View

మొహమాటం కోసం చాలా చేశాను - వరుణ్ సందేశ్

Sunday,July20th,2014, 04:39 AM

"ఏడేళ్లల్లో దాదాపు 15 సినిమాలకు పైగా చేయగలిగాను. మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఇంతకన్నా ఏం కావాలి? అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో నా కెరీర్ లో విజయాల శాతం తక్కువగా ఉండటం మాత్రం చాలా బాధగా ఉంది'' అని చెప్పారు వరుణ్ సందేశ్. రేపు (21.07.) ఆయన పుట్టినరోజు. వరుణ్ నటించిన తాజా చిత్రం 'నువ్వలా నేనిలా' విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకా 'లవకుశ' అనే చిత్రంలో డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. ఇక.. పుట్టినరోజు సందర్భంగా వరుణ్ తో జరిపిన ఇంటర్వ్యూలోకి ఎంటరవుదాం...

హాయ్ వరుణ్... మీకిది ఎన్నో పుట్టినరోజు?

25 నిండాయి. 26 లోకి ఎంటరయ్యాను. నటుడిగా ఇప్పటివరకు ఏడు పుట్టినరోజులు జరుపుకున్నాను. హీరో అయిన తర్వాత నా మొదటి పుట్టినరోజుని 'హ్యపీ డేస్' సెట్లో జరుపుకున్నాను. ఆ చిత్రం కోసం సీబీఐటి కాలేజీకి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నప్పుడు శేఖర్ గారే నాతో కేక్ కట్ చేయించారు. ఆ బర్త్ డేని ఎప్పటికీ మర్చిపోలేను.

ఏడేళ్ల కెరీర్ ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది?

నా తొలి, మలి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. à°† తర్వాత  à°† స్థాయిలో సక్సెస్ లు లేవు. మొహమాటం కోసం కొన్ని సినిమాలు., అసలు పారితోషికమే లేకుండా కొన్ని సినిమాలు చేశాను. ఫ్లాప్ అయిన సినిమాల్లో కొన్ని మంచివి కూడా ఉన్నాయి. కానీ, వాటిని సరిగ్గా ప్రమోట్ చేయకపోవడంవల్ల ఆశించిన ఫలితం రాలేదు. మంచి సినిమా చేస్తే చాలదు... ప్రమోషన్ చాలా ముఖ్యం. అందుకే, ఇకనుంచి దానిపై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాను.

మొహమాటానికి, పారితోషికం తీసుకోకుండా కొన్ని సినిమాలు చేశానన్నారు... అవి ఏ సినిమాలు?

అయిపోయిందేదో అయిపోయింది. వాటి గురించి వదిలేద్దాం. కానీ, ఇకనుంచీ జాగ్రత్తపడాలనుకుంటున్నా. కాకపోతే ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా... వరుసగా నా సినిమాలు ఫ్లాప్ అయినా, నన్ను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారు. ఏ సినిమాకైనా నా కష్టంలో లోపం ఉండదని వాళ్లు అర్థం చేసుకున్నారు. అందుకు వారందరికీ కృతజ్ఞతలు.

'హ్యపీ డేస్'తో చాలా వైభవంగా మీ కెరీర్ ప్రారంభమైంది.. అది తల్చుకుంటే ఏమనిపిస్తోంది?

వాస్తవానికి హీరోగా ఓ రెండు, మూడు సినిమాలు చేసిన తర్వాత 'హ్యపీ డేస్', 'కొత్త బంగారు లోకం' చిత్రాలు వచ్చి ఉంటే బాగుండేదనిపిస్తోంది. ఆ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో అంచనాలు ఎక్కువయ్యాయి. దాంతో నా తదుపరి చిత్రాలు ఫర్వాలేదనే విధంగా ఉన్నప్పటికీ అంచనాలు భారీగా ఉండటంతో ప్రేక్షకులు సంతృప్తి పడలేదు.

ప్రస్తుతం చేస్తున్న 'నువ్వలా నేనిలా' సినిమా మీ కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది?

త్రినాధ రావుగారు దర్శకత్వం వహించిన 'మేం వయసుకు వచ్చాం' సినిమా నాకు చాలా ఇష్టం. అందుకే, ఆయన దర్శకత్వంలో 'ప్రియతమా నీ వచట కుశలమా'à°•à°¿ అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకున్నా. అది కూడా  à°šà°¾à°²à°¾ మంచి సినిమా. à°† సినిమా సమయంలోనే 'నీతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నా' అని త్రినాధ రావుగారు అన్నప్పుడు, à°•à°¥ కూడా వినకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా. à°ˆ మధ్యకాలంలో నేను చేసిన చిత్రాల్లో 'ఏమైంది ఈవేళ' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. à°ˆ 'నువ్వలా నేనిలా' à°† స్థాయి విజయం సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది.

'లవకుశ' అనే సినిమా చేస్తున్నట్లున్నారు.. ఆ సినిమా గురించి చెప్పండి?

ఇందులో నేను డ్యుయెల్ రోల్ చేస్తున్నాను. రెండు పాత్రలు చేయడం అంత సులువు కాదని అర్థమైంది. పాత 'లవకుశ'కి, దీనికీ సంబంధం లేదు. ఈ చిత్రంలో నా పాత్రల పేర్లు లవ, కుశ. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ఈ సినిమా కూడా నాకు ప్లస్ అవుతుంది.

యువహీరోల్లో మీతో ఎవరు స్నేహంగా ఉంటారు?

మనోజ్, 'అల్లరి' నరేష్, నాని, తనీష్.. మేమందరం మంచి ఫ్రెండ్స్. మీరు చూస్తూనే ఉంటారు కదా.. మాలో ఎవరి సినిమా ఆడియో ఫంక్షన్ జరిగినా, మేమందరం పాల్గొంటున్నాం.

విడిగా కూడా కలుస్తుంటారా?

ఎవరి షూటింగ్గ్స్ లో వాళ్లు బిజీగా ఉంటాం కాబట్టి, రెండు వారాలకోసారి తప్పనిసరిగా కలవడానికి ట్రై చేస్తాం.

ఇంతకీ  à°ªà±†à°³à±à°²à±†à°ªà±à°ªà±à°¡à± చేసుకుంటారు?

ఇంకా దాని గురించి ఆలోచించలేదండి

పెళ్లీడులోనే ఉన్నారు కదా.. ఆలోచించకపోవడం ఏంటి?

పెళ్లి గురించి అదే పనిగా ఆలోచించడంలేదు కానీ.. రెండేళ్లల్లో చేసుకోవాలనుకుంటున్నాను.

లవ్ మ్యారేజ్ చేసుకుంటారా?

ఏమోనండి. ఇప్పటివరకూ ప్రేమలో అయితే పడలేదు. నచ్చిన అమ్మాయి తారసడితే లవ్ మ్యారేజ్... లేకపోతే అమ్మా, నాన్నలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.

ఓకే వరుణ్.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

చాలా థ్యాంక్సండీ..

 

Varun Sandesh Speaks about His Projects



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !