View

'దృశ్యం' తరహా సినిమా ఇప్పటివరకూ రాలేదు - హీరో వెంకటేష్

Monday,July07th,2014, 03:51 PM

''ప్రేమ, వినోదం, సెంటిమెంట్... ఇలా అన్ని రకాల భావోద్వేగాలున్న చిత్రం 'దృశ్యం'. ఓ యూనివర్శల్ కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. అందుకే ఏ భాషకైనా నప్పుతుంది'' అని చెప్పారు వెంకటేశ్. మలయాళ చిత్రం 'దృశ్యం' రీమేక్ లో ఆయన కథానాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ తో జరిపిన ఇంటర్వ్యూ...

మలయాళ 'దృశ్యం' చూడగానే ఏమనిపించింది?

ఇది చాలా అద్భుతమైన సినిమా. ఎవరైనా సరే ఈ కథతో కనెక్ట్ అవుతారు. నిత్యజీవితంలో ఏ కుటుంబంలో అయినా ఈ చిత్రంలోలాంటి సంఘటనలు జరగొచ్చు. ఈ మధ్యకాలంలో మంచి కథలు అరుదుగా మాత్రమే దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాని వదులుకుంటే మంచి కథను మిస్సయినట్లే అనిపించింది. అందుకే ఈ చిత్రం రీమేక్ లో నటించాలనుకున్నాను.

ఈ చిత్రంలో రాంబాబు (వెంకటేష్ పాత్ర పేరు) ఏం చేస్తాడు?

కేబుల్ టీవీ ఆపరేటర్. ఎప్పుడూ సినిమాలు చూస్తుంటాడు. ఇంటికి తక్కువగా వెళుతుంటాడు. కానీ, భార్య, పిల్లలంటే చాలా ప్రేమ. రాంబాబు కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి వారి జీవితంలో ఓ దృశ్యం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కుటుంబం ఎలాంటి సంఘర్షణకు గురయ్యిందనేది సినిమా.

ఈ సినిమాలో తనకెదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి రాంబాబు సినిమాలు చూస్తుంటాడట?

అవును. కొన్ని సమస్యలకు సినిమాల్లో కూడా పరిష్కారం కనిపిస్తుంది. అలాగే, ఈ చిత్రంలో తన కుటుంబానికి ఎదురయ్యే క్లిష్టమైన సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని రకరకాల సినిమాలు చూస్తాడు రాంబాబు.

ఇందులో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయా?

ఉన్నాయి. నేను నటించిన ప్రేమ, వసంతం, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రాలు చూసినవాళ్లు 'వెంకటేష్ బాగా ఏడుస్తాడు' అని అంటారు. ఈ సినిమాలో కూడా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అవి అందర్నీ కదిలిస్తాయి.

'దృశ్యం' ప్రేక్షకులను ఎలాంటి అనుభూతికి గురి చేస్తుంది?

సినిమా మొదలైన కాసేపటికి వరకూ చాలా ఆనందంగా సాగుతుంది. ఆ తర్వాత అసలు మలుపు వస్తుంది. ఇక, అప్పట్నుంచి తాము చూస్తున్నది సినిమా కాదు.. నిజంగా జరుగుతుందనే భావనకు గురవుతారు. ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్ అదే.

మీరిప్పటివరకు ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. ఆ చ్రితాలకూ, ఈ కుటుంబ కథా చిత్రానికీ ఉన్న వ్యత్యాసం ఏంటి?

కుటుంబం కథా నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటిసారి. నాకు చాలా ఫ్రెష్ గా అనిపించింది. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. నాకు తెలిసి ఈ తరహా సినిమా రాలేదు.

మలయాళం 'దృశ్యం'లో హీరోగా నటించిన మోహన్ లాల్ ని కలిసారా?

మోహన్ లాల్ తో మాట్లాడాను. ఆయన అద్భుతమైన నటుడు. బాడీ లాంగ్వేజ్, వాయిస్ బాగుంటాయి. మోహన్ లాల్ చేసిన పాత్రలు చేయడం అంత సులువు కాదు. ఆయన నటించిన వేరే సినిమాలైతే నేను అంగీకరించి ఉండను. కానీ, 'దృశ్యం' నాకు తగ్గట్టుగా ఉండటంతో చేశాను.

చాలా కాలం తర్వాత మీనాతో నటించారు.. ఎలా అనిపించింది?

చంటి, సుందరకాండ, అబ్బాయిగారు.. ఇలా నేను, మీనా కలిసి గతంలో దాదాపు నాలుగైదు సినిమాలు చేశాం. మళ్లీ మీనాతో సినిమా చేయడం ఆనందం అనిపించింది. ఈ చిత్రంలో పరిణితి చెందిన గృహిణి పాత్రను అద్భుతంగా చేసింది.

లేడీ డైరెక్టర్ శ్రీప్రియతో సినిమా చేయడం గురించి?

శ్రీప్రియ మంచి నటి. ఆల్రెడీ ఒక సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని చాలా క్లారిటీగా తీశారామె. శ్రీప్రియతో సినిమా చేయడం మంచి అనుభూతికి గురి చేసింది.

జనరల్ గా మీరు ఏదైనా సినిమా చూసినప్పుడు అందులోని ఎమోషనల్ సీన్స్ చూసి, నిజంగా కూడా ఫీలవుతారా?

డెఫినెట్ గా ఫీలవుతాను. ఒక సినిమాలో ఏడ్చే సీన్ ఉందనుకోండి.. మనం కూడా ఆటోమేటిక్ గా ఏడుస్తాం. అలాగే నవ్వే సీన్స్ కి నవ్వితే ఆ సీన్ పండినట్లే. నేనెంత సినిమా ఆర్టిస్ట్ ని అయినా, తెరపై కనిపించేది నిజం కాదని తెలిసినా, ఎమోషనల్ సీన్స్ కి కదలిపోతాను.

'ఓ మై గాడ్'కి రీమేక్ గా మీరు చేస్తున్న 'గోపాలా గోపాలా' గురించి?

ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. త్వరలో ఆరంభం కాబోయే రెండో షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటాడు. ఇది కూడా చాలా మంచి సినిమా.

దేవుణ్ణి నమ్మే మీరు ఈ సినిమాలో దేవుడిపై కేసు పెడతారట కదా?

అదే విచిత్రం. అందుకే ఈ సినిమాని నేను సవాల్ గా తీసుకున్నా.

మారుతి దర్శకత్వంలో 'రాధ' అంగీకరించారు కదా.. అదేమైంది?

ఆ సినిమా లేదు.

తదుపరి చేయబోయే చిత్రాల గురించి?

కథలు వింటున్నాను. ఇంకా ఏదీ ఫైనలైజ్ చేయలేదు.

డిఫరెంట్ క్యారెక్టర్ప్ చేయడానికి ఇష్టపడతారు కదా? మరి విలన్ à°—à°¾ చేస్తారా? 

నేను విలన్ గానా... ఆ పాత్ర చేయమని నన్నెవ్వరైనా అప్రోచ్ అవుతారనుకుంటున్నారా... ఒకవేళ అయినా ప్రేక్షకులు చూడాలిగా అని నవ్వుతూ ఇంటర్వ్యూకి ముగింపు పలికారు వెంకీ.

Venkatesh interview about 'Drushyam'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !