View

ఇంటర్య్వూ - సందీప్ కిషన్ (నిను వీడని నీడను నేనే)

Monday,July08th,2019, 01:29 PM

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ సమర్పణలో రూపొందిన à°ˆ సినిమా జూలై 12à°¨ విడుదల కానుంది. à°ˆ సందర్భంగా సందీప్ కిషన్ తో ఇంటర్వ్యూ ...


*నిను వీడని నీడను నేనే... ఆ నీడ ఎవరు?*
'వెన్నెల' కిషోర్! అతడు నన్ను ఎందుకు వీడటం లేదనేది à°•à°¥. కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ సినిమా చూశా. మంచి సినిమా చేశాననే ఫీలింగ్ వచ్చింది. కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాను. నాకు అయితే సినిమా చాలా చాలా నచ్చింది. బావుంది. నేను కాదు, హీరోయిన్‌à°•à°¿ à°¡‌బ్బింగ్ చెప్పాక... చిన్మయి 'అరే... మంచి సినిమా తీశావ్' అని చెప్పింది. రీరికార్డింగ్‌à°•à°¿ à°¤‌à°®‌న్‌à°•à°¿ సినిమా పంపిస్తే, ఫోన్ చేసి 'డార్లింగ్... సినిమా సూపర్ ఉంది. హిట్' అన్నాడు. 'బావుందా?' అని à°…à°¡à°¿à°—à°¾. 'డౌట్స్ ఏం పెట్టుకోకు. హిట్' అన్నాడు. శుక్రవారం థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా బావుందని అంటారు. నాకు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది.


*సినిమా కథేంటి?*
ట్రైలర్ చూసుకుంటారు. అందులో సినిమా కథంతా చెప్పేశాం. స్క్రీన్‌ప్లే కూడా! à°’à°• అబ్బాయి ప్రేమలో పడతాడు. à°’à°• రోజు à°²‌à°µ‌ర్‌తో à°•‌లిసి కారులో వెళ్తుండ‌à°—à°¾ యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత నుంచి అద్దంలో చూసుకుంటే తన బదులు మరొకరు కనిపిస్తారు. ఎందుకలా కనిపిస్తున్నారు? అనేది à°•à°¥. న్యూ ఏజ్ సినిమాను కొంచెం కమర్షియల్ పంథాలో చెప్పడానికి ప్రయత్నించాం.


*మరి, గ్రీస్‌లో కుర్రాడి à°•‌థేంటి?*
నేను చెప్పను. మీరు సినిమాలో చూడండి. ఆ కుర్రాడి ఆత్మ 'వెన్నెల' కిషోర్ కావొచ్చు. పూర్వ జన్మలో నేనే 'వెన్నెల' కిషోర్ కావొచ్చు. ఆ కథను మేం రిఫరెన్స్ తీసుకున్నామా? అనేది తెరపై చూడాలి. హారర్ ఫాంటసీ ఫిల్మ్. ఎమోషన్ కూడా ఉంటుంది.


*ప్రేమకథలు, కామెడీ థ్రిల్లర్స్ చేశారు. ఇప్పుడు హారర్ టచ్ చేశారు!*
నాకు హారర్ సినిమాలు ఇష్టం. చూస్తూ ఎంజాయ్ చేస్తాను. యాక్ట‌ర్‌à°—à°¾ à°ª‌ర్‌ఫార్మెన్స్‌à°•à°¿ స్కోప్ ఉండదని ఫీలింగ్‌తో హార‌ర్ జాన‌ర్ à°Ÿ‌చ్ చేయ‌లేదు. హారర్ జానర్ ట్రెండ్ నడిచినప్పుడు కూడా నేను అటువైపు వెళ్ళలేదు. కానీ, à°ˆ à°•à°¥ విన్నప్పుడు హారర్ ను మించి à°’à°• విషయం ఉంది. అది నన్ను బాగా ఎగ్జయింటింగ్ అనిపించింది. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు కూడా ఇదొక హారర్ సినిమా అని చెప్పరు. వేరే అనుభూతితో వస్తారు. అందుకని, ఇన్నాళ్లు యాక్ట్ చేసిన నేను à°ˆ సినిమాతో నిర్మాతగా మారాను.


*హారర్ కామెడీలు, హారర్ థ్రిల్లర్స్ వచ్చాయి. 'నిను వీడని నీడను నేను' ఎలాంటి సినిమా?*
హారర్ యూనివర్సల్ జానర్. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'లా తీసినా హిట్ అవుతుంది. 'గృహం'లా తీసినా, 'ప్రేమకథా చిత్రమ్'లా తీసినా హిట్ అవుతుంది. మా సినిమాలో కామెడీ ఉంటుంది. కానీ, కామెడీ కోసమని ఎక్కడా కామెడీ పెట్టలేదు. సినిమాలో నాకు అద్దంలో కనిపించేది 'వెన్నెల' కిషోర్. అంతకంటే ఏం చెప్పను? కథలో భాగంగా కామెడీ వస్తుంది. పోసాని కృష్ణమురళిగారు ఇరగదీశాడు. హారర్, కామెడీ కంటే ఎమోషన్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది.


*హారర్ సినిమాలు చేయకూడదనుకున్న మిమ్మల్ని దర్శకుడు ఎలా ఒప్పించారు?*
కథ చెప్పడానికి వచ్చే ముందు హారర్ సినిమా అని చెప్పలేదు. 'కొత్త కథ ఒకటుంది. వినండి' అంటే కలిశా. కథ చెప్పడం స్టార్ట్ చేశారు. పది నిమిషాలకు హారర్ కథ చెప్తున్నారేంటి? అనుకున్నాను. ముందుకు వెళ్లగా వెళ్లగా కథ స్వరూపమే మారింది. ఇదొక జానర్ షిఫ్టింగ్ ఫిలిం. కథ 2043లో మొదలవుతుంది. మళ్ళీ వర్తమానానికి వస్తుంది. ప్రజెంట్ నుంచి మళ్లీ ఫ్యూచర్ కి వెళ్తుంది. హారర్ జానర్ దాటి ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒక ఐదు నిమిషాల పాటు 25 ఏళ్ల తరవాత ప్రపంచం ఎలా ఉంటుందనేది చూపించాం.


*నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకోవడానికి కారణం ఏంటి?*
అందరికీ తెలిసిందే... గత రెండేళ్లలో నా సినిమాలు ఏవీ ఆడలేదు. లాస్ట్ మూడు సినిమాలు సరిగా లేవు. వాటిని నేనే థియేటర్లలో చూడలేదు. 'నక్షత్రం' తర్వాత నన్ను నేను వెండితెరపై చూసుకోలేదు. ఈ శుక్రవారం సంతోషంగా చూసుకుంటా. ఇంతకు ముందు సినిమాలు... ప్రతిసారీ తప్పు ఎక్కడ జరుగుతుందో విడుదలకు ముందు తెలుస్తుంది. విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా ఆ తప్పులే చెబుతున్నారు. ఒకవేళ ఆ తప్పులు జరగకుండా కాపాడుకోగలిగితే? అందుకే. నిర్మాతగా మారాను. గత సినిమాల్లో తప్పులకు నేను ఎవరినీ తప్పుబట్టడం లేదు. నేనే కథలు విని ఒప్పుకున్నవాడినే కదా. ఈ సినిమా వరకూ నేను నమ్మిన విధంగా తీయాలనుకుని తీశా. టీజర్ కంటే ట్రైలర్, ట్రైలర్ కంటే సినిమా బావుండాలనే కష్టపడ్డాను. భయంకరంగా కథకు ఏం కావాలో అది ఖర్చుపెట్టాను. థియేటర్లో ప్రేక్షకుడు బయటకు వచ్చేటప్పుడు బావుందనే ఫీలింగ్ తో రావాలనే సింగిల్ పాయింట్ అజెండాతో చేశా.


*ఈ సినిమాకు నిర్మాతగా కష్టపడ్డారా? నటుడిగా కష్టపడ్డారా?*
సుమారు పాతిక సినిమాలు చేశాను కాబట్టి నటించడం అలవాటే. ప్రతి సినిమాకు నటుడిగా రెండొందల శాతం కష్టపడతా. అందువల్ల, 'నక్షత్రం' షూటింగులో గాయం కావడం వలన నెత్తిపై 12 కుట్లు పడ్డాయి. మొన్న 'తెనాలి రామకృష్ణ' షూటింగులో కంటికింద గాయమైంది. సో... నటించడం కష్టం కాదు. ఈ సినిమాకు నేను ఆ ప్రెజర్ తీసుకోలేదు. ప్రొడక్షన్ ప్రెజర్ తీసుకున్నాను. అనుకున్నది అనుకున్నట్టుగా తీయాలని, చెప్పిన తేదీకి విడుదల చేయాలనీ ప్రెజర్ తీసుకున్నాను. మంచి మంచి టెక్నీషియన్లను తీసుకున్నాను. స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాను. ఇప్పుడు 12న థియేటర్లలోకి వస్తున్నాను. ఈ ప్రయాణంలో నా ఫ్రెండ్, సినిమా నిర్మాతల్లో ఒకరైన దయా పన్నెం అందించిన సహకారం మరువలేనిది. అలాగే, 'జెమిని' కిరణ్ గారు, అనిల్ సుంకరగారు చాలా హెల్ప్ చేశారు.


*నిర్మాతగా బాగా సంతోషపడిన సందర్భం?*
ఇటీవల హిందీలో పేరున్న దర్శక నిర్మాతలు సినిమా చూసి రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. వాళ్లు ఎవరనేది త్వరలో ప్రకటిస్తా. నేను కంటెంట్ నమ్మి సినిమా చేశాను. వాళ్లకు అదే కంటెంట్ నచ్చి రీమేక్ రైట్స్ కొన్నారు.


*మీ తదుపరి చిత్రాలు?*
జి. నాగేశ్వరరెడ్డిగారి దర్శకత్వంలో నటిస్తున్న 'తెనాలి రామకృష్ణ' షూటింగ్ మరో 20 రోజులు బాలన్స్ ఉంది. 'నిను వీడని నీడని నేను' విడుదల తరవాత షూటింగ్ పూర్తి చేసి, రెండు మూడు నెలల్లో విడుదల చేస్తాం. à°ˆ సినిమాతో పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్ సినిమా. అవుట్ అండ్ అవుట్ కామెడీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌. అమెజాన్ కోసం మనోజ్ బాజ్‌పాయ్‌గారితో à°•‌లిసి రాజ్-డీకే దర్శకత్వంలో 'ది ఫ్యామిలీ మాన్' అని హిందీ వెబ్ సిరీస్‌లో à°¨‌టించాను. షూటింగ్ పూర్తయింది. యాక్షన్ ప్యాక్డ్ రోల్ చేశా. మరో తెలుగు సినిమా చర్చల దశలో ఉంది. త్వరలో వివరాలు వెల్లడిస్తా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !