View

విలువలతో కూడిన సినిమాలు - రంగంలోకి అగ్ర నిర్మాణ సంస్థలు  

Friday,July21st,2023, 01:02 PM

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కె.ఆర్‌.జి స్టూడియోస్ 6వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ టి.వి.ఎఫ్.మోష‌న్ పిక్చ‌ర్స్‌తో చేతులు క‌లిపింది. ఈ రెండు భారీ ప్రొడ‌క్ష‌న్ హౌసెస్ ద‌క్షిణాది భాష‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాయి. వీరిద్ద‌రూ భాగ‌స్వామ్యులుగా విలువ‌ల‌తో కూడిన వైవిధ్యమైన సినిమాల‌ను రూపొందించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. 


సినీ రంగంలో ఓ సరికొత్త మార్పును తీసుకు రావ‌టానికి కె.ఆర్‌.జి.స్టూడియోస్ సిద్ధ‌మైంది. అందులో భాగంగా వైవిధ్య‌మైన క‌థాంశాల‌ను సిద్ధం చేసి వాటిన ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సినిమాగా రూపొందించి ప్రేక్ష‌కుల‌కు అందించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టం వ‌ల్ల  కొత్త ఆలోచ‌న‌లతో క‌థ‌లు, సినిమాలు రూపొందుతాయ‌న‌టంలో సందేహం లేదు. ఈ సంద‌ర్భంగా..


కె.ఆర్‌.జి.స్టూడియోస్ అధినేత కార్తీక్ గౌడ మాట్లాడుతూ ``ఆరేళ్ల క్రితం క‌న్న‌డతో పాటు ఇత‌ర ప్రాంతీయ భాష‌ల్లో వైవిధ్య‌మైన, అర్థ‌వంతమైన‌ సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఉద్దేశంతో కె.ఆర్‌.జి.స్టూడియోస్‌ను ప్రారంభిచాం. అందుకోసం స్టోరీ డెవ‌ల‌ప్‌మెంట్, ప్ర‌క్కా ప్రణాళిక‌తో దాన్ని అమ‌లు చేయ‌టం, గ్రాండ్‌గా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయ‌టంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాం. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌ట‌మే మా ఆలోచ‌న‌. అందుకోసం టి.వి.ఎఫ్ వంటి మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ‌తో భాగ‌స్వామ్యం అయ్యాం. మీడియా మ‌రియు ఎంట‌ర్‌టైన్మెంట్‌లో అనుభ‌వ‌జ్ఞుడైన విజ‌య్ సుబ్ర‌మ‌ణ్యం ఈ ప్ర‌యాణంలో భాగ‌మైనందుకు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం`` అన్నారు. 


టి.వి.ఎఫ్ వ్య‌వ‌స్థాప‌కుడు అరుణ‌భ్‌కుమార్ మాట్లాడుతూ ``సినీ రంగంలో  వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తీసుకుని రావ‌టమే స్ఫూర్తిగా మా ప్ర‌యాణాన్ని ప్రారంభించాం. ర‌త్న‌న్ ప్ర‌పంచ‌, గురుదేవ్ హోయ‌శాల వంటి చిత్రాల‌ను నిర్మించిన సంస్థ‌తో చేతులు క‌ల‌ప‌టంపై చాలా ఆనందంగా ఉంది. డిఫ‌రెంట్ క‌థాంశాల‌తో క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తాం`` అన్నారు.

 

టీవీఎఫ్ అధ్యక్షుడు విజయ్ కోషీ మాట్లాడుతూ.. ‘మేం నిరంతరం రియలిస్టిక్ సినిమాలు, సహజత్వంతో కూడిన కథలను చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం.  ప్రాంతీయ సరిహద్దులను చెరిపి పాన్ ఇండియన్ లెవెల్లో సక్సెస్ అయిన కేఆర్‌జీతో ప్రస్తుతం మేం కలిసి పని చేసేందుకు సిద్దమయ్యాం. మా రెండు సంస్థలో క్రియేటివిటీ అనేది కామన్‌గా ఉంది. ఇకపై మా రెండు సంస్థలు కలిసి అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందిస్తామ’ని అన్నారు.


టీవీఎఫ్ గురించి..టీవీఎఫ్‌ను అరునభ్ కుమార్ స్థాపించి దాదాపు దశాబ్దం కావొస్తుంది. టీవీఎఫ్ అప్పటి వరకు వచ్చిన సినిమాలను, కథలను చెప్పే విధానాన్ని మార్చేసింది. ప్రస్తుతం యువతరం అభిరుచికి తగ్గట్టుగా చిత్రాలు నిర్మిస్తూ వచ్చింది. మీడియా అవుట్ లెట్స్, ప్రొడక్షన్ కంపెనీలను ప్రారంభించింది. ఇండియాలో అత్యున్నతమైన వెబ్ కంటెంట్‌ను ఇవ్వడంతో టీవీఎఫ్ ముందుంటుంది.


కేఆర్‌జీ గురించి..కార్తీక్ గౌడ, యోగి జీ రాజ్ సంయుక్తంగా ఈ సంస్థను ఆరేళ్ల క్రితం స్థాపించారు. కన్నడ ప్రేక్షకులకు అద్భుతమైన, గొప్ప కథలను అందించేందుకు ప్రారంభించారు. ఇది వరకు ఎన్నడూ చూడని భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వస్తోంది. కన్నడలోని గొప్ప కథలను ప్రేక్షకులకు అందిస్తుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !