View

'సూర్య వర్సెస్ సూర్య' విషయంలో అందరూ హ్యాపీ - నిర్మాత శివకుమార్

Friday,March13th,2015, 05:47 PM

''సూర్య వర్సెస్ సూర్య పంపిణీదారులు హ్యాపీగా ఉన్నారు'' అన్నారు నిర్మాత మాల్కాపురం శివకుమార్. బేబి త్రిష సమర్పణలో నిఖిల్‌, త్రిద జంటగా సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘సూర్య వర్సెస్‌ సూర్య'. ప్రయోగాత్మక చిత్రంగా రూపొందిన 'సూర్య వర్సెస్ సూర్య' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. à°ˆ సందర్భంగా నిర్మాత శివకుమార్ తో జరిపిన ఇంటర్య్వూ...

సినిమా రిజల్ట్ పట్ల ఎలా పీలవుతున్నారు?
సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం, అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సురక్ష ఎంటర్ టైన్ మెంట్స్ పేరిట ఎడ్యుకేషనల్ సంస్థలు, హాస్పిటాల్టీ వంటివి రన్ చేస్తున్నాం. ఈ సంస్థ నుంచి మంచి ఎంటర్ టైన్ మెంట్ మూవీని అందించాలనే ఆలోచనతో 'సూర్య వర్సెస్ సూర్య' చేసాము. సినిమా విజయం సాధించడం మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ముందుముందు ఈ బ్యానర్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయి.

ఈ చిత్రకథ వినగానే మీకేమనిపించింది?
కార్తీక్ ఈ స్ర్కిఫ్ట్ చెప్పగానే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. కాన్సెఫ్ట్ కొత్తగా అనిపించింది. 'కార్తికేయ' సినిమా సమయంలో చందు మొండేటి, వెంకట్ శ్రీనివాస్ నాకు చాలా దగ్గరయ్యారు. వారి పరిచయమే నన్ను ఈ సినిమా నిర్మించేలా చేసింది. కార్తీక్ చాలా గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచాడు. కథ విన్న వారందరూ ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందని చెప్పారు. మా అందరి నమ్మకం నిజమయ్యింది.

సినిమా పంపిణీదారులు హ్యాపీగా ఉన్నారా?
సినిమాని పంపిణీ చేసిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు. సినిమా విడుదలకు ఓ వారం ముందే ఫ్యాన్సీ ఆఫర్స్ ఇచ్చి డిస్ర్టిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. వాళ్లందరూ పెట్టిన డబ్బులు తిరిగి వచ్చేసాయి. అందరూ ఈ విషయం చెప్పి చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు మొత్తం కలిపి 628 థియేటర్స్ లో సినిమాని విడుదల చేసాం. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా రన్ అవుతోంది. ఇప్పటికి సినిమా విడుదలై రెండు వారాలు అయ్యింది. ఇంకా 200 థియేటర్స్ లో మంచి వసూళ్లు రాబడుతూ ఈ సినిమా స్ర్కీనింగ్ అవుతోంది.

ఈ సినిమాలోని నటీనటుల గురించి చెప్పండి?
నిఖిల్ సొంత సినిమాలా భావించి చేసాడు. తను సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటాడు. నిఖిల్ లోని వర్క్ డెడికేషనే అతనిని మంచి స్థాయికి తీసుకెళ్లింది. కాన్సెఫ్ట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఎక్కవ శాతం రాత్రిళ్లు చేయాల్సి వచ్చింది. అయినా సరే సీనియర్ నటులు తనికెళ్ల భరణిగారు ఎంతో సహకరించారు. కొత్త అమ్మాయి అయినా త్రిద చాలా బాగా నటించింది. హీరో తల్లి పాత్రలో మధుబాలగారు చక్కగా ఒదిగిపోయారు. కథకు తగ్గ ఆర్టిస్ట్ లు కుదిరారు. అప్పుడే మేము సగం విజయం సాధించాం. సినిమా విడుదలైన తర్వాత అందరూ ఇదే మాట అంటున్నారు.

డైరెక్టర్ కార్తీక్ గురించి చెప్పండి?
కార్తీక్ కి మంచి భవిష్యత్తు ఉంది. ఫుల్ గ్రిప్ త్ సినిమా చేయగల సత్తా కార్తీక్ కి ఉంది. ఈ సినిమా అతనిలోని టాలెంట్ ని బయటపెట్టింది.

మీ తదుపరి ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. కొంత గ్యాప్ తీసుకుని కథలు వింటాను. మా బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వకుండా ఫ్యామిలీ స్ ని ఆకట్టుకునే విధంగా ఉండాలనేది నా ఆలోచన. కాబట్టి అలాంటి కథలనే ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తాను. ఇకనుంచి ఏడాదికి రెండు సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. వచ్చే ఏడాది ఓ అగ్ర హీరోతో సినిమా ఉంటుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !