View

శ్రీవల్లిని వెంటాడిన గత జన్మ రహస్యాలేంటీ?

Thursday,September14th,2017, 10:48 AM

కథలోని కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే నిర్మాతలుగా మా లక్ష్యం. నేటి ట్రెండ్‌కు తగ్గ జనరంజక చిత్రాల్ని నిర్మించాలన్నదే మా అభిమతం. క్రియేటివిటితో కూడిన నవ్యమైన కథలతో చిత్రాలు తీస్తామని చెబుతున్నారు రాజ్ కుమార్ బృందావనం, సునీత రాజ్‌కుమార్. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఈ దంపతులు నిర్మించిన చిత్రం శ్రీవల్లి. బాహుబలి ఫేం ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. రజత్, నేహా జంటగా నటించారు. ఏరోటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందకురానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రాజ్‌కుమార్ బృందావనం, సునీత రాజ్‌కుమార్ పాత్రికేయులతో తమ మనోభావాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలివి...


సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా..
మా స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. ఈ ప్రాంతం నుంచి ఉద్దండులైన సినీ ప్రముఖులున్నారు. వారి స్ఫూర్తితో అనుకోకుండానే చిత్రసీమపై మమకారం ఏర్పడింది. వినూత్నమై కథా చిత్రం ద్వారా నిర్మాతలుగా సినీరంగంలోకి అడుగుపెట్టాలని సంకల్పించాం. బాహుబలి సిరీస్ చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన విజయ్‌కుమార్‌తో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ద్వారా విజయేంద్రప్రసాద్‌గారితో పరిచయమేర్పడింది. మేము సినిమా తీసే ప్రయత్నాల్లో వున్నామని, ఓ వినూత్నమైన కథ కావాలని ఆయన్ని కోరాం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఆయన చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ కాన్సెప్ట్‌కు విజయేంద్రప్రసాద్‌గారు మాత్రమే న్యాయం చేయగలరని భావించి ఆయనకే దర్శకత్వ బాధ్యతల్ని అప్పగించాం.


తెలుగు తెరపై రాని కాన్సెప్ట్
శ్రీవల్లి అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమెపై ఓ శాస్త్రవేత్త చేసిన ప్రయోగం వల్ల శ్రీవల్లికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇంతకి ఆమెను అంతగా వేంటాడిన గత జన్మ రహస్యాలేమిటి? మనసును కొలవగలిగే వినూత్న ప్రయోగానికి శ్రీవల్లి ఎందుకు ఒప్పుకుంది? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ చిత్ర కథ నడుస్తుంది. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇది. ప్రతిక్షణం మలుపులతో కొత్త అనుభూతినిస్తుంది.


తెలుగులో వినూత్న ప్రయోగం
ఈ సినిమా ఆరంభం నుంచి రాజమౌళి టీమ్ మాకెంతో సహాయసహకారాల్ని అందించింది. ప్రతి విషయంలో మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించింది. చాలా కొత్త కథ ఇది. తప్పకుండా అందరికి నచ్చుతుంది అని సుకుమార్ అభినందించారు. ఒక అమ్మాయిని సైంటిస్ట్‌గా చూపించడం కొత్తగా వుందని, తెలుగులో వినూత్న ప్రయోగాత్మక చిత్రమిదని నిజామాబాద్ ఎంపీ కవితగారు మా సినిమాను మెచ్చుకున్నారు. ఆమె మాటలు మా చిత్ర బృందానికి కొత్త ఉత్సాహానిచ్చాయి. ప్రీరిలీజ్ వేడుకకు రామ్‌చరణ్ అతిథిగా హాజరవడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇలా చిత్ర పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు మా చిత్రానికి స్వచ్ఛందంగా తమ ఆశీస్సులు అందించారు.


అన్ని ఏరియాల బిజినెస్ పూర్తయింది..
వాస్తవానికి ఈ సినిమాను కొద్ది నెలల క్రితమే విడుదల చేయాల్సివుంది. గ్రాఫిక్స్ పనుల కోసం అదనపు సమయాన్ని వెచ్చించడంతో విడుదల ఆలస్యమైంది. సినిమాకు అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తయింది. దాదాపు 200లకు పైగా థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు కలిగిన విజయేంద్రప్రసాద్ వంటి రచయిత ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడంతో సినిమా కోసం యావత్ ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.


సుకుమార్ రైటింగ్స్‌లో తదుపరి చిత్రం..
కథలోని కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే నిర్మాతలుగా మా లక్ష్యం. సుకుమార్ స్వీయ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌లో తదుపరి సినిమాను చేయబోతున్నాం. రాజ్‌తరుణ్ హీరోగా నటించే ఈ చిత్రానికి సూర్యప్రతాప్ (కుమారి 21ఎఫ్ ఫేమ్) దర్శకత్వం వహిస్తారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. ఎప్పటికైనా పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాలన్నదే నిర్మాతలుగా మా అభిలాష. ఆ శుభతరుణం కోసం ఎదురుచూస్తున్నాము.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !