View

వెంకటేష్ యాఫ్ట్ అని జయసుధ, జయప్రద చెప్పారు - డైరెక్టర్ శ్రీప్రియ

Monday,July21st,2014, 06:18 PM

''ఒక స్టార్ హీరో ఇద్దరు పిల్లల తండ్రిగా నటించడం చాలా గొప్ప విషయం. రాంబాబు పాత్రలో వెంకటేష్ నన్ను కూడా ఏడిపించారు'' అని చెప్పారు నటి, డైరెక్టర్ శ్రీప్రియ. విక్టరీ వెంకటేష్, మీనా కాంబినేషన్ లో ఆమె దర్శకత్వం వహించిన 'దృశ్యం' చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతోంది. ఈ సందర్భంగా మీడియాతో తన మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారు శ్రీప్రియ.

ముందుగా 'దశ్యం' సక్సెస్ పట్ల మీ ఫీలింగ్?

చాలా ఆనందంగా ఉంది. మలాయళ వెర్షన్ 'దృశ్యం' చూసినప్పుడే... అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే సినిమా ఇదని గ్రహించాను. తెలుగు వెర్షన్ ని నేను డైరెక్ట్ చేయడం, సినిమాని ప్రేక్షకులు ఆదరించడం చాలా సంతోషంగా ఉంది.

à°ˆ కథకు వెంకటేష్ నే హీరోగా తీసుకోవడానికి  à°•à°¾à°°à°£à°‚?

తెలుగులో à°ˆ సినిమాని రీమేక్ చేద్దామని అనుకున్న తర్వాత హీరో ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించడం మొదలుపెట్టాను.  à°¨à°¾ ఫ్రెండ్స్ జయసుధ, జయప్రదను అడిగాను. వారిద్దరూ వెంకటేష్ ను సూచించారు. ఫ్యామిలీ డ్రామాలకు వెంకటేష్ యాఫ్ట్ అని చెప్పారు. à°ˆ సినిమాలోని రాంబాబు పాత్రకు వంద శాతం న్యాయం చేసారు వెంకటేష్. à°“ స్టార్ హీరో ఇద్దరు పిల్లల తండ్రిగా నటించడం గొప్ప విషయం. ఆయన నటించిన కొన్ని సీన్స్ నాకే కన్నీళ్లు తెప్పించాయి. నేను కన్నీళ్లు పెట్టుకున్న సీన్స్ ఆడియన్స్ ని కూడా కన్నీళ్లు పెట్టించాయి. à°ˆ రోజు à°ˆ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించి మా అందరినీ చాలా సంతోషానికి గురి చేసింది.

మీనా, నదియా ఇద్దరితో చేయడం ఎలా అనిపించింది?

మలయాళ వెర్షన్ హీరోయిన్ మీనానే తెలుగు వెర్షన్ లో కూడా నటించారు. ఆమె ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేసారు. ఓసారి నటించిన పాత్రను మళ్లీ చేస్తుంటే, ఆ నటి చాలా థ్రిల్ ఫీలవుతుంది. ఓ నటిగా నాకు అది బాగా అర్ధమయ్యింది. ఎందుకంటే మీనా ప్రతి సీన్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేసారు. నదియా కూడా పోలీసాఫీసర్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు. ఈ ఇద్దరూ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు.

ఈ సినిమా చాలా త్వరగా పూర్తయిపోయింది కదా?

అవును. ఎక్స్ పీరియన్స్ ఆర్టిస్టుల వల్లే ఇది సాధ్యమయ్యింది. వెంకటేష్ , మీనా, నదియా... ముగ్గురూ తమ వర్క్ ని చాలా డేడికెటెడ్ గా చేసే ఎక్స్ పీరియన్స్ ఆర్టిస్టులు. రామానాయుడు ఫిలిం ఇన్సిట్యూట్ నుంచి వచ్చింది పెద్దమ్మాయిగా నటించిన కృతిక. చిన్నమ్మాయి ఆల్ రెడీ మలయాళంలో పలు సినిమాలు చేసింది. వీళ్లందరి కోవపరేషన్ తో ఈ సినిమాని చాలా త్వరగా పూర్తి చేయగలిగాను.

సురేష్ ప్రొడక్షన్ తో అసోసియేట్ అయ్యి ఈ సినిమా చేయడం ఎలా ఉంది?

సురేష్ ప్రొడక్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 42సంవత్పరాలయ్యింది. ఇంత క్రమశిక్షణ కలిగిన ప్రొడక్షన్ హౌస్ ని నేను చూడలేదు. ఏం కావాలన్నా చిటికెలో అరేంజ్ చేసేస్తారు. దాంతో షూటింగ్ కి ఎలాంటి ఆటంకం కలగదు. నాకు ఆరుగురు అసిస్టెంట్ డైరెక్టర్స్ ని ఇచ్చారు. వారు షెడ్యూల్ ప్లానింగ్ దగ్గర్నుంచి, ఆర్టిస్ట్ లను కో-ఆర్డినేట్ చేసుకుని లొకేషన్ లో నాకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా చూసుకున్నారు. ఏ రోజు ప్లాన్ చేసిన సీన్స్ ఆ రోజే పూర్తయ్యేలా చూసుకునే వాళ్లం. సరైన అసిస్టెంట్స్ లేకపోతే ఇది సాధ్యమయ్యే పని కాదు.

ఈ సినిమాకి అందిన ప్రశంసలు?

దాసరి నారాయణరావుగారు ఈ సినిమాని చూసి చాలా మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది.

నటన, డైరెక్షన్... ఈ రెండింటిలో ఏది ఈజీ?

నటనే చాలా ఈజీ. ఎందుకంటే డైరెక్టర్ చెప్పింది నటించుకుంటూ వెళ్లిపోతాం. కానీ డైరెక్షన్ అంత ఈజీ కాదు... అన్నీ చూసుకోవాలి. ఎక్కువ బాధ్యత డైరెక్టర్ మీద ఉంటుంది. ఆ రకంగా ఒత్తిడి ఫీలవుతాం. ఆ ఒత్తిడిని అధిగమించిన వారు మాత్రమే పర్ ఫెక్ట్ గా సినిమా చేయగలుగుతారు.

 

ఇది రీమేక్ కదా? కాబట్టి మీకు ఈజీ అయిందనుకుంటున్నారా?

నిజం చెప్పాలంటే స్ట్రయిట్ సినిమాలు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఫ్రెష్ థాట్ తో సినిమా చేస్తుంటాం. దాంతో పెద్దగా డౌట్స్ రావు. కానీ రీమేక్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ తో పోల్చి ఈ సినిమా చూస్తారు. నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసుకోకపోతే కూడా విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుంది.

మీకు చిత్ర పరిశ్రమలో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు?

రాధిక, జయప్రద, జయసుధ... à°ˆ ముగ్గురూ నాకు క్లోజ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రాధిక 'దృశ్యం' సినిమా చూడటానికి హైదరాబాద్ వచ్చింది.  à°ˆ రోజు జయసుధ, జయప్రద, రాధికలతో కలిసి à°ˆ సినిమా చూడబోతున్నాను.

మీ రోల్ మోడల్ ఎవరు?

విజయనిర్మలగారు నా రోల్ మోడల్. ఆవిడ ఇన్సిఫిరేషన్ తోనే నేను దర్శకురాలినయ్యాను. పదేళ్ల క్రితం రెండు సినిమాలు చేసాను. దర్శకురాలిగా ఇది నా ఆరో సినిమా. దాసరి నారాయణరావుగారి 'స్వప్న' సినిమాకి నేను వర్క్ చేసాను. దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకోలేదు. కానీ నటించేప్పుడు... డైరెక్టర్లను క్షుణ్ణంగా పరిశీలించేదానిని. అదే నాకు బాగా హెల్ప్ అయ్యింది.

మీ అభిమాన నటులు ఎవరు?

కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్ నా అభిమాన నటులు. పద్మాలయా బ్యానర్ లో ఎక్కువ సినిమాలు చేసాను. కృష్ణగారితో బెజవాడ బొబ్బలి, దొంగలదోపిడీ, పట్నవాసం చిత్రాలు చేసాను. అప్పట్నుంచి కృష్ణ, విజయనిర్మలగారితో నాకు అనుబంధం ఉంది.

ఇప్పటితరం హీరోల్లో మీకు నచ్చే హీరోలెవరు?

రామ్ చరణ్, అల్లు అర్జున్. వారి సినిమాలు చూసాను. ఇద్దరూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. వారి డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం.

 

ఇప్పటి హీరోయిన్ల గురించి చెప్పండి?

ఇప్పటితరం హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ. మా తరంలో మేము అన్ని బాషల్లోనూ నటించేవాళ్లం. అలాగే మాతృభాషలో కూడా బాగా అవకాశాలుండేవి. కానీ ఇప్పుడు తమిళంలో తమిళ హీరోయిన్లు కరువయ్యారు. తెలుగులో తెలుగు హీరోయిన్లు కరువయ్యారు. ఇది ఒకింత బాధకు గురి చేసే విషయం.

మీ 'మాలిని' సినిమా ఎంతవరకూ వచ్చింది?

కొంచెం టాకీ, ఓ పాట బ్యాలెన్స్ ఉంది. ఆర్టిస్ట్ ల డేట్స్ ప్రాబ్లమ్ వల్ల లేటయ్యింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము.

 

తదుపరి ప్రాజెక్ట్స్?

ప్రస్తుతం 'దృశ్యం' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను. 'మాలిని' చిత్రం పూర్తయిన తర్వాత తెలుగులో ఓ స్ట్రయిట్ చిత్రం చేయాలనే ప్లాన్ లో ఉన్నాను. అన్నీ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత చెబుతాను అంటూ 'దృశ్యం' చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు చెప్పారు శ్రీప్రియ.

Director Sripriya interview about Drishyam



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !