనస్కురాల్ని. నా మనస్తత్వానికి పూర్తి విరుద్ధమైన పాత్రను ఈ చిత్రంలో చేశాను. చాలా థ్రిల్ గా అనిపించింది.

విలన్ పాత్ర అన్నారు కదా.. ఎలా ఉంటుంది?
ప్రతి ఏడాదీ జరిగే పోటీల్లో 'నంబర్ వన్' స్థానం నాదే కావాలనుకుంటాను. అడ్డొచ్చినవాళ్లను ఇబ్బందులపాలు చేసేస్తాను. అవసరమైతే అడ్డు తొలగిస్తాను. ఈ విషయంలోనే సాయి ధరమ్ కూ, నాకూ మధ్య వైరం ఉంటుంది. హీరోకి దీటుగా ఉండే పాత్ర నాది.

సాయిధరమ్ గురించి చెప్పండి?
మామూలుగా ఏ ఆర్టిస్ట్ అయినా నాలుగైదు చిత్రాల తర్వాత నటన విషయలో మెరుగవుతారు. కానీ, సాయిధరమ్ అందుకు భిన్నంగా, రోజు రోజుకీ తనలో బెటర్ మెంట్ కనిపించింది. మొదట రోజు ఐదు టేక్స్ తీసుకుంటే రెండో రోజు మూడు, ఆ తర్వాత రెండు... ఇలా రాను రాను టేక్స్ తగ్గి, నటుడిగా తన గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. పైగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కాబట్టి, డాన్స్ బాగా చేస్తాడు కదా. తనకి దీటుగా నేనూ చేశాను.

వైవీయస్ చౌదరి గురించి?
రాజీపడిన దర్శకుడాయన. మేం 50 టేక్స్ తీసుకున్నా.. చిరాకుపడేవారు కాదు. 'డోంట్ వర్రీ.. కూల్ గా చేయండి' అని ఎంకరేజ్ చేసి, చేయించేవారు. అలాగే, కాస్ట్యూమ్ లో చిన్న లోపం ఉంటే, ఆ రోజుకి షూటింగ్ పేకప్ చెప్పేసేవారు. అన్నీ పర్ ఫెక్ట్ గా ఉండాలనుకునే దర్శకుడు. అందుకే ఈ చిత్రంలో నటించడం నా లక్ గా భావిస్తున్నా.

ఫైనల్ గా 'రేయ్' రషెస్ చూశారా?
ఇంకా చూడలేదు. కానీ, కొంతమంది చూశారు. వాళ్లు నాకు ఫోన్ చేసి, 'చాలా బాగా చేశావ్. నువ్వు చేసిన బెస్ట్ కారెక్టర్స్ లో ఇదొకటి. సినిమా బాగుంది' అని అభినందించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !